E-Paper

‘పెద్ది’కి 366 కోట్లు వచ్చాయా? మేకర్స్ పోస్టర్ వెనుక అసలు నిజమెంత?

‘పెద్ది’కి 366 కోట్లు వచ్చాయా? మేకర్స్ పోస్టర్ వెనుక అసలు నిజమెంత?

Peddi Collections: పెద్ది …రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది అంటూ సోషల్ మీడియాలో పోస్టర్లు కనిపిస్తున్నాయి. వృద్ధి సినిమాస్ అధికారికంగా ప్రకటించిన లెక్కల ప్రకారం ఈ సినిమా కేవలం 9 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 366 కోట్ల గ్రాస్ వసూలు చేసిందట. 2026లో ఇప్పటివరకు సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచిందని మేకర్స్ చాలా గర్వంగా చెప్తున్నారు.

మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ భాగస్వామ్యంతో వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ సినిమా జూన్ 4న థియేటర్లలోకి వచ్చింది. సినిమా చూసిన కొందరు రామ్ చరణ్ యాక్టింగ్, బుచ్చిబాబు సానా టేకింగ్ అద్భుతంగా ఉన్నాయని అంటుంటే, మరికొందరు మాత్రం ఇందులో అంత సీన్ ఉందా అనే డౌట్స్ రైజ్ చేస్తున్నారు.

స్కై లెవల్ కి వెళ్ళిపోయిన అంచనాలు 

నిజానికి ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత రామ్ చరణ్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ తర్వాత వచ్చిన గేమ్ చేంజర్ ని మా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది.శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా చరణ్ ఫ్యాన్స్‌ను ఫుల్ డిసప్పాయింట్ చేసింది. ఈ నేపథ్యంలో బుచ్చిబాబు సానా ఉప్పెన లాంటి క్లాసిక్ హిట్ తర్వాత చరణ్‌తో ఈ స్పోర్ట్స్ డ్రామాను అనౌన్స్ చేసినప్పుడు అంచనాలు స్కై లెవల్ కి వెళ్ళిపోయాయి. దానికి తోడు జాన్వీ కపూర్ హీరోయిన్ కావడం, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించడంతో బిజినెస్ కూడా బాగానే జరిగింది.

Also read :నాలుగేళ్లు ఆగినా అఖిల్‌కు తప్పని తిప్పలు.. ‘లెనిన్’ వాయిదా టాక్‌తో అక్కినేని ఫ్యాన్స్ ఫైర్!

366 కోట్ల కలెక్షన్ల పోస్టర్ల వెనుక అసలు నిజం ఎంత

కానీ ఇప్పుడు వస్తున్న 366 కోట్ల కలెక్షన్ల పోస్టర్ల వెనుక అసలు నిజం ఎంత అనేది ట్రేడ్ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. ఈ రోజుల్లో ప్రొడక్షన్ హౌస్‌లు ఇచ్చే నంబర్లకు, గ్రౌండ్ లెవెల్‌లో థియేటర్లకు వచ్చే పబ్లిక్‌కు అస్సలు సంబంధం ఉండటం లేదు. సినిమాకు పాజిటివ్ టాక్ ఉన్న మాట వాస్తవమే అయినా, మరీ 9 రోజుల్లోనే ఈ రేంజ్ వసూళ్లు అంటే కొంచెం నమ్మశక్యంగా లేదనేది యాంటి ఫ్యాన్స్ ఆర్గ్యుమెంట్.గతంలో వచ్చిన కొన్ని పెద్ద సినిమాలకు కూడా ఇలాగే ఫేక్ కలెక్షన్స్ పోస్టర్లు వేసి బజ్ క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. పెద్ది సినిమా విషయంలోనూ అదే స్ట్రాటజీ వాడుతున్నారా అనే సందేహాలు వస్తున్నాయి.

బుకింగ్స్ చూస్తే అంత సీన్ కనిపించడం లేదు

సెకండ్ వీక్ కూడా వచ్చేయడంతో  శని, ఆదివారాల్లో వసూళ్లు మరింత పెరుగుతాయని విశ్లేషకులు చెప్తున్నప్పటికీ, థియేటర్ల వద్ద బుకింగ్స్ చూస్తే అంత సీన్ కనిపించడం లేదు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయిందని ప్రచారం జరుగుతున్నా, పాటలు రీసెంట్‌గా వచ్చిన మిగతా హిట్ సినిమాల రేంజ్‌లో చార్ట్‌బస్టర్స్ కాలేదనేది కూడా వాస్తవం. జాన్వీ కపూర్ గ్లామర్ పరంగా ఓకే అనిపించినా, నటన పరంగా రామ్ చరణ్ మంచి మార్కులే వేసుకున్నా , బాలీవుడ్ బ్యూటీ జాన్వీ అందాల ఆరబోత సినిమాకి ఎక్కడ లేని నెగెటివ్ టాక్ ని మూటగట్టించింది .ఇక  బుచ్చిబాబు సానా కథలో ఎమోషన్ బాగున్నా, కథనం అక్కడక్కడా చాలా నెమ్మదిగా సాగుతూ ల్యాగ్ అనిపిస్తుంది.

కేవలం పోస్టర్లకే పరిమితం అవుతుందా 

అయితే మరో కట్ తో మరింతగా ఆడియన్స్ ని రీచ్ అవుతామని ఫుల్ కాన్ఫిడెన్స్ చూపిస్తున్నాడు బుచ్చి.ఏది ఏమైనా, ప్రమోషన్ల హోరుతో సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడంలో వృద్ధి సినిమాస్ సక్సెస్ అయింది. కలెక్షన్ల నంబర్లు ఎంతవరకు నిజం అనేది పక్కన పెడితే, ప్రస్తుతానికి బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ లేకపోవడం ఈ సినిమాకు కలిసి వచ్చేలా కనిపిస్తుంది.మరి  లాంగ్ రన్‌లో ఈ పెద్ది నిజంగానే రికార్డులు క్రియేట్ చేస్తుందా లేక కేవలం పోస్టర్లకే పరిమితం అవుతుందో చూడాలి.

Also read :విజయ్ ‘టీవీకే’ టార్గెట్‌గా చిన్మయి సంచలన పోస్ట్.. దళపతికి ఊహించని షాక్!

Related News

భర్తతో విడిపోయిన తర్వాత దారుణమైన ట్రోల్స్.. ఎట్టకేలకు నోరు విప్పిన బాలీవుడ్ బ్యూటీ!

ఒక్క రోజులోనే అన్ని షూటింగ్‌లా? అమితాబ్ ఎనర్జీ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

నాలుగేళ్లు ఆగినా అఖిల్‌కు తప్పని తిప్పలు.. ‘లెనిన్’ వాయిదా టాక్‌తో అక్కినేని ఫ్యాన్స్ ఫైర్!

ట్రోలర్స్ కు బుట్టబొమ్మ స్ట్రాంగ్ కౌంటర్.. అస్సలు ఊహించలేదు మావా..!

భార్యతో కలిసిపోయిన సీఏం విజయ్.. ఆమె ఎంట్రీతో విడాకులు క్యాన్సిల్..!

మెగా ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. సుకుమార్ -రామ్ చరణ్ మూవీ లేనట్లేనా..?

‘గాడ్ ఆఫ్ వార్’ తో ఎన్టీఆర్ నెక్స్ట్ లెవెల్ స్కెచ్.. కోలీవుడ్ డైరెక్టర్‌కు నో ఛాన్స్?

×