E-Paper
Advertisement

ఓవరాక్షన్ అనుకున్న పర్వాలేదు.. వారికి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన రష్మిక!

ఓవరాక్షన్ అనుకున్న పర్వాలేదు.. వారికి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన రష్మిక!
Advertisement

Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూనే మరోవైపు రణబాలి సినిమా(Ranabaali Movie) ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా దసరా పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను వేగవంతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సౌత్ ఇండియాతో పాటు నార్త్ ఇండియాలో కూడా రష్మిక (Rashmika) విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)దంపతులు భారీగా ప్రమోషన్లను నిర్వహిస్తూ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక మందన్న సోషల్ మీడియాలో తన గురించి వస్తున్నటువంటి ట్రోల్స్ పై స్పందిస్తూ గట్టిగా కౌంటర్ ఇచ్చారు..

నాకు నటించాల్సిన పనిలేదు..

రణబాలి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తన గురించి సోషల్ మీడియాలో వస్తున్న విమర్శల పట్ల రష్మిక స్పందిస్తూ.. తనకు అందరితో సరదాగా గడపడం ఇష్టం అయితే ఈ విషయాన్ని కొంతమంది మాత్రం తప్పు పడుతున్నారని రష్మిక తెలిపారు. తన గురించి ఇలాంటి విమర్శలు చేసిన తనలో మాత్రం ఎలాంటి మార్పులు రావని ఈమె తెలిపారు. అందరితో మంచిగా ఉండటం నా బలహీనత కాదు.. నేను ఉన్న చోట పాజిటివిటీ ఉండాలని మాత్రమే కోరుకుంటాను అందుకే అందరితో సరదాగా ఉంటానని రష్మిక తెలిపారు. నాకు నేను ఇలా ఉండటమే ఇష్టం.. దానికోసం నటించాల్సిన పనిలేదని తెలిపారు.

నా బలహీనత అనుకుంటే పొరపాటు..

Advertisement

తాను ఎవరికోసమో మారనని, నేను ఇలా ఉండటం వల్ల నా కుటుంబం నా ఫ్రెండ్స్ చాలా సంతోషంగా సరదాగా ఉంటారు మీరు దానిని ఓవరాక్షన్ అనుకున్న పర్వాలేదు.. నా బలహీనత అనుకున్న పర్వాలేదు అంటూ ఈ సందర్భంగా తనని విమర్శించే వారికి తనదైన స్టైల్ లోనే రష్మిక కౌంటర్ ఇస్తూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇలా సోషల్ మీడియాలో రష్మిక గురించి ఎన్నో రకాలుగా విమర్శలు వస్తున్నప్పటికీ ఈమె మాత్రం పెద్దగా వాటిపై రియాక్ట్ అవ్వదు. రష్మిక పూర్తిగా సినిమాలపై దృష్టి సారించి ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నారు.

రణబాలిపై పెరుగుతున్న అంచనాలు…

ఈమె నటించిన రణబాలి సినిమా అక్టోబర్ 16వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నవంబర్ లో రష్మిక ప్రధాన పాత్రలో నటించిన మైసా విడుదలకు సిద్ధమవుతుంది. ఇలా వరుస సినిమాలను విడుదల చేస్తూనే మరోవైపు వరుస సినిమాల షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇక రణబాలి విషయానికి వస్తే.. ఈ సినిమా బ్రిటిష్ పాలనకు వ్యతిరేక పోరాటం నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో రష్మిక మందన్న జయమ్మ అనే పాత్రలో నటించగా విజయ్ దేవరకొండ సింగనమల బొబ్బిలి రణబాలి అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి.

Advertisement

Also Read: తేజ సజ్జ ‘ది ట్రేటర్స్’ తెలుగు ట్రైలర్ చూశారా? 20 మంది సెలబ్రిటీలు వీళ్లే!

Related News

ప్రభాస్‌తో శ్రీవిష్ణు ఫొటో.. అసలు మ్యాటర్ ఏంటంటే!

మహారాష్ట్రలోనూ తగ్గని అల్లు అర్జున్ క్రేజ్… తగ్గేదే లే అంటున్న ఫ్యాన్స్!

వరంగల్ నుంచి వచ్చిన ఈ అమ్మాయి.. ఒక్క సినిమాకు లక్షల్లో రెమ్యునరేషన్!

కోలీవుడ్ వెయ్యి కోట్లు చూసేనా ?

జగపతిబాబునే ఇమిటేట్ చేసిన అభిమాని.. హీరో అదిరిపోయే రియాక్షన్.. వీడియో వైరల్!

27 ఏళ్ల తర్వాత చిరుతో జతకట్టబోతున్న రమ్యకృష్ణ.. ఈ ట్విస్ట్ ఏంటి బాస్?

తెలంగాణ..రాయలసీమ.. ఉత్తరాంధ్ర..సినిమాలకి ఇదేం లెక్క? నరేష్ ఫైర్!

Big Stories

Advertisement
×