Allu Sirish -Allu Arjun: అల్లు శిరీష్ గత రెండు రోజులుగా సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. తన ఇంటి పరిసర ప్రాంతాలలో కొంతమంది భారీ శబ్దాలతో డీజేలు,లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేసుకొని అర్ధరాత్రి గంటల వరకు కూడా మోత మోగిస్తున్నారు అంటూ ఈయన హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇలా అల్లు శిరీష్ (Allu Sirish)పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈయనపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. వినాయక చవితి నవరాత్రులు పూర్తి అయినప్పటికీ కూడా ఇలా శబ్దాలు కొనసాగడంతో శిరీష పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు ఫిర్యాదు తీసుకున్న వెంటనే ఈ విషయంపై విచారణ జరిపారు. అయితే ఈ శబ్దాలు స్థానిక ఆలయంలో ఏర్పాటు చేయలేదని గణేష్ నిమజ్జన ఊరేగింపు సందర్భంగా బయట వ్యక్తులు ఏర్పాటు చేసినవని క్లారిటీ ఇచ్చారు. ఇకపోతే అల్లు శిరీష్ ఈ విధంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కొంతమంది ఈ విషయాన్ని మతపరమైన అంశంగా విమర్శలు కురిపించడంతో ఈయన స్పందిస్తూ తాను కూడా హనుమంతుడి భక్తుడేనని అయితే తాను ఫిర్యాదు చేసింది భక్తిపై కాదంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ విధంగా సోషల్ మీడియాలో అల్లు శిరీష్ చేసిన ఈ విషయం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
ఇక ఇదే అదునుగా భావించిన కొంతమంది అల్లు యాంటీ ఫ్యాన్స్ ఈ వ్యవహారంలోకి అల్లు అర్జున్ (Allu Arjun)తీసుకువస్తూ ఆయనపై కూడా భారీ స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. కొందరు AAA సినిమాస్ ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్యలను ప్రస్తావిస్తూ అల్లు శిరీష్ కు కౌంటర్ ఇవ్వగా మరికొందరు మాత్రం గతంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన గురించి కూడా ప్రస్తావనకు తీసుకువస్తున్నారు. పుష్ప 2 ప్రీమియర్ల సమయంలో అల్లు అర్జున్ సంధ్య థియేటర్ (Sandhya Theatre) వద్దకు వెళ్లడంతో ఆయనను చూడటానికి అభిమానులు ఎగబడ్డారు దీంతో ఒక మహిళ అభిమాని మరణించిన విషయం తెలిసిందే .ఈ విషయాన్ని ఇప్పుడు అల్లు శిరీష్ కి గుర్తు చేస్తూ విమర్శలు కురిపిస్తున్నారు.
ఇలా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఒక అభిమాని మరణించినప్పటికీ ప్రీమియర్ పూర్తి కాగానే ఇంటికి వచ్చి క్రాకర్స్ కాల్చడం కూడా సామాజిక బాధ్యతేనా? అంటూ పలువురు అల్లు అర్జున్ పేరును కూడా ప్రస్తావిస్తూ అల్లు శిరీష్ పై విమర్శలు కురిపిస్తున్నారు. ఇలా అల్లు శిరీష్ చేసిన ఈ పోస్టుపై అల్లు అర్జున్ పేరును ప్రస్తావించడంతో బన్నీ ఫాన్స్ రంగంలోకి దిగారు. దీంతో సోషల్ మీడియా వేదికగా అభిమానుల మధ్య వార్ జరుగుతుంది. అల్లు శిరీష్ చేసిన ఫిర్యాదును వ్యక్తిగతంగా తీసుకొని అల్లు అర్జున్ పై విమర్శలు కురిపించడం సరికాదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Also Read: రజనీకాంత్ ‘ధర్మాన్’లో టాలీవుడ్ హీరో…ఒక్క ఫోటోతో క్లారిటీ ఇచ్చిన రాశి కన్నా!