Allu Mega Families: ఇటీవల అల్లు, మెగా కుటుంబంలో విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. దివంగత నటుడు అల్లు రామలింగయ్య సతీమణి అల్లు కనక రత్నమ్మ(Allu Kanakaratnamma) వృద్ధాప్య సమస్యల కారణంగా మరణించిన విషయం తెలిసిందే. ఇలా అల్లు కనక రత్నమ్మ మరణ వార్త బాధాకరమే అయినప్పటికీ, ఈమె మరణ వార్త తెలిసిన మెగా కుటుంబ(Mega Family) సభ్యులందరూ అల్లు ఇంటికి చేరుకొని కనక రత్నమ్మ గారికి నివాళులు అర్పించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోలు వీడియోలు చూసిన అభిమానులు కాస్త సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా అల్లు కుటుంబం గురించి మెగా కుటుంబం గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వినిపించాయి.
ఒకే ఫ్రేమ్ లో మెగా అల్లు హీరోలు..
మెగా కుటుంబానికి అల్లు అర్జున్ పూర్తిగా దూరంగా ఉంటున్నారని, అల్లు అర్జున్(Allu Arjun) రామ్ చరణ్(Ramcharan) మధ్య ఏదో జరుగుతోంది అంటూ భారీగా వార్తలు హల్చల్ చేశాయి. ఇలా ఈ రెండు కుటుంబాల మధ్య దూరం పెరుగుతుందంటూ వార్తలు వచ్చినప్పటికీ ఎప్పటికప్పుడు ఈ రెండు కుటుంబాలు ఈ వార్తలను ఖండిస్తూ వచ్చారు.. కనక రత్నమ్మ గారు మరణించడంతో తన అమ్మమ్మకు నివాళులు అర్పించడానికి రామ్ చరణ్ అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. ఇక అల్లు అర్జున్ రామ్ చరణ్ ఇద్దరూ కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న పవన్ కళ్యాణ్ కూడా తన రాజకీయ వ్యవహారాలు పూర్తి కావడంతో సరాసరి అల్లు అరవింద్ ఇంటికి వెళ్లి అల్లు కుటుంబ సభ్యులను పరామర్శించారు.
కష్టాలు తాత్కాలికం.. బంధాలు శాశ్వతం..
ప్రస్తుతం అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా అల్లు అర్జున్ – రామ్ చరణ్, అల్లు అర్జున్ – పవన్ కళ్యాణ్ లను ఒకే ఫ్రేమ్ లో చూడటం మెగా అల్లు అభిమానులకు కాస్త తృప్తిని కలిగిస్తుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మెగా అల్లుకు ఫ్యామిలీకి ఎంతో సన్నిహితంగా ఉన్న నిర్మాత ఎస్ కే ఎన్ (SKN)కూడా వీరి ఫోటోలను ఎక్స్ వేదికగా షేర్ చేస్తూ” కష్టాలు తాత్కాలికం.. బంధాలు శాశ్వతం” అంటూ క్యాప్షన్ జోడించారు.
కష్టాలు తాత్కాలికం 🙏
బంధాలు శాశ్వతం ❤️
Family 🫶 pic.twitter.com/rD0H5Yw0rv— SKN (Sreenivasa Kumar) (@SKNonline) August 31, 2025
ఇక ఈ ఫోటోలు వైరల్ గా మారడంతో మెగా అల్లు కుటుంబం మధ్య విభేదాలు ఉన్నాయని, దూరం పెరిగాయి అంటూ వస్తున్న వార్తలలో ఏమాత్రం నిజం లేదని స్పష్టమవుతుంది. ఇలా అల్లుకున్న మెగా బంధాన్ని చూసిన అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక మెగా హీరోల సినిమాల విషానికి వస్తే మెగా హీరోలు అందరి సినిమాలు కూడా ప్రస్తుతం సెట్స్ పైన షూటింగ్ పనులను జరుపుకుంటూ ఉన్నాయి. త్వరలోనే వరుసగా ఈ హీరోలందరి సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి. ఇక అల్లు అర్జున్ సైతం అట్లీ డైరెక్షన్ లో చేయబోతున్న సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
Also Read: Jagapathi Babu: జెర్సీ మూవీ వదులుకొని పశ్చాత్తాపడుతున్న జగపతిబాబు..అందుకే అలాంటి నిర్ణయం?