E-Paper
Advertisement

ఏసీ vs డీహ్యూమిడిఫైయర్.. రెండింటికి తేడా ఏంటి? వర్షాకాలంలో ఏది బెస్ట్?

ఏసీ vs డీహ్యూమిడిఫైయర్.. రెండింటికి తేడా ఏంటి? వర్షాకాలంలో ఏది బెస్ట్?
Advertisement

AC vs Dehumidifier: వర్షాకాలంలో గాలిలో తేమ అధికంగా ఉంటుంది. దీని వల్ల బయటి వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ గదిలో ఉక్కపోతగా అనిపిస్తుంది. అటు ఇల్లంతా జిగటగా అనిపించడమే కాకుండా బట్టలు త్వరగా ఆరవు. అయితే ఈ ఇన్-డోర్ హ్యుమిడిటీ (తేమ)ని తగ్గించడానికి రెండు ఆప్షన్లు ఉన్నాయి. అందులో ఏసీ ఒకటి కాగా, మరొకటి డీహ్యూమిడిఫైయర్ (Dehumidifier). మరి ఈ రెండింటిలో ఉక్కపోతను తగ్గించడానికి ఏది బెటర్? ఏది ఎలా పనిచేస్తుంది? అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

తేమను ఏసీ ఎలా తగ్గిస్తుంది?

సాధారణంగా ఏసీ అనేది.. గదిని చల్లబరచడానికి మాత్రమే వాడతారని చాలామంది భావిస్తుంటారు. కానీ ఏసీ గదిలోని వేడి గాలిని లాక్కునే క్రమంలో ఆ గాలిలో ఉన్న తేమను కూడా నీటి బిందువుల రూపంలో మార్చి బయటకు పంపేస్తుంది. ప్రస్తుత లేటెస్ట్ ఏసీలలో ‘డ్రై మోడ్’ (Dry Mode) అనే ప్రత్యేక ఆప్షన్ ను కూడా తీసుకొచ్చారు. వర్షాకాలంలో ఈ మోడ్‌ను ఆన్ చేసినప్పుడు.. ఏసీ గదిని ఎక్కువగా చల్లబరచకుండా కేవలం గాలిలోని తేమను మాత్రమే సమర్థవంతంగా తొలగిస్తుంది.

డీహ్యూమిడిఫైయర్ సంగతేంటి?

Advertisement

గాలిలోని తేమను సమర్థవంతంగా తొలగించే డీహ్యూమిడిఫైయర్ డిజైన్ చేశారు. ఇది గదిలోని తేమతో కూడిన గాలిని లోపలికి లాక్కొని అందులోని తడిని వేరు చేసి పొడి గాలిని మళ్లీ బయటకు వదులుతుంది. అయితే ఇది గది ఉష్ణోగ్రతను ఏమాత్రం ప్రభావితం చేయదు. అయితే వర్షాకాలంలో ఉండే ఉక్కపోతను తగ్గించి.. గది వాతావరణాన్ని మాత్రం ఆహ్లాదకరంగా మారుస్తుందని నిపులు పేర్కొంటున్నారు.

ఏసీ vs డీహ్యూమిడిఫైయర్

ఇంట్లోని వాతావరణాన్ని బట్టి రెండింటిలో ఒకదాన్ని ఎంచుకోవచ్చని నిపుణులు అంటున్నారు. నిపుణుల ప్రకారం.. మీ ప్రాంతంలో ఎండలు ఎక్కువగా ఉండి, ఉక్కపోతగా అనిపిస్తే ఏసీ బెస్ట్ ఛాయిస్. ఎందుకంటే ఇది చల్లదనంతో పాటు తేమను కూడా తగ్గిస్తుంది. ఒకవేళ వాతావరణం చల్లగా ఉండి కేవలం తేమ మాత్రమే ఎక్కువగా ఉంటే డీహ్యూమిడిఫైయర్ బెస్ట్. అయితే ఏసీతో పోలిస్తే డీహ్యూమిడిఫైయర్ చాలా తక్కువ కరెంట్‌ను వాడుకుంటుంది. కాబట్టి విద్యుత్ బిల్లు ఆదా చేయాలనుకుంటే డీహ్యూమిడిఫైయర్ మంచి ఆప్షన్. మరోవైపు ఏసీని ఒక రూమ్‌లో ఫిక్స్ చేస్తే మార్చేందుకు ఏమాత్రం ఛాన్స్ ఉండదు. అదే డీహ్యూమిడిఫైయర్‌ను ఒక రూమ్ నుండి మరో రూమ్‌కి సులభంగా మార్చుకోవచ్చు.

Advertisement

Also Read: ఎయిర్ ప్యూరిఫైయర్ కొంటున్నారా? కంపెనీలు దాచే.. 5 పచ్చి నిజాలు ఇవే!

ఫైనల్గా ఏది కొంటే మంచిది?

ఇంట్లో ఇప్పటికే ఏసీ ఉంటే వర్షాకాలంలో దాన్ని ‘డ్రై మోడ్’ లో పెట్టి తేమను తగ్గించుకోవచ్చు. దీనికోసం ప్రత్యేకంగా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పనిలేదు. అయితే ఏసీ లేని గదులు, బేస్‌మెంట్‌లలో విపరీతమైన వాసన వస్తూ తేమ ఎక్కువగా ఉంటే మాత్రం విడిగా డీహ్యూమిడిఫైయర్ కొనుగోలు చేయడం బెస్ట్. ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు, అలెర్జీలు ఉన్నవారికి డీహ్యూమిడిఫైయర్ చాలా అవసరం. ఇది ఇంట్లోని గాలిని పొడిగా ఉంచడంలో అద్భుతంగా సహాయపడుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Also Read: ఫ్రిజ్‌లో పాలు పెడుతున్నారా? ఈ తప్పు చేస్తే పారబోయాల్సిందే!

Related News

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో పాతాళానికి పడిపోయిన మోటో ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందంటే?

రూ.10వేల వాషింగ్ మెషీన్ ఇప్పుడు రూ.5,099కే! ఎగబడి కొంటున్న జనం

నమ్మలేని పెర్ఫార్మెన్స్, అదిరిపోయే లుక్‌తో..అసుస్ రోగ్ జి16 లాంచ్!

రూ.999కే..స్పాటియల్ ఆడియో ఇయర్ బడ్స్! భారీగా తగ్గిన ధర

రూ.10వేలలోపే స్మార్ట్ టీవీలు..ఫీచర్లు తెలిస్తే షాక్ అవడం ఖాయం!

డాక్యుమెంట్ స్కాన్ కోసం ప్రత్యేక యాప్ అక్కర్లేదు.. మన ఫోన్‌లోనే ఈ సూపర్ ఆప్షన్ ఉందిగా!

పోగొట్టుకున్న కాంటాక్ట్‌లను..నిమిషాల్లో వెనక్కి తెచ్చుకోండిలా!

ఈ స్పీకర్‌ను మూడు ముక్కలుగా విడదీయొచ్చు.. పోర్ట్రానిక్స్ సరికొత్త ప్రయోగం, ధర ఎంతంటే?

Big Stories

Advertisement
×