E-Paper
Advertisement

ప్రేయసిని వదిలి పారిపోయిన డాక్టర్ కు పరేషాన్ చేసే ట్విస్ట్… కొరియన్ మెడికల్ మాస్టర్ పీస్ స్పై థ్రిల్లర్

ప్రేయసిని వదిలి పారిపోయిన డాక్టర్ కు పరేషాన్ చేసే ట్విస్ట్… కొరియన్ మెడికల్ మాస్టర్ పీస్ స్పై థ్రిల్లర్
Advertisement

Korean Medical Drama: కొరియన్ డ్రామాలు అడియన్స్ ని ఏ స్థాయిలో కట్టిపడేస్తాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రొమాన్స్, సస్పెన్స్, మెడికల్ డ్రామా అన్నీ పర్ఫెక్ట్ గా మిక్స్ చేసి తెరకెక్కించిన ఒక క్లాసిక్ కొరియన్ సిరీసే ‘డాక్టర్ స్ట్రేంజ్’ (Doctor Stranger). 2014లో వచ్చిన ఈ మాస్టర్ పీస్ సిరీస్ ఇప్పుడు ప్రముఖ ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది. కొరియన్ కంటెంట్ లవర్స్ ఈ సిరీస్ ను ఎక్కడ చూడవచ్చు ? కథ ఏంటి ? అన్న విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

పార్క్ హూన్ చిన్నతనంలోనే తన తండ్రితో కలిసి ఉత్తర కొరియాకు వెళ్లాల్సి వస్తుంది. అక్కడే వైద్య విద్య నేర్చుకుని ప్రతిభావంతుడైన హార్ట్ సర్జన్ గా ఎదుగుతాడు. అదే సమయంలో సాంగ్ జే-హీ అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఇద్దరూ కలిసి కొత్త జీవితం ప్రారంభించాలని అనుకుంటారు. కానీ పరిస్థితులు వారికి అనుకూలంగా ఉండవు. ఉత్తర కొరియా నుంచి తప్పించుకునే క్రమంలో హూన్ తన ప్రేయసికి దూరమవుతాడు. ఆమెను అక్కడే వదిలేసి దక్షిణ కొరియాకు చేరుకుంటాడు. దక్షిణ కొరియాలోని ప్రముఖ ఆసుపత్రిలో డాక్టర్‌ గా పని చేయడం మొదలుపెట్టిన హూన్‌ కు అక్కడ కొత్త సమస్యలు ఎదురవుతాయి. తన ప్రేయసిని తిరిగి కలుసుకోవాలనే ఆశతో డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తూనే, ఆసుపత్రిలో జరిగే పోటీలు, కుట్రల మధ్య చిక్కుకుంటాడు.

Advertisement

అక్కడే హాన్ జే-జూన్ అనే మరో ప్రతిభావంతుడైన వైద్యుడితో అతడికి పోటీ మొదలవుతుంది. ఈ పోటీ కేవలం వైద్య నైపుణ్యానికి సంబంధించినది మాత్రమే కాదు. దాని వెనుక వ్యక్తిగత కక్షలు, ఆసుపత్రి యాజమాన్యానికి సంబంధించిన వ్యవహారాలు కూడా ఉంటాయి. ఇంతలో హూన్ జీవితంలోకి హాన్ సుంగ్-హీ అనే యువతి వస్తుంది. ఆమెను చూడగానే తన ప్రేయసి జే-హీ గుర్తుకు వస్తుంది. అసలు ఆమె జే-హీనేనా, లేక ఇద్దరూ వేర్వేరు వ్యక్తులా అనే సందేహం హూన్‌ను వెంటాడుతుంది. తన ప్రేమను తిరిగి పొందాలనే ప్రయత్నం ఒకవైపు, కొత్తగా ఎదురవుతున్న భావోద్వేగాలు మరోవైపు అతడిని అయోమయానికి గురిచేస్తాయి.

మరోవైపు ఆసుపత్రిలో ఓ కీలకమైన ఆపరేషన్ కోసం వైద్యుల మధ్య పోటీ జరుగుతుంది. ఆపరేషన్‌లో ఎవరు విజయం సాధిస్తారనే అంశం నుంచి రాజకీయ కుట్రల వరకు కథలో అనేక మలుపులు ఎదురవుతాయి. చివరకు తన ప్రేమ వెనుక దాగిన నిజాన్ని హూన్ ఎలా తెలుసుకుంటాడు ? ఆసుపత్రిలో జరుగుతున్న కుట్రలను ఎలా ఎదుర్కొంటాడు ? అనేది సిరీస్‌లో ఆసక్తికరమైన అంశం.

ఓటీటీలో తెలుగులో ఉందా ?

Advertisement

‘డాక్టర్ స్ట్రేంజ్’ సిరీస్ Amazon MX Player స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులోనూ అందుబాటులో ఉంది. జిన్ హ్యుక్ (Jin Hyuk), హాంగ్ జోంగ్-చాన్ (Hong Jong-chan) దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ లో ప్రేమకథతో పాటు మెడికల్ డ్రామా, సస్పెన్స్, రాజకీయ నేపథ్యం కూడా ఉన్నాయి. మొత్తం 20 ఎపిసోడ్‌లతో రూపొందిన ఈ కొరియన్ డ్రామా 2014 మే 5 నుంచి జూలై 8 వరకు దక్షిణ కొరియాలోని SBS ఛానెల్‌లో ప్రసారమైంది. ఇద్దరు వేర్వేరు అమ్మాయిల మధ్య నలిగిపోయే ఆ డాక్టర్ పడే మానసిక సంఘర్షణ ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తుంది. ఎమోషన్స్, లవ్ ట్రాక్, హై-వోల్టేజ్ పొలిటికల్ అండ్ మెడికల్ ట్రిక్స్ అన్నీ సమపాళ్లలో ఉన్న ఈ సిరీస్ చూస్తుంటే సమయమే తెలియదు. కొరియన్ డ్రామాల ట్రెండ్ ని ఫాలో అయ్యేవాళ్ళు దీన్ని అస్సలు మిస్ కావద్దు.

Read Also: ఏడుగురు పెళ్లికొడుకుల మధ్య చిక్కుకున్న అమ్మాయి కథ… ఫ్యామిలీ డ్రామానే

Tags

Related News

డాక్టర్లకే అంతుచిక్కని మెడికల్ మిస్టరీ… ఓటీటీలో తెలుగులో వచ్చేసిన మైండ్ బ్లాక్ మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్

శివుడిని భర్తగా పొందాలనే పార్వతీ దేవి పట్టుదల… శివపత్ని ఉగ్రరూపం ఇప్పుడు ఓటీటీలో

రేసింగ్ స్టార్‌తో మెకానిక్ ఫేక్ ఎంగేజ్‌మెంట్‌… ఇంట్రెస్టింగ్ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్ తెలుగులో

లాటరీ తెచ్చే తిప్పలు… మనసారా నవ్వుకునే క్లీన్ వెబ్ సిరీస్… నాన్‌స్టాప్ కామెడీ హంగామా

ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ చేసుకున్న రాజమౌళి కొడుకు మూవీ!

చావును కూడా పండుగలా మార్చే అద్భుతమైన వేడుక… ఓటీటీలోకి వచ్చిన ఈ మెక్సికన్‌ సంప్రదాయాన్ని చూశారా ?

స్టార్ కమెడియన్ నవ్వుల వెనుక ఇంతటి విషాదమా ? పాపులర్ నటుడి రియల్ లైఫ్ ను చూపించే డాక్యుమెంటరీ సిరీస్

Big Stories

Advertisement
×