Rajasthan Royals : ఐపీఎల్ టీమ్ రాజస్థాన్ రాయల్స్ తో రాహుల్ ద్రవిడ్ బంధం ముగిసింది. 2025 సీజన్ లో టీమ్ హెడ్ కోచ్ గా వ్యవహరించిన ద్రవిడ్ ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ద్రవిడ్ కి మరింత పెద్ద బాధ్యతలు అప్పగించాలని తాము భావించగా.. దానికి అతను అంగీకరించలేదని రాయల్స్ యాజమాన్యం వెల్లడించింది. ఐపీఎల్ 2026కి ముందే రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ముగిసింది. సుదీర్ఘకాలంగా రాయల్స్ ప్రయాణంలో ద్రవిడ్ ప్రధాన కేంద్రంగా ఉన్నారు. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కొనసాగకపోవడానికి గల కారణాలను క్రిక్ బజ్ అంచనా వేసింది. గత సీజన్ లో టీమ్ వైఫల్యం 9వ స్థానం కెప్టెన్ శాంసన్ తో చిన్నపాటి భేదాభిప్రాయాలు, అతడు రాజస్తాన్ రాయల్స్ ను వీడాలనుకోవడం, వేరే రోల్ కు ద్రవిడ్ నిరాకరించడం వంటివి కారణం అయ్యిండొచ్చని పేర్కొంది.
Also Read : Namibia vs Scotland : మ్యాచ్ జరుగుతుండగా కలకలం… ఒక్కసారిగా గ్రౌండ్ లో మంటలు.. అసలు ఏం జరిగిందంటే
కెప్టెన్ నుంచి కోచ్ వరకు..
ఆ జట్టుకు మళ్లీ సంగక్కర తిరిగి కోచ్ గా రావచ్చని.. సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ ని వీడి వేలంలోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. రియాన్ పరాగ్ ని కెప్టెన్ గా ఒక వర్గం ముందుకు తెచ్చింది. మరోవైపు యశశ్వి జైస్వాల్ ని కెప్టెన్ గా చేయాలని సూచిస్తుంది. మరో వర్గం సంజు శాంసన్ ని కెప్టెన్ గా కొనసాగించాలని తెలిపినట్టు క్రిక్ బజ్ వెల్లడించింది. మరోవైపు జైశ్వాల్ కూడా రాజస్థాన్ రాయల్స్ నుంచి వైదొలుగుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 2011లో తొలిసారిగా రాజస్థాన్ జట్టు తరపున ద్రవిడ్ ఆడాడు. 2012, 2013 లలో రెండేళ్ల పాటు కెప్టెన్ గా బాధ్యతలు నిర్వర్తించారు. తరువాత రెండు సీజన్లలో అతడు టీమ్ డైరెక్టర్, మెంటార్ గా వ్యవహరించాడు.
ప్రాధాన్యత తగ్గించడంతోనే..
కొన్నేళ్ల విరామం, భారత కోచ్ గా పదవీ కాలం ముగిసిన తరువాత గత సీజన్ లో అతను మళ్లీ టీమ్ కి కోచ్ గా వచ్చాడు. 2025 సీజన్ లో రాయల్స్ పేలవ ప్రదర్శన కనబరిచింది. 14 మ్యాచ్ ల్లో 4 మాత్రమే గెలిచి 9వ స్థానంతో ముగించింది. ప్రస్తుతం ఈ టీమ్ కి సంగర్కర డైరెక్ట్ ఆఫ్ క్రికెట్ గా ఉన్నాడు. ద్రవిడ్ ను హెడ్ కోచ్ గా ప్రకటించినప్పటికీ కేవలం ఏడాదికి మాత్రమే పరిమితం కాది మేనేజ్ మెంట్ స్పష్టంగా చెప్పింది. కానీ వాస్తవంలో అదే జరిగింది. ఐపీఎల్ ఫ్రాంచైజీలు పెద్ద బాధ్యతతో ప్రమోషన్ ఇస్తున్నాయని అంటే దానర్థం ప్రధానమైన కోచింగ్ బృందంలో మీ ప్రాధాన్యతను తగ్గిస్తున్నట్టే.రోజూ వారి మ్యాచ్ల వ్యూహాలు, ప్రణాళికల్లో మీ మాటకు విలువ ఉండదు. ఆటగాళ్లతో బంధం ముగిసిపోతుందని గతంలో ఐపీఎల్ లో వేర్వేరు జట్లతో పని చేసిన ఒక కోచ్ తాజా పరిణామం పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ద్రవిడ్ కూడా ఇదే ఆలోచనతో తప్పుకొని ఉండవచ్చు.