E-Paper
Advertisement

అఖిల్ రాజ్ తప్పు లేదు.. నా బర్త్‌డే రోజే ఆ వీడియో తీసి బుక్కయ్యా: డెలివరీ బాయ్ కామెంట్స్ వైరల్!

అఖిల్ రాజ్ తప్పు లేదు.. నా బర్త్‌డే రోజే ఆ వీడియో తీసి బుక్కయ్యా: డెలివరీ బాయ్ కామెంట్స్ వైరల్!
Advertisement

Akhil raj  Controversy: గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ అవుతున్న ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్ర హీరో అఖిల్ రాజ్ మరియు ఫుడ్ డెలివరీ బాయ్ రమేష్ మధ్య జరిగిన వివాదం ఇపుడు మరో మలుపు తీసుకుంది.అవును …అసలు జరిగిన గొడవకి కారణం నేనే అంటూ ఒక ఇంటర్వ్యూలో ఓపెన్ అయిపోయాడు డెలివరీ బాయ్ రమేష్.

విషయంలోకి వెళ్తే ఎదురుగా ఉన్న ప్లాట్ లో ఇవ్వాల్సిన ఒక నాన్ వెజ్ ఆర్డర్ ని అఖిల్ రాజ్ ఇంట్లో ఇవ్వడం, దాన్ని అఖిల్ తండ్రి ఓపెన్ చేయడం, 20నిమిషాల తర్వాత వచ్చిన బాయ్ అఖిల్ రాజ్ తల్లిని తిట్టాడన్న ఆరోపణలు రావడం,దాంతో అఖిల్ అతన్ని కొట్టాడంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ అవడం తెల్సిందే. దానికి ఇదీ జరిగింది అంటూ అఖిల్ రాజ్ వివరణ ఇచ్చాడు కూడా.ఇక ఇది జరిగిన కొన్ని గంటలకే అఖిల్ రాజ్ కార్ పై కొందరు గుర్తు తెలియని దుండగులు ఎటాక్ చేసిన సంగతి తెల్సిందే.

అసలు విషయం చల్లగా రివీల్ చేసిన బాయ్ 

Advertisement

ఇక ఇదంతా ఇలా ఉంటె తాజాగా  ఇందులో వాళ్ళ తప్పేమీ లేదని, ఆ రోజు నా పుట్టిన రోజని, పైగా పర్సనల్ ప్రాబ్లమ్స్ కారణంగా మెంటల్ డిప్రెషన్ లో ఉన్నానని చెప్పుకొచ్చాడు డెలివరీ బాయ్ రమేష్ .ఇక వెజ్ తినే బ్రాహ్మణులకి నాన్ వెజ్ పార్సిల్ ఇవ్వడం నాదే తప్పని, ఈ విషయమై అఖిల్ రాజ్ సీరియస్ గా అడగడంతో భయపడిపోయి రివర్స్ లో నేనే కొట్టు కొట్టు అంటూ వీడియో తీసి వైరల్ చేశానని అసలు విషయం చల్లగా రివీల్ చేశాడు.ఇక తన దవడకి ఇదివరకే దెబ్బ తాకి ఉందని,దానికి ఏమైనా తాకుతుందేమో అని భయపడిపోయి అలా చేశానని తెలిపాడు.తీసిన వీడియో అంత వైరల్ అవుతుందని అనుకోలేదని ,పైగా ఆ వీడియో అప్పుడే డిలీట్ చేయాలని అనుకున్నా పరిస్థితిచేయి దాటిపోయిందని తెలిపాడు.

ఈ వివాదానికి ఇంతటితో ఎండ్ కార్డ్ పడినట్టేనా ?

అయితే ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే అఖిల్ సినిమా హీరో అని డెలివరీ బాయ్ రమేష్ కి తెలిదట.హీరోలంటే పెద్ద పెద్ద విల్లాలలో ఉంటారు కాని ఇలా మామూలు ప్లాట్లలో ఉంటారని అసలు అనుకోలేదని చెప్పుకొచ్చాడు,అయితే గతంలో ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రంలోని ఒక సూపర్ హిట్ సాంగ్‌కు తన భార్యతో కలిసి రమేష్ గతంలో ఒక ఇన్‌స్టాగ్రామ్ రీల్ కూడా చేశాడట.అయినప్పటికీ ఆ హీరోని రమేష్ గుర్తుపట్టకపోవడం కాస్త ఆశ్చర్యమే.అయితే లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తాడనుకున్న హీరో ఇలా సింపుల్ గా ఉంటాడని ఊహించలేదని ,ఏది ఏమైనా తప్పు నాదే అంటూ “అన్నా.. నన్ను క్షమించు, ఇంకెప్పుడూ ఇలాంటి తప్పు చేయను” అంటూ లైవ్‌లో వేడుకున్నాడు ఈ డెలివరీ బాయ్.

Advertisement

ఏది ఏమైనా తాజాగా డెలివరీ బాయ్ స్వయంగా తప్పు నాదే అని ఒప్పుకోవడం బట్టి చూస్తే ఈ వివాదానికి ఇంతటితో ఎండ్ కార్డ్ పడినట్టే కనిపిస్తుంది.

also read:దీపికా ప్లేస్‌లో ఆలియా భట్.. రెబల్ స్టార్ హింట్ ఇచ్చేశాడా?

Related News

సమంత కొత్త అవతారం.. ఈసారి వంటగదిలోకి స్టార్ హీరోయిన్!

సంక్రాంతికి స్టార్ హీరోల జాతర.. థియేటర్లు సరిపోతాయా గురూ?

‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు’…. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఎమోషనల్ థ్రిల్లర్!

రక్తంతో తడిసిన ప్రభాస్.. ‘ఫౌజీ’ పోస్టర్ మామూలుగా లేదుగా!

విజయ్ దేవరకొండ ‘రణబాలి’ నుంచి అదిరిపోయే పోస్టర్.. ఫ్యాన్స్‌కు పండగే!

ఆగస్టు 15 వేడుకల్లో మెగా ఫ్యామిలీ.. నిహారిక, లావణ్య స్పెషల్ అట్రాక్షన్

ఎర్ర కండువా.. చేతిలో తుపాకీ.. శ్రీ విష్ణు మాస్ లుక్ అదిరిపోయిందే!

ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్.. ‘సెయాన్’ అప్డేట్ వచ్చేసింది..

Big Stories

Advertisement
×