E-Paper
Advertisement

బన్నీ కొత్త ప్రాజెక్ట్.. తెలుగు డైరెక్టర్స్ ని పక్కన పెట్టేసినట్టేనా?

బన్నీ కొత్త ప్రాజెక్ట్.. తెలుగు డైరెక్టర్స్ ని పక్కన పెట్టేసినట్టేనా?
Advertisement

Allu Arjun:ఐకాన్ స్టార్ గా పాపులారిటీ సొంతం చేసుకొని నేడు గ్లోబల్ స్టార్ దిశగా దూసుకుపోతున్న అల్లు అర్జున్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. విలక్షణమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న ఈయన.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా అవతరించడమే కాకుండా ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డును సొంతం చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచారు. అంతేకాదు టాలీవుడ్ లో తొలిసారి ఉత్తమ నటుడు కేటగిరీలో నేషనల్ అవార్డు అందుకున్న హీరోగా కూడా రికార్డు సృష్టించారు అల్లు అర్జున్. అలాంటి ఈయన పుష్ప 2 సినిమాతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూల్ చేసి సంచలనం సృష్టించారు.

బన్నీ కొత్త ప్రాజెక్టుపై ఊహించని బజ్..

అలాంటి ఈయన ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రాకా సినిమా చేస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీపికా పదుకొనే ఇందులో హీరోయిన్గా నటిస్తుండగా.. ఈమెతో పాటు మరికొంతమంది స్టార్ హీరోయిన్లు కూడా ఇందులో భాగమవడం గమనార్హం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో అప్పుడే బన్నీకి సంబంధించిన మరో కొత్త ప్రాజెక్టు వివరాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Advertisement

also read:రాజమౌళి నెక్స్ట్ హీరో? ఎవరూ ఊహించని కాంబో!

ఇన్ డైరెక్ట్ హింట్ ఇచ్చిన డైరెక్టర్..

అసలు విషయంలోకి వెళ్తే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో మలయాళ దర్శకుడు బసిల్ జోసెఫ్ సినిమా చేయబోతున్నారనే వార్తలు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ వార్తలకు బలం చేకూర్చేలా డైరెక్టర్ బసిల్ జోసెఫ్ చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా బసిల్ జోసెఫ్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో “ఐకాన్” అని రాసి ఉన్న క్యాప్ ఫోటోని ఆయన షేర్ చేశారు. ఈ ఒక్క పోస్ట్ ప్రస్తుతం తెలుగు, మలయాళ సినీ ఇండస్ట్రీలలో హాట్ టాపిక్ గా మారింది. నిజానికి ఐకాన్ అనేది కేవలం అల్లు అర్జున్ కి మాత్రమే అభిమానులు పెట్టిన బిరుదు కావడంతో ఈ పోస్టు అల్లు అర్జున్ తో చేయబోయే కొత్త సినిమాపై పరోక్షంగా ఈయన హింట్ ఇచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి.

అప్పట్లోనే అనుమానాలు మొదలు..

Advertisement

నిజానికి అల్లు అర్జున్ , బసిల్ జోసెఫ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారని గత కొంతకాలంగా వార్తలు రాగా.. మరొకవైపు అల్లు శిరీష్ వివాహ వేడుకలో కూడా బసిల్ జోసెఫ్ పాల్గొనడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. నిజానికి ఈ ఇద్దరి మధ్య కథా చర్చలు ఈ ఏడాదిలోనే జరిగినట్లు సినీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. అయితే ఆ ప్రాజెక్టును ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇక మొత్తానికి అయితే ఇప్పుడు మరో పోస్ట్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న బసిల్ జోసెఫ్ ఎలాంటి కథతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారో చూడాలి. ఇక ఈ క్రేజీ ప్రాజెక్టును బసిల్ జోసెఫ్ ‘శక్తిమాన్’ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని, కథ వివరాలను ప్రస్తుతానికి గోప్యంగా ఉంచారనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.

తెలుగు డైరెక్టర్లతో సినిమాలు చేయరా?

అంతేకాదు ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ నిర్మించే అవకాశాలున్నట్లు సమాచారం. మొత్తానికి అయితే సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేసిన తర్వాత ఇప్పుడు కోలీవుడ్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్న బన్నీ..తర్వాత కన్ఫర్మ్ అయితే మాలీవుడ్ డైరెక్టర్ తో సినిమా చేస్తారు.ఇక ఇదే గనుక నిజమైతే బన్నీ ఇక తెలుగు డైరెక్టర్లతో సినిమాలు చేయరా అనే కామెంట్లు కూడా నెటిజన్స్ నుంచి వ్యక్తమవుతాయి అనడంలో సందేహం లేదు.

Related News

డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా రఘు మాస్టర్..

నాకే ప్లాస్టిక్ బాటిల్ ఇస్తావా?..ఫైర్ అయిన స్టార్ డైరెక్టర్..అసలేం జరిగిందంటే?

NBK 112 లో మరో కోలీవుడ్ స్టార్..కొరటాల క్రేజీ ప్లాన్!

నాగార్జున వర్సెస్ షారుక్ ఖాన్ బాక్సాఫీస్ గెలుపెవరిది?

మరో రికార్డు కొల్లగొట్టిన ఇరుముడి… దండయాత్ర కొనసాగిస్తున్న రవన్న!

డ్యాన్సర్స్ అసోసియేషన్లో కొత్త చర్చలు.. సుమలత గద్దె దిగబోతోందా?

మరో క్రేజీ మూవీలో ఛాన్స్ దక్కించుకున్న రాషా తడానీ.. రిలీజ్ డేట్ లాక్!

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ …మళ్ళీ థియేటర్లలోకి బ్లాక్ బస్టర్ మూవీ!

Big Stories

Advertisement
×