Guajarat Bridge Collapse Deaths| గుజరాత్ రాష్ట్రం వడోదర జిల్లా ముజ్‌పూర్‌లో బుధవారం ఉదయం ఒక పాతబడిన భారీ వంతెన కూలిపోవడంతో తొమ్మిది మంది మరణించారు. ఈ ఘటనలో అనేక వాహనాలు మహిసాగర్ నదిలో పడిపోయాయి, తొమ్మిది మందిని రక్షించారు. ఈ వంతెన వడోదర జిల్లాలోని పద్రా తాలూకాలోని ముజ్‌పూర్, ఆనంద్ జిల్లాలోని గంభీర ప్రాంతాల మధ్య ఈ భారీ బ్రిడ్జ్ ఉంది. ఈ వంతెన సెంట్రల్ గుజరాత్‌ను సౌరాష్ట్రతో కూడా కలుపుతుంది.
ఈ వంతెన కూలిన వీడియోలలో.. విరిగిన వంతెన మీద ఒక ట్యాంకర్ ఆగిపోయి దాదాపు కిందపడిపోయే స్థితిలో ఉన్నట్లు కనిపిస్తోంది. నదిలో చిక్కుకున్న ఒక మహిళ తన కొడుకు కోసం సహాయం కోరుతూ కేకలు వేస్తోంది, అతను నీటిలో తిరిగిన ఈకో వ్యాన్‌లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
వడోదర జిల్లా కలెక్టర్ అనిల్ ధమేలియా మీడియాతో మాట్లాడుతూ.. “మేము గాయపడిన వారిలో ఐదుగురిని రక్షించాం, ఇద్దరు మరణించినట్లు నిర్ధారించాము. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. రెండు ట్రక్కులు, ఒక ఈకో వ్యాన్, ఒక పికప్ వ్యాన్, ఒక ఆటో-రిక్షా వంతెన కూలినప్పుడు నదిలో పడిపోయాయి” అని చెప్పారు.
వడోదర జిల్లా ఫైర్, ఎమర్జెన్సీ బృందం.. అలాగే నేషనల్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) సంఘటనా స్థలానికి వెళ్లి రక్షణ కార్యకలాపాలు చేపట్టాయి. NDRF వడోదర 6BN యూనిట్ ఒక బృందాన్ని డీప్ వాటర్ డైవ్‌లతో పంపింది. కలెక్టర్ అనిల్ మాట్లాడుతూ.. “ఇది నది లోతైన భాగం కాదు, రక్షణ పనులు జరుగుతున్నాయి. వంతెనపై రెండు మోటర్‌సైకిళ్లు కూడా ఉన్నాయి, కానీ అవి నదిలో పడిపోయాయా అనేది ఇంకా నిర్ధారించలేదు. ప్రస్తుతం మేము సహాయక చర్యలపై దృష్టి పెట్టాం” అని అన్నారు.
రక్షించిన వారిని వడోదర జిల్లాలోని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఐదుగురిలో నలుగురికి స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయని కలెక్టర్ అనిల్ తెలిపారు. 43 ఏళ్ల క్రితం నిర్మించబడిన ఈ వంతెనకు గత సంవత్సరం మరమ్మతులు చేశారని, రోడ్ అండ్ బ్రిడ్జెస్ డిపార్ట్‌మెంట్ ఇంజనీర్లు స్థలానికి వెళ్తున్నారని ఆయన చెప్పారు. “రెస్క్యూ పూర్తయిన తర్వాత వంతెన వివరాలను పరిశీలిస్తాము” అని ఆయన అన్నారు.
ఆనంద్ జిల్లా కలెక్టర్ ప్రవీణ్ చౌధరి మీడియాతో మాట్లాడుతూ, వడోదర జిల్లా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తుండగా.. ఆనంద్ జిల్లా తరపున మూడు ఫైర్ టెండర్లను సహాయం కోసం పంపినట్లు చెప్పారు. “ఆనంద్ జిల్లా అడ్మినిస్ట్రేషన్, పోలీసులు వంతెన ఇతర వైపు సహాయక చర్యలు చస్తున్నారు. అవసరైమన అన్ని విధాల సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నారు” అని వివరించారు.
Also Read: బంగారం కొనుగోలు చేస్తే నష్టమే.. ETFలు బెస్ట్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
అంక్లవ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అమిత్ చావ్డా ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ.. “పెద్ద సంఖ్యలో వాహనాలు నదిలో పడిపోయాయి, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్ వెంటనే రెస్క్యూ చేయాలి, ట్రాఫిక్‌ను మళ్లించాలి” అని పేర్కొన్నారు.
వంతెన కూలిపోవడంతో సెంట్రల్ గుజరాత్, సౌరాష్ట్ర మధ్య కీలకమైన కనెక్షన్‌ను తెగిపోయింది. ట్రాఫిక్, వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించింది. ఈ వంతెన, 1985లో నిర్మించబడింది. దీని నిర్వహణ లోపాలు ఏమైనా ఉన్నాయా? ప్రభుత్వ విభాగం నిర్లక్ష్యం ఏమైనా ఉందా? అనే కోణంగా విచారణ చేస్తామని అధికారులు చెప్పారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఈ ఘటనకు కారణాలను తెలుసుకోవడానికి టెక్నికల్ నిపుణులను ఘటనా స్థలానికి పంపించాలని ఆదేశించారు.
రెస్క్యూ ఆపరేషన్‌లో స్థానిక ప్రజలు, ఫైర్ బ్రిగేడ్, పోలీసులు, NDRF బృందాలు పాల్గొన్నాయి. డైవర్లు నదిలో ఇంకా చిక్కుకున్న వారిని వెతుకుతున్నారు, క్రేన్లు వాహనాలను బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ దుర్ఘటన జరగడంతో గుజరాత్‌లోని ఇతర పాత వంతెనల భద్రత గురించి తనిఖీ చేయాలని సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.
—
In Gujarat’s Vadodara, the Gambhira Bridge connecting Anand and Vadodara collapsed.
Several vehicles, including a truck, a tanker, and cars, plunged into the rive. Rescue and relief operations are currently underway. pic.twitter.com/0FFJ4GPZua— Mohammed Zubair (@zoo_bear) July 9, 2025