E-Paper
Advertisement

షావుకారు జానకి తొలి సంపాదన ఎంతో తెలుసా?

షావుకారు జానకి తొలి సంపాదన ఎంతో తెలుసా?
Advertisement

Sowcar Janaki:భారతీయ చలనచిత్ర రంగానికి చెరగని గుర్తింపును అందించిన దిగ్గజ నటి షావుకారు జానకి గారి మరణం సినీ లోకాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఎన్నో ఏళ్ల సినీ ప్రయాణంలో నాలుగు తరాల నటీనటులతో నటించిన ఆమె ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువే. మొదట ఆల్ ఇండియా రేడియోలో రేడియో ఆర్టిస్ట్‌గా పనిచేసిన ఆమె, చిత్రరంగంలోకి వచ్చి తన మొదటి సినిమాతోనే ఇంటిపేరును మార్చుకున్నారు. మరి ఆనాటి రోజుల్లో ఆమె అందుకున్న తొలి సంపాదన ఎంతో తెలుసా? ఆ వివరాలు చూద్దాం..

షావుకారుగా మారిన శంకరమంచి జానకి:

ఆల్ ఇండియా రేడియోలో నాటకాలు, బాలల కార్యక్రమాలతో ప్రయాణం మొదలుపెట్టిన శంకరమంచి జానకి గారిని రచయితలు కొడవటిగంటి కుటుంబరావు, కొమ్మూరి పద్మావతి బాగా ప్రోత్సహించారు. వారి సలహాతో ప్రముఖ దర్శకుడు బి.ఎన్.రెడ్డి గారిని కలవగా, ఆయన నాగిరెడ్డి గారికి రికమండ్ చేశారు. అలా చక్రపాణి, ఎల్.వి. ప్రసాద్‌ మేకప్ టెస్ట్ చేసి ఏకంగా కథానాయికగా ఎంపిక చేశారు. ఇక అలా 1950 ఏప్రిల్ 7న ఎన్టీఆర్ హీరోగా ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన ‘షావుకారు’ సినిమా ఆమె జీవితాన్నే మార్చేసి ‘షావుకారు జానకి’గా మార్చింది.

కష్టకాలంలో దక్కిన తొలి పారితోషికం ఎంతంటే?:

Advertisement

తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో జానకి గారికి ఈ సినిమా అవకాశం దక్కింది. చిన్న వేషం దొరికినా చాలనుకున్న సమయంలో విజయ వారి ‘షావుకారు’ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం రావడమే కాకుండా, ఆ తొలి సినిమాకు గాను ఆమెకు రూ.2,500 పారితోషికంగా ఇచ్చారు. ఇక ఆ రోజుల్లో ఆ రెండున్నర వేల రూపాయల సంపాదన తనకు లక్షలతో సమానమని, కష్టాల్లో ఉన్న తమ కుటుంబానికి అది కొండంత అండగా నిలిచిందని ఆమె తన పాత ఇంటర్వ్యూలలో ఎంతో భావోద్వేగంతో గుర్తుచేసుకున్నారు.

also read:18 ఏళ్లకే హీరోయిన్ గా.. షావుకారు జానకి నటించిన చివరి తెలుగు చిత్రం!

ముఖ్యమంత్రులతో అరుదైన రికార్డ్:

Advertisement

షావుకారు జానకి గారి సుదీర్ఘ కెరీర్‌లో మరో అరుదైన విశేషం ఉంది. దక్షిణాదిలో దివంగత ముఖ్యమంత్రులైన ఎన్.టి.రామారావు, ఎం.జి.రామచంద్రన్, ఎం.కరుణానిధి, జయలలితలతో కలిసి ఆమె సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇక నలుగురు ముఖ్యమంత్రులతో నటించిన నటిగా చరిత్ర సృష్టించారు. ఇక అంతేకాకుండా 1959లో వచ్చిన కన్నడ చిత్రం ‘మహిషాసుర మర్ధిని’తో తొలి పాన్ ఇండియా హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.

ఏడు దశాబ్దాల సినీ ప్రయాణంలో కళైమామణి, నంది, ఫిల్మ్‌ఫేర్, ఏఎన్నార్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ మరియు 2022లో అత్యున్నత ‘పద్మశ్రీ’ పురస్కారం అందుకున్న షావుకారు జానకి గారి మృతితో ఒక సువర్ణ అధ్యాయం ముగిసింది. కష్టాల నుంచి మొదలై సినీ చరిత్రలో మహానటిగా వెలిగిన ఆమె జ్ఞాపకాలు తరతరాలకు ఎప్పటికీ నిలిచిపోతాయి.

Related News

ఒకే ఫ్రేమ్ లో దేవిశ్రీ.. ఐశ్వర్య రాజేష్? మ్యాటర్ ఏంటీ బ్రో?

ఆదర్శ కుటుంబం ఎఫెక్ట్… ఆందోళనలో ఎన్టీఆర్ ఫ్యాన్స్..

డబ్బు విషయంలో బ్రహ్మీ ఎందుకంత నిక్కచ్చిగా ఉంటారంటే?

మానసా చౌదరి అందాల విందు.. ఈ పోజ్‌కి ఫిదా అవ్వాల్సిందే!

‘దొంగ నా కొడుకు’గా మౌళి.. ఈసారి నవ్వించడానికి రెడీ!

ప్రభాస్‌తో శ్రీవిష్ణు ఫొటో.. అసలు మ్యాటర్ ఏంటంటే!

మహారాష్ట్రలోనూ తగ్గని అల్లు అర్జున్ క్రేజ్… తగ్గేదే లే అంటున్న ఫ్యాన్స్!

వరంగల్ నుంచి వచ్చిన ఈ అమ్మాయి.. ఒక్క సినిమాకు లక్షల్లో రెమ్యునరేషన్!

Big Stories

Advertisement
×