Allu Arjun: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో లెజెండ్రీ నటులుగా పేరు సొంతం చేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఆయన చేయని సినిమా లేదు.. పోషించని పాత్ర లేదు అనడంలో అతిశయోక్తి కాదు.. చిన్న పిల్లల్ని మొదలుకొని పండుముసలివాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఫేవరెట్ హీరో మెగాస్టార్ చిరంజీవి మాత్రమే.. అంతలా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న చిరంజీవి 70వ పుట్టినరోజును ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయనకు అభిమానుల నుంచి ప్రత్యేకమైన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
మెగా అభిమానులు, సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు కూడా సోషల్ మీడియా వేదికగా చిరంజీవికి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కూడా తన మేనమామ మెగాస్టార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం ఇప్పుడు వైరల్ గా మారింది. అల్లు అర్జున్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా.. ఒక ఫ్యామిలీ ఈవెంట్ కి సంబంధించిన ఫోటోని షేర్ చేస్తూ..” మన ఏకైక మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు” అంటూ విషెస్ తెలియజేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన మెగా అభిమానులు, అల్లు అభిమానులు అందరూ కలిసిపోయినట్టే అంటూ కామెంట్లు చేస్తున్నారు.
చిరంజీవికి స్పెషల్ బర్తడే విషెస్ తెలియజేసిన బన్నీ..
వాస్తవానికి గత కొన్ని రోజులుగా మెగా వర్సెస్ అల్లు అంటూ అభిమానుల మధ్య వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. అటు అల్లు అర్జున్ పుష్ప 2 సమయంలో కేసులో ఇరుక్కున్నప్పుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్పందించకపోవడం సంచలనంగా మారింది.. దీనికి తోడు సినిమా ఈవెంట్లలో అల్లు అర్జున్ మెగా కుటుంబం గురించి స్పందించకపోవడం కూడా హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. వాస్తవానికి అల్లు అర్జున్.. మెగాస్టార్ చిరంజీవిని ఏ రోజు కూడా కించపరిచి మాట్లాడిన దాఖలాలు లేవు. తాను ఇండస్ట్రీకి రావడానికి.. తన ఎదుగుదలకు కారణం తన మేనమామ మెగాస్టార్ చిరంజీవి అని ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు. అటు పుష్ప 2 కేసు సమయంలో కూడా తన భార్యతో కలసి చిరంజీవి ఇంట్లో ఆతిథ్యం స్వీకరించిన విషయం తెలిసిందే. ఇలా ఎప్పటికప్పుడు అల్లు అర్జున్ చిరంజీవి పై అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇక ఇప్పుడు స్పెషల్ గా పుట్టినరోజు విషెస్ తెలియజేయడంతో చిరంజీవిపై ఆయనకున్న ప్రేమ మరొకసారి బయటపడింది.
చిరంజీవి సినిమాలు..
చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర (Vishwambhara) సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేస్తామని ప్రకటించారు. దీనికి తోడు నిన్న సాయంత్రం మెగా సెలబ్రేషన్స్ లో భాగంగా గ్లింప్స్ కూడా విడుదల చేశారు. అటు అనిల్ రావిపూడి (Anil Ravipudi)తో చేస్తున్న సినిమాకి టైటిల్ అనౌన్స్మెంట్ చేసి సంక్రాంతి బరిలోకి దింపబోతున్నామని స్పష్టం చేశారు.. అలాగే ప్రముఖ డైరెక్టర్ బాబి కొల్లి (Bobby kolli) దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో సినిమా చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
అల్లు అర్జున్ సినిమాలు..
అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే పుష్ప 2 సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించిన ఈయన.. ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ (Atlee) దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు.
also read:Ram Gopal Varma: 10రెట్ల వేగంతో పుంజుకుంటాడు.. నాగవంశీ పై వర్మ ఆసక్తికర ట్వీట్!
Happy Birthday to our one and only Mega Star Chiranjeevi garu. ⭐️ @KChiruTweets pic.twitter.com/0n9veF0l9X
— Allu Arjun (@alluarjun) August 22, 2025