E-Paper
Advertisement

కాకా వర్సెస్ విశ్వంభర సంక్రాంతి రేసులో వచ్చేదెవరు?

కాకా వర్సెస్ విశ్వంభర సంక్రాంతి రేసులో వచ్చేదెవరు?
Advertisement

Kaka VS Vishwambhara: సంక్రాంతి అంటేనే సినిమాల పండుగ అని భావిస్తారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు విడుదల అవుతూ బాక్స్ ఆఫీస్ వద్ద నువ్వా నేనా అంటూ పోటీ పడుతూ ఉంటాయి. చిన్న హీరోల సినిమాల నుంచి మొదలుకొని స్టార్ హీరోల సినిమాలన్నీ కూడా సంక్రాంతి బరిలోనే పోటీకి సై అంటాయి. ఇక వచ్చే సంక్రాంతి పండుగ సందర్భంగా ఇప్పటికే స్టార్ హీరోల సినిమాలన్నింటిని కూడా విడుదల తేదీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)నటించిన కాక (Kaka)సినిమా కూడా విడుదల కాబోతున్నట్టు చిత్ర బృందం వెల్లడించారు.

సంక్రాంతి బరిలోనే విశ్వంభర…

దర్శకుడు బాబి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరి 13వ తేదీ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలిపారు. ఇటీవల ఈ సినిమా వాయిదా పడుతున్నట్టు వార్తలు వచ్చినప్పటికీ చిత్ర బృందం మాత్రం ఈ వార్తలను ఖండించారు. అయితే ఈ సంక్రాంతి పండుగకు చిరంజీవి ఏకంగా రెండు సినిమాలను విడుదల చేస్తున్న నేపథ్యంలో ఈ రెండు సినిమాల మధ్య పెద్ద ఎత్తున పోటీ ఏర్పడబోతుందని తెలుస్తోంది. చిరంజీవి నటించిన కాక సినిమాతో పాటు ఆయన విశ్వంభర(Visheambhara) సినిమా కూడా సంక్రాంతి బరిలోనే దిగబోతోందని సమాచారం.

సోనీ లైవ్ కు విశ్వంభర రైట్స్…

Advertisement

డైరెక్టర్ వశిష్ట(Vassishta) దర్శకత్వంలో త్రిష, చిరంజీవి ప్రధాన పాత్రలలో నటించిన విశ్వంభర సినిమా గత ఏడాది షూటింగ్ పనులను పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమా విఎఫ్ ఎక్స్ పనుల కారణంగా తరచూ వాయిదా వేస్తూ వస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల తేదీ దాదాపు ఖరారు అయిందని తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను సోనీ లైవ్ కైవసం చేసుకున్నారు. ఇలా డిజిటల్ అగ్రిమెంట్ ప్రకారం ఈ సినిమాని జనవరి 9వ ,2027 వ తేదీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

కాకా వర్సెస్ విశ్వంభర…

ఇలా విశ్వంభర సినిమా విడుదలకు సంబంధించి ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే చిరంజీవి నటించిన రెండు సినిమాలు సంక్రాంతి బరిలో విడుదలవుతున్నాయా ఇదే కనక నిజమైతే మెగా ఫాన్స్ కి అసలు సిసలైన పండుగ అని చెప్పాలి. ఇక సంక్రాంతి సందర్భంగా ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయా లేదంటే ఎవరో ఒకరు వెనకడుగు వేస్తారా అంటూ మరి కొంతమంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా చిరంజీవి రెండు సినిమాలు విడుదల విషయంలో ఎంతవరకు నిజముందనేది తెలియాలి అంటే విశ్వంభర మేకర్స్ ఈ సినిమా విడుదలపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సినిమా యువి క్రియేషన్ బ్యానర్ పై ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

Advertisement

Also Read: ట్రైలర్ లేకుండానే థియేటర్లోకి నాని ‘ప్యారడైజ్’ మూవీ..క్లారిటీ ఇచ్చిన హీరో!

Related News

అభిమాని కుటుంబానికి అండగా రామ్ పోతినేని.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్!

హీరోయిన్ అమీషా పటేల్ ఇంట్లో చోరీ.. మొత్తం విలువ ఎంతంటే?

దమ్ముంటే ‘స్పిరిట్’ సినిమాని పడగొట్టండి.. సవాల్ విసిరిన ప్రొడ్యూసర్!

తాళి బొట్టు మహిళలే ఎందుకు వేసుకోవాలి ..నమిత కామెంట్స్ వైరల్ !

ఎపిక్‌కి మిక్స్‌డ్ టాక్.. ఫ్లాప్ దిశగా వెళ్తుందా?

ముదురుతున్న డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదం.. కీలక సమావేశంపై కోర్టు స్టే!

‘శివాజీ’ మూవీ నటుడు ‘సోలమన్ పప్పయ్య’ మృతి!

Big Stories

Advertisement
×