E-Paper
Advertisement

జగ్గారెడ్డి ఇంద్రుడు చంద్రుడైతే ప్రజలు ఎందుకు ఓడిస్తారు: సునీత లక్ష్మారెడ్డి

జగ్గారెడ్డి ఇంద్రుడు చంద్రుడైతే ప్రజలు ఎందుకు ఓడిస్తారు: సునీత లక్ష్మారెడ్డి
Advertisement

Congress Promises: నిరుద్యోగ యువత ను కాంగ్రెస్ మోసం చేసిందని, 2 లక్షల ఉద్యోగాలు ఏవీ? నిరుద్యోగ భృతి ఏదీ? అని మాజీ మంత్రి ఎమ్మెల్యే సునీత లక్ష్మా రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం మీడియాతో మాట్లాడారు. రాజీవ్ యువవికాసం ఏమైంది? అని నిలదీశారు. ప్రజాధనంతో సభలు పెట్టి కేసీఆర్, హరీష్ రావులను కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఓ అపర భగీరథుడిలా ఇంటింటికి తాగునీళ్లు అందించారన్నారు.

రేషన్ కార్డులపై మీ ఫోటోలు ఎందుకు?

బూతులు తప్ప రాష్ట్రానికి ఉపయోగపడే పని ఒక్కటీ లేదని దుయ్యబట్టారు. రేషన్ కార్డుల పై కాంగ్రెస్గొప్పలు చెప్పుకుంటుందని, బీ ఆర్ ఎస్ హయం లో ఆరు లక్షల 47 వేల రేషన్ కార్డులిచ్చారనిమంత్రి ఉత్తమ్ శాసన మండలి లో చెప్పారని, రేషన్ కార్డులపై మీ ఫోటోలు ఎందుకు? అని ప్రశ్నించారు. సన్న బియ్యానికి బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్ అన్నారు. వ్యవసాయాన్ని పండగ చేశామనికాంగ్రెస్ ప్రభుత్వం చెప్పం హాస్యాస్పదమన్నారు. బోనస్ ను బోగస్ గా మార్చి గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. యూరియా యాప్ తో రైతుల కష్టాలు పెరిగాయన్నారు. స్కాలర్ షిప్ లు ,ఫీ రీ ఇంబర్స్ మెంట్ పై ప్రభుత్వం మాట తప్పిందన్నారు.

తప్పుడు ప్రచారం..

Advertisement

సింగూరు ప్రాజెక్టును ఎండబెట్టిన ఘనత కాంగ్రెస్‌దే అన్నారు. కల్యాణ లక్మి పథకాన్ని ఎత్తి వేసే కుట్ర చేస్తున్నారన్నారు. హరీష్ రావుపై కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం మానుకోవాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో మెదక్ జిల్లాలో కాంగ్రెస్ కు వచ్చిన మూడు సీట్లు కూడా రావు అన్నారు. ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్నందుకే హరీష్ రావు, కేటీఆర్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మిషన్ భగీరథను నిర్వీర్యం చేశారన్నారు. మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మాట్లాడుతూ ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్నందునే డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

Also Read: అమెజాన్ ప్రైమ్‌లో ‘డార్క్ సీక్రెట్స్’ హవా.. ఏకంగా నంబర్ 1 ప్లేస్‌లో!

ఎమ్మెల్యే మాణిక్ రావు..

Advertisement

సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టు పై సంగారెడ్డి లో కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే మాణిక్ రావు మాట్లాడుతూ హరీష్ రావు ప్రజా సమస్యల గురించి అడుగుతుంటే కాంగ్రెస్ నేతలు ఓర్వలేక పోతున్నారని, బట్ట గాల్చి మీదేస్తే అబద్దం నిజం కాదన్నారు. అందర్నీ వంచించిన కాంగ్రెస్ కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం తధ్యం అన్నారు.

ప్రజలకు అవమానం..

ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ రాష్ట్రానికి చీడ, పీడ లాంటి దన్నారు. సంగారెడ్డి మీటింగ్ కాంగ్రెస్ సభలా జరిగిందని, స్థానిక ఎమ్మెల్యేగా నాకు కనీస సమాచారం లేదన్నారు. నన్ను మాత్రమే కాదు సంగారెడ్డి ప్రజలను కాంగ్రెస్ అవమానించిందన్నారు. జగ్గారెడ్డి ఇంద్రుడు చంద్రుడు అయితే సంగారెడ్డి ప్రజలు ఎందుకు ఓడిస్తారన్నారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డి భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో తెలియదని, స్మార్ట్ కార్డులపై సీఎం,మంత్రి ఫోటోలు ఎందుకు అని నిలదీశారు.

Also Read: మీరు లక్ష్మీదేవి భక్తులా.. అయితే బీ కేర్‌ఫుల్.. నకిలీ విగ్రహాల ముఠా అరెస్ట్!

Tags

Related News

జవాన్ల పిల్లల చదువు, వైద్యంపై కేంద్రం స్పెషల్ ఫోకస్.. మంత్రి బండి సంజయ్ హామీ!

రేషన్ కార్డుల ప్రింటింగ్‌లో భారీ స్కామ్.. బయటపెట్టిన ఎమ్మెల్సీ దాసోజు!

కల్యాణలక్ష్మి- షాదీ ముబారక్ రద్దుకు కాంగ్రెస్ కుట్ర.. ఊరూరా నేతలను నిలదీయండి: కేటీఆర్

మీరు లక్ష్మీదేవి భక్తులా.. అయితే బీ కేర్‌ఫుల్.. నకిలీ విగ్రహాల ముఠా అరెస్ట్!

పరీక్ష లేకుండా హైదరాబాద్ సిటీ పోలీస్ శాఖలో ఉద్యోగాలు

సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు మంత్రి కొండా సురేఖ దూరం

వెయ్యి మంది కేసీఆర్‌లు వచ్చినా ఏమీ చేయలేరు.. పరకాల సభలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×