Tiger Viral Video: పులులు, సింహాలు తరచుగా అడవుల నుంచి గ్రామాల్లోకి వస్తున్న సంఘటనలు చూస్తేనే ఉన్నాం. కొన్నిసార్లు ఊళ్లలోకి వచ్చి మేకలు, గొర్రెలు, పశువులను తింటూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన వార్తలనూ విన్నాం. క్రూర మృగాల సంచారంతో ప్రజలు ఇబ్బందులు పడిన విషయాలు తెలుసు. ముఖ్యంగా అటవీ ప్రాంతాలకు దగ్గరలో ఉన్న గ్రామల ప్రజలకు ఇలాంటి సమస్యలు ఎదురవుతుంటాయి.
బాత్రూమ్ లోకి తొంగి చూసిన పులి!
తాజాగా ఓ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఓ వ్యక్తి బాత్రూమ్ లో స్నానం చేస్తున్నాడు. ఊహించని పరిస్థితి ఎదురయ్యింది. ఆ బాత్ రూమ్ కు వెలుతురు వచ్చేలా చిన్న విండోలాంటి ప్లేస్ వదిలేశారు. దానికి కిటికీ ఏర్పాటు చేయలేదు. ఫలితంగా అటుగా వచ్చిన పులి ఆ విండో నుంచి లోపలికి తలపెట్టింది. బాత్రూమ్ లోకి తొంగి చూసింది. అకస్మాత్తుగా కిటికీ లో నుంచి పెద్ద పులి తల పెట్టి తొంగి చూడటంతో అందులో ఉన్న వ్యక్తి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వెన్నులో వణుకు పుట్టింది. ఈ ఘటనను తన సెల్ ఫోన్ లో చిత్రీకరించాడు. నిజానికి పులి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించింది. కానీ, విండో ప్లేస్ చిన్నగా ఉండటంతో పులి తల మాత్రమే పట్టింది. తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. విండో ప్లేస్ మరికాస్త పెద్దగా ఉండే, ఆ వ్యక్తి పులికి ఫుడ్ అయిపోయేవాడు. ఈ వీడియోను సదరు వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
ఫన్నీగా కామెంట్స్ పెడుతున్న నెటిజన్లు
ఈ వీడియో చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంత మంది అతడి పరిస్థితి మీద జాలి పడుతుంటే, మరికొంత మంది ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. “హాయ్ సార్, నేను మీ లోన్ రికవరీ ఏజెంట్. ఫోన్ లిఫ్ట్ చేయలేదని నేరుగా వచ్చేశా!” అని ఒకరు జోక్ వేశారు. మరొకరు, “సార్, హాట్ వాటర్ తో స్నానం చేస్తున్నారా? చల్లనీటితోనా?” అంటూ మరొకరు సెటైర్ వేశారు. “ఒకవేళ నేనే బాత్రూమ్ లో ఉంటే చచ్చేలా అరిచేవాడిని. కానీ, ఏమాటకామాట పులి చూడ్డానికి భలే అందంగా ఉంది” అని ఇంకో వ్యక్తి రాసుకొచ్చాడు.
ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది?
నిజానికి ఈ ఘటన ఎక్కడ జరిగింది అనేది కచ్చితంగా తెలియదు. వీడియోకు సంబంధించిన వివరాలు కూడా వెల్లడి కాలేదు. కానీ, ఈ ఘటన అటవీ ప్రాంతానికి సమీప గ్రామంలో జరిగి ఉంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అడవులను కాపాడకుండా నరికివేయడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. వ్యవసాయం కోసం గనుల తవ్వకం కోసం, రోడ్ల నిర్మాణం కోసం అడవులను తొలిగిస్తుంటే వన్యప్రాణులు తమ ఆవాసాలను కోల్పోయి, జనావాసాల్లోకి వస్తున్నాయి. ఆహారం కోసం వెతుక్కుంటూ ఊళ్లలోకి ప్రవేశిస్తున్నాయంటున్నారు.
Read Also: ప్రపంచంలో పే…..ద్ద సినిమా, నెల రోజులు చూసినా అయిపోదట?