E-Paper
Advertisement

ఇక సినిమాలకు ట్రైలర్స్ అవసరం లేదా? నాని నిర్ణయంతో కొత్త చర్చ!

ఇక సినిమాలకు ట్రైలర్స్ అవసరం లేదా? నాని నిర్ణయంతో కొత్త చర్చ!
Advertisement

The Paradise:ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే ..అసలు సినిమా ముందుంది …ఏదైనా విషయంలో హైప్ ఇవ్వాలంటే మాములుగా ఇలాంటి కామెంట్స్ చేస్తుంటారు. ట్రైలర్ అనే పదానికి ఉన్న ఇంపార్టెన్స్ అలాంటిది మరి.అలాంటి ట్రైలర్ లేకుండా సినిమాలని ఊహించగలమా ..?

కానీ ఇక ముందు ఊహించాల్సిందే అంటున్నాడు న్యాచురల్ స్టార్ నాని.అవును..తాజాగా జరిగిన ప్యారడైజ్ Q అండ్ A లో ఈ సినిమానికి ట్రైలర్ రావట్లేదని క్లారిటీ ఇచ్చేశాడు .

Advertisement

అసలే సినిమా రిలీజ్ డేట్ అయిన సెప్టెంబర్ 24 ముంచుకువస్తుందని అలాంటి ఈ సమయం లో ట్రైలర్ కట్ అంటూ నాలుగైదు రోజులు వేస్ట్ చేయడం వేస్ట్ అని దాని బదులుగా సినిమా ని పూర్తి చేసే పనిలో పడితే అనుకున్నట్టుగా రిలీజ్ సమయానికి రెడీ అయిపోవచ్చని కుండబద్దలు కొట్టేశాడు.

నాని అన్నదాంట్లో అర్థం ఉంది కాబోలు .ఇప్పటికే పలు మార్లు రిలీజ్ డేట్ ని వాయిదా వేసిన సినిమా ఇక నైనా చెప్పిన డేట్ వస్తే బాగుంటుంది అని ప్రొడక్షన్ వర్క్ ని స్పీడప్ చేసేందుకు ఇలా నిర్ణయం తీసుకుని ఉండవచ్చు.

Advertisement

కానీ ఒక సినిమా థియేటర్లోకి వస్తుందట ఆడియన్స్ కి ఆ దర్శకుడు ఏం చెప్పబోతున్నాడు ,సినిమా ఎలా ఉండబోతుంది అంటూ ఆడియన్స్ అంచనాకి వచ్చేది ఈ ట్రైలర్ ని చూసే .గ్లిమ్స్ ,పోస్టర్స్ ,టీజర్స్ ఇలా ఎన్ని వచ్చినా ట్రైలర్ లో ఉండే స్టఫ్ వేరు.చాలా మంది ఈ ట్రైలర్ లని చూసే సినిమాలని చూడాలా వద్దా అని డిసైడ్ అవుతుంటారు కూడా.

అయితే నాని తీసుకున్న ఈ డిసీషనే ఇపుడు ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.ప్యారడైజ్ సినిమా గనుక బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అయితే రాబోయే రోజుల్లో ఇలా ట్రైలర్ లేకుండానే సినిమాలు రిలీజ్ చేయడం ఒక ట్రెండ్ అయి కూర్చుంటుందా అంటూ అనాలసిస్ చేసే పనిలో పడ్డారు ట్రేడ్ పండితులు.

అయితే అన్ని సినిమాలకి ఇదే ట్రెండ్ ఫాలో అయితే వర్కవుట్ అవుతుందా అంటే అనుమానమే ,ఎందుకంటే పెద్ద సినిమాలకి ముందు నుండే భారీ హైప్ ఉంటుంది ,పైగా అప్పటికే వదిలిన పోస్టర్స్ , గ్లిమ్ప్స్ , టీజర్స్ వంటివి సినిమా లో కంటెంట్ ఏమై ఉంటుందో ,కథ ఎలా ఉండవచ్చో ఒక క్లారిటీని ఆడియన్స్ కి ,మూవీస్ లవర్స్ కి ఇచ్చేస్తాయి.

అదే చిన్న సినిమాలకి మాత్రం ఖచ్చితంగా అరటి పండు వలచి నోట్లో పెట్టినట్టుగా సినిమాకి సంబందించిన ప్రతి అప్ డేట్ ని ,ముఖ్యంగా ఈ సినిమా ఇలా ఉండబోతుంది అనే చెప్పే ట్రైలర్ మాత్రం ఖచ్చితంగా ఉంది తీరాల్సిందే.కాబట్టి పెద్ద సినిమాలు రిస్క్ చేసి ట్రైలర్ ని అవాయిడ్ చేసినా చిన్న సినిమాలు మాత్రం టీజర్ ,ట్రైలర్ అంటూ హంగామా క్రియేట్ చేసి సినిమాపై బజ్ ని పెంచాల్సిందే.

ఏది ఏమైనా పెద్ద సినిమాలకి కూడా ఇలా ట్రైలర్‌ వదలకుండా డైరెక్ట్ గా థియేటర్ లో సర్ప్రైజ్ ఇస్తామంటూ రెడీ అయినా ప్యారడైజ్ సినిమా సక్సెస్ అయితేనే మరిన్ని ఆ బాటలో నడిచే అవకాశం ఉంటుంది .

Also read :తాళి బొట్టు మహిళలే ఎందుకు వేసుకోవాలి ..నమిత కామెంట్స్ వైరల్ !

అలా కాకుండా ఏమైనా తేడా కొడితే మాత్రం ..ఎందుకొచ్చిన గోలలే అనుకుంటూ ,సినిమాలో అసలేం చెబుతున్నామో ముందే చెప్పేస్తే ఒక పని అయిపోతుందని మళ్ళీ పాత బాటలోనే నడవడం ఖాయం.మొత్తానికి ఇది ట్రెండ్ అవుతుందా లేక గుదిబండ అవుతుందా అనేది ప్యారడైజ్ సినిమా రిజల్ట్ ని బట్టి ఉంటుందన్న మాట !

Tags

Related News

సిచ్యుయేషన్ డిమాండ్ చేస్తే యాక్షనే..ఆదర్శ కుటుంబం టీజర్ రిలీజ్!

‘ఎపిక్’కు ఫస్ట్ డేనే షాక్.. బాక్సాఫీస్ దగ్గర దారుణమైన ఓపెనింగ్స్

80’s హీరోస్.. కొత్తతరం కథానాయకులకు యమ క్రేజ్, మహా నటులను వెనక్కి నెట్టి..

అభిమాని కుటుంబానికి అండగా రామ్ పోతినేని.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్!

హీరోయిన్ అమీషా పటేల్ ఇంట్లో చోరీ.. మొత్తం విలువ ఎంతంటే?

దమ్ముంటే ‘స్పిరిట్’ సినిమాని పడగొట్టండి.. సవాల్ విసిరిన ప్రొడ్యూసర్!

తాళి బొట్టు మహిళలే ఎందుకు వేసుకోవాలి ..నమిత కామెంట్స్ వైరల్ !

Big Stories

Advertisement
×