Amitabh Record: అమితాబ్ బచ్చన్…బాలీవుడ్ షహన్‌షా, ఇండియన్ సినిమా లెజెండ్ గా పిలుచుకునే ఈ టాప్ స్టార్ మరోసారి వార్తల్లో నిలిచారు. 82 ఏళ్ల వయసులోనూ ఆయన చూపిస్తున్న ఎనర్జీ, డెడికేషన్ చూసి ఇండస్ట్రీ వర్గాలతో పాటు యంగ్ హీరోలు సైతం నోరెళ్లబెడుతున్నారు. వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమేనని, మనిషిలోని సంకల్ప బలానికి ఏదీ అడ్డంకి కాదని ‘బిగ్‌బీ’ మరోసారి ప్రాక్టికల్‌గా నిరూపించారు. తాజాగా ఆయన ఒకే ఒక్క రోజులో ఏకంగా 12 షార్ట్ ఫిల్మ్స్ షూటింగ్‌తో పాటు రెండు స్టిల్ ఫొటోషూట్లను విజయవంతంగా పూర్తి చేసి సరికొత్త రికార్డు సృష్టించారు.
ఈ విషయాన్ని అమితాబ్ బచ్చన్ స్వయంగా తన అఫీషియల్ బ్లాగ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తనను ఎంతగానో ఆరాధించే ఫ్యాన్స్‌ను ఆయన ఎప్పుడూ తన ‘ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ’ (ఈఎఫ్) అని సంబోధిస్తుంటారు. షూటింగ్స్ ఎంత బిజీగా ఉన్నా, అర్ధరాత్రి దాటినా సరే.. తన బ్లాగ్ ద్వారా అభిమానులతో కనెక్ట్ అవ్వడం ఆయనకు దశాబ్దాలుగా ఉన్న అలవాటు.
Also read :‘పెద్ది’కి 366 కోట్లు వచ్చాయా? మేకర్స్ పోస్టర్ వెనుక అసలు నిజమెంత?
పని అంటే పనే.. అందులో ఎలాంటి రాజీ ఉండకూడదు. ఈరోజు 12 షార్ట్ ఫిల్మ్స్ షూట్ చేశాను. అలాగే రెండు స్టిల్ షూట్లు కూడా పూర్తయ్యాయి. ఇప్పుడు మీతో కనెక్ట్ అవుతున్నాను. ప్రపంచంలో మిగతావన్నీ సాగుతూనే ఉంటాయి.. కానీ మీతో నాకున్న ఈ అనుబంధం మాత్రం ఎప్పటికీ ఆగకూడదు.”అంటూ అభిమానులని
అమితాబ్ బచ్చన్ (తన బ్లాగ్‌లో రాసిన కామెంట్స్ )
ఈ జనరేషన్ నటీనటులకు అమితాబ్ ఒక లైబ్రరీ అనే చెప్పాలి. ప్రతిరోజూ కొత్తగా ఏదో ఒకటి నేర్చుకోవాలని, క్రమశిక్షణతో ముందడుగు వేయాలని ఆయన ఈ సందర్భంగా తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు. సమయపాలన, వృత్తి పట్ల గౌరవం ఉంటే ఎంతటి టార్గెట్‌నైనా సులువుగా రీచ్ అవ్వచ్చని ఆయన లైఫ్ స్టైల్ చూస్తే అర్థమవుతుంది. ఈ వయసులో కూడా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో టాలీవుడ్, కాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా ఇండియన్ స్క్రీన్‌ను ఏలేస్తున్నారు.
టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ విజువల్ వండర్, గ్లోబల్ హిట్ ‘కల్కి 2898 AD’ చిత్రంలో అమితాబ్ పోషించిన ‘అశ్వత్థామ’ పాత్రకు థియేటర్లలో ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. క్లైమాక్స్ సీక్వెన్స్‌లో ప్రభాస్, అమితాబ్ మధ్య వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించాయి. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ (కల్కి పార్ట్-2) పనుల్లో మేకర్స్ బిజీగా ఉన్నారు. పార్ట్-2 లో అశ్వత్థామ పాత్ర మరింత పవర్‌ఫుల్‌గా, కథను మలుపు తిప్పే విధంగా ఉండబోతోందని సమాచారం. ప్రభాస్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ వంటి స్టార్ కాస్టింగ్‌తో రాబోతున్న ఈ సీక్వెల్ కోసం అమితాబ్ బచ్చన్ ప్రత్యేకంగా డేట్స్ కేటాయించారు.
ఇటీవలే అమితాబ్ బచ్చన్ కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్‌తో కలిసి ‘వెట్టాయన్’ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ‘జై భీమ్’ ఫేమ్ టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామాలో బిగ్‌బీ పోషించిన సత్యదేవ్ పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. రజినీకాంత్, అమితాబ్ కాంబినేషన్ దాదాపు 33 ఏళ్ల తర్వాత (హిందీ సినిమా ‘హుమ్’ తర్వాత) మళ్లీ రిపీట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్ వంటి అద్భుతమైన స్టార్ కాస్టింగ్‌తో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
Also read :నాలుగేళ్లు ఆగినా అఖిల్‌కు తప్పని తిప్పలు.. ‘లెనిన్’ వాయిదా టాక్‌తో అక్కినేని ఫ్యాన్స్ ఫైర్!
సినిమాలు, రియాలిటీ షోలు (కౌన్ బనేగా కరోడ్‌పతి), బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, సోషల్ మీడియా అప్‌డేట్స్.. ఇలా 24/7 యాక్టివ్‌గా ఉంటూ నేటి యువతకు రోల్ మోడల్‌గా నిలుస్తున్నారు అమితాబ్ బచ్చన్. బిగ్‌బీ ఎనర్జీ లెవెల్స్ ఇలాగే కొనసాగాలని, ఆయన మరిన్ని వండర్స్ క్రియేట్ చేయాలని సోషల్ మీడియా వేదికగా అభిమానులు విష్ చేస్తున్నారు.