E-Paper
Advertisement

80’s హీరోస్.. కొత్తతరం కథానాయకులకు యమ క్రేజ్, మహా నటులను వెనక్కి నెట్టి..

80’s హీరోస్.. కొత్తతరం కథానాయకులకు యమ క్రేజ్, మహా నటులను వెనక్కి నెట్టి..
Advertisement

1980s Telugu Heros: 1980లో తెలుగు తెరను శాసిస్తున్నది ఎన్టీఆర్‌.. ఏఎన్నార్‌.. కృష్ణ.. శోభన్‌బాబు.. కృష్ణంరాజు..! వీళ్ల సినిమాలకు భారీ ఓపెనింగ్స్‌ ఉండేవి. ఫ్యాన్స్‌లో విపరీతమైన క్రేజ్‌ కూడా. అప్పట్లో హీరోల అభిమాన సంఘాలు కూడా కీలకంగా ఉండేవి. థియేటర్ల దగ్గర కటౌట్లు.. పూలమాలలు.. ఫస్ట్‌ డే హడావుడి జోరు బాగా ఉండేది. అదే సమయంలో.. వెండి తెరకు పరిచయమైన కొత్త పేరు.. చిరంజీవి! 1978లో ప్రాణం ఖరీదుతో ప్రారంభమైన ఆయన ప్రయాణం.. 1980లో మరింత వేగం అందుకుంది.

చిరు, బాలయ్యలకూ యమ క్రేజ్..

మోసగాడు, పున్నమినాగు, మొగుడు కావాలి వంటి సినిమాలతో..యువ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్నారప్పుడు చిరంజీవి. పున్నమి నాగు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిన సినిమాల్లో ఒకటి. ఇక నందమూరి కుటుంబం నుంచి..బాలకృష్ణ అప్పటికే బాలనటుడిగా ప్రేక్షకులకు పరిచయమయ్యారు. 1974లో తాతమ్మ కలతో మొదలైన ప్రయాణం..దానవీర శూరకర్ణ, అక్బర్ సలీం అనార్కలి, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం వంటి సినిమాలతో ఆయన ప్రయాణం కొనసాగింది. 1980లో ఎన్టీఆర్‌తో కలిసి రౌడీ రాముడు కొంటె కృష్ణుడు అనే సినిమాలో నటించారు బాలక్రిష్ణ.

నాగ్.. వెంకీల ఎంట్రీ

Advertisement

బాలక్రిష్ణ సోలో హీరోగా మారింది మాత్రం 1984లోనే. అక్కినేని నాగార్జున అప్పటికి ఇంకా సినీ ప్రవేశం చేయలేదు. 1986 లో విక్రమ్‌గా హీరోగా అవతారమెత్తారు. వెంకటేశ్‌ కూడా 1980లో హీరో కాదు. ఆయన పూర్తి స్థాయి హీరోగా 1986లో కలియుగ పాండవులుతో అరంగేట్రం చేశారు. 1980లో లేని ఈ రెండు పేర్లు.. కేవలం ఆరు సంవత్సరాల్లో టాలీవుడ్‌ కొత్త తరం పోటీలోకి వచ్చేశాయి!

Also Read: 80ల్లో ఆటలు.. పెనవేసుకొనే బంధాలు.. ఇప్పుడవి ఏమైపోయాయ్?

Advertisement

Also Read: 1980లో ప్రపంచ కప్.. రేడియోలోనే లైవ్, టీమిండియా సత్తాను ప్రపంచానికి చాటిన రోజులవి!

Tags

Related News

సిచ్యుయేషన్ డిమాండ్ చేస్తే యాక్షనే..ఆదర్శ కుటుంబం టీజర్ రిలీజ్!

‘ఎపిక్’కు ఫస్ట్ డేనే షాక్.. బాక్సాఫీస్ దగ్గర దారుణమైన ఓపెనింగ్స్

ఇక సినిమాలకు ట్రైలర్స్ అవసరం లేదా? నాని నిర్ణయంతో కొత్త చర్చ!

అభిమాని కుటుంబానికి అండగా రామ్ పోతినేని.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్!

హీరోయిన్ అమీషా పటేల్ ఇంట్లో చోరీ.. మొత్తం విలువ ఎంతంటే?

దమ్ముంటే ‘స్పిరిట్’ సినిమాని పడగొట్టండి.. సవాల్ విసిరిన ప్రొడ్యూసర్!

తాళి బొట్టు మహిళలే ఎందుకు వేసుకోవాలి ..నమిత కామెంట్స్ వైరల్ !

Big Stories

Advertisement
×