RAAKA Movie: ఒకప్పుడు ఇలా సినిమా మొదలెట్టారంటే చాలు బడ్జెట్ ఎంత, హీరోయిన్ ఎవరిని సెలక్ట్ చేశారు, లొకేషన్స్ ఎక్కడ అంటూ ఆరాలు తీసే వారు.కాని ఇపుడు సినీ ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ మొదలైంది.మామూలు సినిమాలైతే గొడవే లేదు,కానీ ఫ్యాన్ ఇండియా సినిమాలని ప్రకటిస్తే మాత్రం ముందుగా వచ్చే ప్రశ్న ఇది కూడా రెండు పార్టులేనా ?అని.మొదట్లో పార్ట్ 2 అంటూ వచ్చిన సినిమాలు బకెట్ తన్నేయడంలో ఆగిపోయిన మేకర్స్ బాహుబలి సీక్వెల్ ఇచ్చిన ఊపుతో మళ్ళీ పార్ట్ 2 కి శ్రీకారం చుడుతున్నారు. kgf2, పుష్ప 2, కాంతారా చాప్టర్ 1 వంటి సినిమాలు సూపర్ డూపర్ హిట్ కావడంతో రెండో భాగం ఉండి తీరాల్సిందే అన్నట్టుగా మారిపోయింది.
ఇపుడు ఈ డిస్కషన్ అంతా ఎందుకంటారా..అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వస్తున్న రాకా సినిమా కూడా రెండు భాగాలునే వస్తుందట మరి.మొదటగా ఒక పార్ట్‌ను పూర్తిగా హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్ తో తెరకెక్కిస్తుండగా, రెండో భాగంలో ఫ్యూచరిస్టిక్ వరల్డ్ లో చూపించనున్నారట.
ఏకంగా 1000 కోట్లతో ప్లాన్
ఇక మొదటగా ఫస్ట్ పార్ట్ గా దాదాపు 700 కోట్ల బడ్జెట్ అనుకున్న ఈ సినిమాని ఇపుడు ఏకంగా 1000 కోట్లతో ప్లాన్ చేస్తుందట సన్ పిక్చర్స్.మరో వైపు డిజిటల్ రైట్స్ పరంగా మరింత బిజినెస్ జరిగే అవకాశం కనిపిస్తుండటంతో ఇలా డిసీషన్ తీసుకునట్టు తెలుస్తుంది.
ఇక మేకర్స్ ఇలా అనౌన్స్ చేశారో లేదో అప్పుడే సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలైపోయాయి. అవును..ఇంకా కొద్ది రోజులు గడిస్తే హీరో సినిమాలోకి ఎంట్రీ ఇస్తే పార్ట్ 1, విలన్ సినిమాలోకి ఎంట్రీ ఇస్తే పార్ట్ 2 ఉంటుందేమో అంటూ ఎకిపారేస్తున్నారు,ఇక కొంతమంది కొంప దీసి ఇంటర్వెల్ కి సెపరేట్ ottడీల్ మాట్లాడుతారేమో అంటూ సెటైర్స్ వదులుతున్నారు.ఇక మరి కొంతమంది ఒక అడుగు ముందుకు వేసి ఇపుడు రెండు పార్ట్స్ అన్నారు, ముందర మూడు పార్ట్స్ అని తర్వాత సిరీస్ అని ప్లాన్ చేస్తారేమో అంటూ చెడుగుడు ఆడేస్తున్నారు.
also read :ప్రేమలో మోసపోయిన స్టార్ హీరోయిన్లు వీళ్లే!
ఇక సినిమా క్యాస్టింగ్ విషయనికి వస్తే ఇందులో దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తుండగా మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ వంటి టాప్ హీరోయిన్లు ఈ ప్రాజెక్ట్‌లో భాగమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది.పైగా ఇందులో రష్మిక మందన్న విలన్ గా నటిస్తుందన్న టాక్ వినిపిస్తుంది.దీనిపై మేకర్సే క్లారిటీ ఇవ్వాలి.ఏది ఏమైనా ఒక సినిమాలో ఇంతమంది స్టార్ క్యాస్ట్ ఉంటె మాత్రం అది అభిమానులకి ఐ ఫీస్ట్ అనే చెప్పాలి.
జవాన్ తో ఏకంగా వెయ్యి కోట్లు
అట్లీ విషయానికి వస్తే బిగిల్’, మెర్సల్’,’తెరి’వంటి సినిమాలతో తనదైన ముద్ర వేసిన ఈ కుర్ర డైరెక్టర్ షారుఖ్ తో చేసిన జవాన్ తో ఏకంగా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిన సంగతి తెల్సిందే.ఇక అల్లు అర్జున్ కూడా పుష్ప 2 తో 1800 కోట్లు కొల్లగొట్టి వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిన హీరోనే.ఇలా ఇద్దరు స్టార్స్ జోడీ కట్టడంతో ఇపుడు వచ్చే సినిమాలపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈఏడాది చివరిలో రెండు భాగాలకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేసేలా షెడ్యూల్ ప్లాన్ చేశారట. షూటింగ్ పూర్తయ్యాకే రిలీజ్ డేట్స్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని ఫిలిమ్ సర్కిల్స్ లో వినిపిస్తుంది.ఇక ఇందులో VFX భారీగా ఉండటంతో పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ టైం పట్టేలానే ఉందని తెలుస్తుంది.చూడాలి మరి రెండు భాగాలుగా వస్తున్న రాకా పుష్ప సిరీస్ లా సూపర్ హిట్ అవుతుందా ..లేక ఆర్య 2 సినిమాలా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంటుందా !