E-Paper
Advertisement

అమ్మ చేతి కమ్మని వంట.. కిచెన్‌ నుంచి వచ్చే ఆ మసాలాల సువాసనలు, ఇప్పుడేవీ?

అమ్మ చేతి కమ్మని వంట.. కిచెన్‌ నుంచి వచ్చే ఆ మసాలాల సువాసనలు, ఇప్పుడేవీ?
Advertisement

ఆ రోజులు వేరు. 80ల్లో వంటగది అంటే ఓ సందడి. ఉదయం సూర్యుడు ఇంట్లోకి తొంగిచూసే సమయానికే… అమ్మ వంటింట్లో ఉండేది. ఓ వైపు పొయ్యి మీద కూర ఉడుకుతూ ఉండగా… మరోవైపు రోలు రోకలిలో మసాలాలు నూరుతూ అమ్మ చేతులు బిజీగా ఉండేవి. అప్పట్లో రోకలి దెబ్బల శబ్దం… ఇంట్లో ఓ సంగీతంలా వినిపించేది. అమ్మమ్మ చేతులతో నూరిన పచ్చడి. అమ్మ ప్రేమతో వండిన పప్పు. పిల్లలు వంటింటి చుట్టూ తిరిగిన రోజులు.. ఆహా అప్పటి రోజులే వేరు కదా! అప్పుడు వంట అంటే కేవలం ఆకలి తీర్చడం కాదు… ఇంట్లో అందరినీ కలిపే ఓ అనుబంధం. ఆ రోట్లో నూరిన మసాలాలో రుచి మాత్రమే కాదు… దాన్ని చేసిన చేతుల ప్రేమ కూడా ఉండేది.

కానీ కాలం మారింది. జీవితం వేగంగా మారిపోయింది. ఉద్యోగాలు, బిజీ షెడ్యూల్స్ మధ్య వంటగదిలో గడిపే సమయం తగ్గిపోయింది. రోలు రోకలి స్థానంలో ఇప్పుడు మిక్సీలు వచ్చాయి. ఆ తర్వాత స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. ఇప్పుడు వంట చేయాలనే ఆలోచన కంటే.. ఏ ఫుడ్ ఆర్డర్ చేయాలి అనే ఆలోచన ముందుకొస్తోంది. స్విగ్గీ, జోమోటో లాంటి యాప్స్‌తో నచ్చిన భోజనం ఇంటి ముందుకు వస్తోంది. అప్పుడు అమ్మ వంట ఎప్పుడు అవుతుందా? అని ఎదురుచూసేవాళ్లం. ఇప్పుడు డెలివరీ బాయ్ ఎప్పుడు వస్తాడా? అని చూస్తున్నాం. మారింది కేవలం వంట విధానం కాదు. మన జీవించే పద్ధతి కూడా మారిపోయింది.

Advertisement

Also Read: ఎండ్ల బండిపై హయ్.. హయ్.. మారుతీ కారులో రయ్ రయ్.. 80’s జర్నీ మరపురానిది!

80’s ట్రెండ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎందుకు ఇంత వైరల్ అవుతోంది..? ఎందుకంటే ఆ ఫొటోల్లో కేవలం పాత దుస్తులు కనిపించడం లేదు. అందులో మన చిన్ననాటి ఇల్లు కనిపిస్తోంది. అమ్మమ్మ పిలుపు వినిపిస్తోంది. అమ్మ చేతి వంట గుర్తుకొస్తోంది. ఇప్పుడు పెద్ద పెద్ద కిచెన్లు ఉన్నాయి… ఖరీదైన పరికరాలు ఉన్నాయి. కానీ ఒకప్పుడు చిన్న వంటగదిలో దొరికిన ఆ ఆనందం. ఇంట్లో అందరూ కలిసి తిన్న ఆ భోజనం. అమ్మ చేతితో పెట్టిన ఆ ముద్ద… వాటికి మాత్రం విలువ వేరు. రోలు రోకలి ఆగిపోయింది. కానీ దాని చుట్టూ తిరిగిన జ్ఞాపకాలు ఇంకా బతికే ఉన్నాయి.

Advertisement

Also Read: 80’s హీరోస్.. కొత్తతరం కథానాయకులకు యమ క్రేజ్, మహా నటులను వెనక్కి నెట్టి..

Tags

Related News

ఒక్క ఫోటో కోసం ఎన్నో రోజులు ఎదురుచూపులు.. 80s స్టూడియో అనుభూతే వేరు!

80ల్లో ఆటలు.. పెనవేసుకొనే బంధాలు.. ఇప్పుడవి ఏమైపోయాయ్?

80’s లవ్ లెటర్.. కాగితంపై మనసులో మాట.. అక్షరాల్లో అంతులేని ప్రేమ!

స్త్రీలు కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజం.. PCOS – PCOD మధ్య అసలు తేడా ఇదే!

సైకిల్ బెల్ వినిపిస్తే చాలు.. ఉత్తరం వచ్చిందనే ఆనందం, అప్పుడు డబ్బాలు.. ఇప్పుడు ఫోన్లు!

80’s సోకులు.. ఏఐతో హంగులు.. జెన్ జీ ఫుల్ ఫిదా, ఎందుకంటే?

పొరపాటున కూడా..ఇలాంటి వినాయక విగ్రహాలు అసలు కొనొద్దు!

Big Stories

Advertisement
×