Epic First Semester Box Office: ఆనంద్ దేవరకొండ ..వైష్ణవీ చైతన్య ..బేబీ సినిమాలో ఈ జోడీ ఎంతలా అలరించిందో చెప్పక్కర్లేదు .ఇక ఈ జోడీ ఉంటేనే ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ సినిమా తీస్తానని చెప్పాడట నిర్మాత నాగ వంశీ .
అంటే దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఆడియన్స్ లో ఈ జంటకి ఎంత క్రేజ్ ఉందో. పైగా 90s మిడిల్ క్లాస్ బయోపిక్ సిరీస్ తో డిజిటల్ ఆడియన్స్ ని అలరించిన ఆదిత్య హాసన్ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుండటం తో అంచనాలు బాగానే పెంచుకున్నారంతా .కానీ సెప్టెంబర్ 11న థియేటర్ లోకి వచ్చిన ఈ సినిమా మొదటి రోజే వీక్ నెంబర్స్ తో బాక్సాఫీస్ ని ఓపెన్ చేయడం గమనార్హం.
ట్రేడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమా మొదటి రోజు ఇండియా వైడ్ గా దాదాపు రూ.2.10 కోట్ల నెట్ వసూళ్లని దక్కించుకున్నట్టు తెలుస్తుంది.ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే దాదాపు రూ.2.5 కోట్ల వరకు వచ్చినట్లు సమాచారం.
ఇక వరల్డ్‌వైడ్‌గా తొలి రోజు మొత్తంగా సుమారు రూ.3.55 కోట్ల గ్రాస్ మాత్రమే దక్కించుకుందట .ఒకవైపు బేబీ జోడీ ,మరోవైపు సూపర్ హిట్ అయిన 90s మిడిల్ క్లాస్ బయోపిక్ డైరెక్టర్ ,ఇంకో వైపు ప్రిస్టేజియస్ బ్యానర్ అయిన సితార ఎంటర్ టైన్ మెంట్స్ .ఇలా అన్ని వైపులా మంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నప్పటికీ ఈ సినిమా కేవలం మూడు కోట్ల దగ్గరలోనే ఆగిపోవడం ట్రేడ్ వర్గాలకి పెద్ద షాక్.
ఇక ఊహించని కలెక్షన్స్ ని చూడటం మేకర్స్ కి కూడా పెద్ద దెబ్బె.ఇక సినిమా విడుదలైన మొదటి రోజు థియేటర్ లో ఆక్యుపెన్సీ కూడా మోస్తరు గానే నమోదైందని తెలుస్తుంది ..ఇక షోలలో అయితే 19 నుంచి 21 శాతం మధ్య ఆక్యుపెన్సీ కనిపించడం చూస్తుంటే అసలు సినిమా ముందు దీనికి వచ్చిన బజ్ అంతా ఎక్కడికి పోయిందా అన్న డౌట్స్ రైజ్ అవుతున్నాయి.
సాధారణంగా హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న జోడీ నుండి మరో సినిమా వస్తుందంటే బుకింగ్స్ వద్ద హడావిడి ఒక రేంజ్ లో ఉంటుంది.కానీ . కానీ ‘ఎపిక్’ విషయంలో ఆ రేంజ్ బజ్ కనిపించకపోవడం తో ఓపెనింగ్‌పై ఇంపాక్ట్ గట్టిగానే పడింది.
అయితే సినిమా మొత్తంగా చేతులు ఎత్తేసిందా అంటే ఇప్పుడే చెప్పడం కష్టం.సినిమాలో ఫస్ట్ హాఫ్‌లో వచ్చే కొన్ని కామెడీ సీన్స్, ఆనంద్ దేవరకొండ ..వైష్ణవీ చైతన్య మధ్య కెమిస్ట్రీ సినిమాకు కొంత ప్లస్‌గా నిలిచాయని టాక్ వినిపిస్తోంది.
ముఖ్యంగా కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసినా,అసలు సమస్య సెకండాఫ్ దగ్గరే మొదలైందని సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.
Also read :ఇక సినిమాలకు ట్రైలర్స్ అవసరం లేదా? నాని నిర్ణయంతో కొత్త చర్చ!
మొత్తంగా మొదటి రూ.2 కోట్లకు పైగా నెట్ వసూళ్లు వచ్చినా, ఈ కాంబినేషన్‌పై ఉన్న అంచనాలతో పోలిస్తే ఇది తక్కువేనని ట్రేడ్ వర్గాలలో వినిపిస్తున్న మాట .చూడాలి మరి ముందు ముందు ఏమైనా పుంజుకుంటుందేమో !