E-Paper
Advertisement

తేజుకి ప్రపోజ్ చేసిన నవదీప్.. వీడియో వైరల్!

తేజుకి ప్రపోజ్ చేసిన నవదీప్.. వీడియో వైరల్!
Advertisement

Actor Navdeep:ప్రముఖ టాలీవుడ్ నటుడు నవదీప్ (Navdeep)గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకప్పుడు హీరోగా సినిమాలు చేసి.. ఆ తర్వాత సెకండ్ హీరోగా కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఎప్పుడూ సరదా మాటలతో ఆకట్టుకునే నవదీప్.. తాజాగా తేజస్వి(Tejaswi madiwada)తో చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. “మనిద్దరం పెళ్లి చేసుకుందామా?” అంటూ డైరెక్ట్ గా షోలో అడగడం హాట్ టాపిక్ గా మారింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

తేజస్వి షోకి గెస్ట్ గా నవదీప్..

ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ‘కాకమ్మ కథలు సీజన్ 3 ‘ గ్రాండ్ ఫైనల్ ఎపిసోడ్ 10 కి సంబంధించిన ప్రోమోని నిర్వాహకులు తాజాగా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి తేజస్వి మదివాడ హోస్ట్ గా వ్యవహరిస్తోంది. తాజా ఎపిసోడ్ కి హీరో నవదీప్ తో పాటు ప్రముఖ నటి అనిషా ఆంబ్రోస్ గెస్ట్లుగా హాజరయ్యారు. ప్రోమో విడుదలైన మొదటి నుంచే సరదా మాటలతో నవ్వులు పూసాయి. అద్భుతమైన వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటున్న తేజస్వి నవదీప్ ను ఇంట్రడ్యూస్ చేస్తూ తనదైన స్టైల్ లో పంచ్ వేసింది.” నవ మన్మధుడు.. పెళ్లి గురించి అడిగితే బీప్ వచ్చే మన నవదీప్” అంటూ ఫన్నీగా పరిచయం చేసింది.

మనిద్దరం పెళ్లి చేసుకుందామా అంటూ ప్రపోజ్..

Advertisement

ఇకపోతే షోలో భాగంగా ‘ఆశకు హద్దు ఉండాలి’ అనే టాస్క్ నిర్వహించగా.. వారు చెప్పిన పదాలను బేస్ చేసుకుని అందులో నవదీప్ ఒక విచిత్రమైన కథ అల్లి అందర్నీ నవ్వించారు. “ఒడిస్సా లోని ఒక గ్రామంలో వర్షం కురిసిన రాత్రి కవల పిల్లలు పుట్టారు. ఒకరికి వెన్నెల, మరొకరికి అమావాస్య అనే పేర్లు పెట్టారు” అని చెప్పి కథను చాలా విచిత్రంగా మలిచాడు. అంతటితో ఆగకుండా..” ఆ అమ్మాయి ఎప్పుడూ కుర్చీలు మడత పెట్టేది. అందుకే ఆమెను ఊటీకి పంపించారు. అక్కడ ఫుల్ గా వెళ్తున్న టాక్సీలో నేను కలిశాను” అంటూ ఊహించని ట్విస్ట్ లతో కథ చెప్పి నవ్వులు పూయించాడు. అలాగే నవదీప్ ను వ్యక్తిగత విషయాలపై ప్రశ్నిస్తూ.. “ఈ మధ్యకాలంలో మీ గురించి వచ్చిన అతి పెద్ద రూమర్ ఏంటి?” అని తేజస్వి ప్రశ్నించగా.. నవదీప్ మాట్లాడుతూ..” నా లైఫ్ లో ఎన్నో రూమర్స్ వచ్చాయి. కానీ అంటూనే ఒక్కసారిగా తేజు వైపు చూసి..” మనిద్దరం పెళ్లి చేసుకుంటే బాగుంటుందేమో” అంటూ సరదాగా ప్రపోజ్ చేశారు.. ఈ మాటలతో తేజు ఒక్కసారిగా షాక్ అయింది.

ALSO READ:ఆడాళ్ళకి ఆటిట్యూడ్ తప్ప గ్రాటిట్యూడ్ ఉండదు.. వీడియోతో వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’!

అదిరిపోయే తేజస్వి కౌంటర్..

Advertisement

అంతటితో ఆగకుండా తన చేతిలో ఉన్న పువ్వు తీసుకొని ఆమెకు ప్రపోజ్ చేసే ప్రయత్నం చేశారు. అయితే తేజు కూడా ఏమాత్రం ఆగకుండా తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది.” షోకి పిలిస్తే నాతోనే ఆడుకుంటున్నాడు చూడండి” అంటూ సెటైర్ వేసింది. అలాగే తేజు నవదీప్ ని ప్రశ్నిస్తూ ప్రస్తుతం మీ క్రష్ ఎవరు? అని అడగగా.. దానికి నవదీప్ “ఆడవాళ్ళలోనా లేక మగవాళ్లలోనా?” అంటూ రివర్స్ కౌంటర్ వేశాడు. మొత్తానికైతే తాజాగా సాగిన ఈ ప్రోమో నవ్వులు పూయిస్తోంది. తాజాగా విడుదల చేసిన ప్రోమో ఎపిసోడ్ పై ఆసక్తిని పెంచేసింది. పూర్తి ఎపిసోడ్ కావాలి అంటే ఆహా ఓటీటీ వేదికగా జూలై 30వ తేదీన రాత్రి 7 గంటల వరకు వెయిట్ చేయాల్సిందే.

Related News

సెలబ్రిటీలకు మద్దతు తెలిపిన మాజీ కంటెస్టెంట్.. కామనర్స్ అంటే అంత చులకనా?

బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా సుప్రీత.. ఏమన్నారంటే?

సీక్రెట్ రూమ్ లో చరణ్, చైత్ర? కంటెస్టెంట్లకు నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్!

ఢీ10 షో విన్నర్ రాజు అరెస్ట్?

నా జీవితంలో మర్చిపోలేని రోజు అదే – నటరాజ్ మాస్టర్!

బిగ్ బాస్ 10పై షాకింగ్ కామెంట్స్ చేసిన నటరాజ్ మాస్టర్!

కన్నీళ్లు పెట్టుకున్న ఉదయభాను.. వీడియో వైరల్!

బిగ్ బాస్10 చైత్ర రాయ్ ఎలిమినేటెడ్.. రెమ్యూనరేషన్ ఎంతంటే?

Big Stories

Advertisement
×