BigTV English

Janhvi Kapoor : వివాదంలో జాన్వీ కపూర్.. సోషల్ మీడియాలో సింగర్ పై విమర్శలు..!

Janhvi Kapoor : వివాదంలో జాన్వీ కపూర్.. సోషల్ మీడియాలో సింగర్ పై విమర్శలు..!

Janhvi Kapoor : బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. స్వర్గీయ నటి శ్రీదేవి వారసురాలుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వి.. మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది. బాలీవుడ్ లో ఒకవైపు వరుసగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ దేవర సినిమాల్లో హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం తెలుగు తో పాటు బాలీవుడ్ లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే ఈమె గురించి తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది.. జాన్వీ కపూర్ విభాగంలో ఇరుక్కుంది అంటూ వార్తలు నెట్టింట ప్రచారంలో ఉన్నాయి..


వివాదంలో చరణ్ బ్యూటీ..

బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే.. ఎన్టీఆర్ సరసన దేవర మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. టాలీవుడ్‌లోనూ వరుస ప్రాజెక్టులతో దూసుకెళ్తున్న యంగ్ అండ్ టాలెంటెడ్ జాన్వీ తాజాగా ఓ వివాదంలో చిక్కుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఈ అమ్మడు నటిస్తున్న హిందీ చిత్రం ‘పరమ్ సుందరి’తో ఈ వివాదం తలెత్తింది. ఈ సినిమాలో జాన్వీ పోషించిన మలయాళీ యువతి పాత్రపై ఓ మలయాళ గాయని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో పెద్ద దుమారం రేపింది. సిద్ధార్థ్ మల్హోత్రా జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న ఈ రోమాంటిక్ కామెడీ చిత్రానికి తుషార్ జలోటా దర్శకత్వం వహించారు.. ఈ మూవీలో జాన్వీ మలయాళీ అమ్మాయి పాత్రలో నటిస్తుంది. జాన్వీ మాట్లాడిన మలయాళ యాసను ఉద్దేశించి వ్యంగ్యంగా మాట్లాడిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు అది వైరల్ అవ్వడంతో విమర్శలను అందుకుంటుంది.


Also Read: రాజువై సైన్యాన్ని నడిపించు.. తమ్ముడు కళ్యాణ్ కోసం ఎమోషనల్ పోస్ట్..!

‘పరమ్ సుందరి’ బ్యాన్ చెయ్యాలని డిమాండ్.. 

మలయాళంలో మాట్లాడేవాళ్లు సినిమాలో నటించడానికి ఎంతో మంది ఉండగా.. ఎందుకు బాలీవుడ్ అమ్మాయిని తీసుకున్నారు అని నిరసన సెగ ఎదురవుతుంది. ఒకటే సంస్కృతిని సరైన రీతిలో ప్రతిబింబించాలంటే.. అక్కడి వ్యక్తుల్ని తీసుకోవాల్సిందే కదా..అంటూ కామెంట్‌ చేసింది.. అలాగే సింగర్ పవిత్ర మీనన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పవిత్ర అక్కడితో ఆగకుండా తాను పోస్ట్ చేసిన వీడియో తొలగించారని.. స్క్రీన్‌షాట్‌లను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మరోసారి తన అభిప్రాయాన్ని మరోసారి కుండబద్దలు కొట్టారు. దాంతో ఈ వివాదం మరింత ముదిరింది.. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.. కొందరేమో ఇది కేవలం సినిమా మాత్రమే అని కామెంట్ చేయగా.. మరికొందరు మాత్రం మలయాళ పరువుని తీసేస్తున్నారంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి దీనిపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.. ఏది ఏమైనా కూడా ఇటు బాలీవుడ్ లోనూ.. అటు మలయాళ ఇండస్ట్రీలోనూ పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. మరి ఇది ఎన్ని విమర్శలు అందుకుంటుందో చూడాలి..

Related News

Vishwambhara: చిరుతో ఢీ కొట్టడానికి సిద్ధమైన బాలీవుడ్ స్టార్.. బాస్ ముందు బచ్చానేనా?

Mega157 Glimpse:ఎవరీ శంకరవరప్రసాద్… అదిరిపోయిన టైటిల్ గ్లింప్స్.. బాస్ ఈజ్ బ్యాక్!

Megastar Chiranjeevi: చిరంజీవిని చంపాలని చూశారా..? బర్త్ డే వేళ బయటపడ్డ నిజం..

HBD Chiranjeevi : తెలుగు నటరస నవరాజా శంకరుడే ఈ చిరంజీవుడు

Allu Arjun: మెగా మామకి స్పెషల్ విషెస్.. రూమర్స్ కి చెక్ పెట్టిన బన్నీ!

Big Stories

×