Dhurandhar 2: ఎటువంటి అంచనాలు లేకుండా.. ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది ధురంధర్. ఆదిత్యధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ హీరోగా, సారా అర్జున్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా ఫుల్ రన్ ముగిసే సరికి ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించింది ..ముఖ్యంగా పలు దేశాలలో సరికొత్త రికార్డులు కూడా క్రియేట్ చేసింది.. ఈ సినిమాకి కొనసాగింపుగా ధురంధర్ 2: ది రివేంజ్ అంటూ సీక్వెల్ కూడా విడుదల చేశారు. ముఖ్యంగా అటు థియేటర్లో , ఇటు ఓటీటీలలో సరికొత్త రికార్డులు సృష్టించింది. థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అక్కడ ఫుల్ రన్ ముగిసేసరికి ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు టీవీలో అలరించడానికి సిద్ధం అయ్యింది. అయితే బుల్లితెర ప్రసారం కోసం మరోసారి సెన్సార్ జరగగా.. సెన్సార్ బోర్డు ఈ సినిమాలోని హింసాత్మక సన్నివేశాలను తొలగించి U/A( 16+) సర్టిఫికెట్ జారీ చేసింది.
సాధారణంగా థియేటర్లలోకి వచ్చే ముందు సినిమాకి సెన్సార్ ఎలా అయితే చేస్తారో.. టీవీలోకి వచ్చే ముందు కూడా అలాగే సెన్సార్ చేస్తారట. అయితే ఇంట్లో పిల్లలు కుటుంబ సభ్యులతో కలసి సినిమా చూసే అవకాశం ఉంది. అందులో భాగంగానే ఈ సినిమాకి మళ్ళీ సెన్సార్ చేయడమే కాకుండా ఏకంగా 50 కట్స్ చెప్పినట్లు సమాచారం. ముఖ్యంగా ఆ సన్నివేశాలను డిలీట్ చేసిన తర్వాతే బుల్లితెర ప్రేక్షకులు ఈ సినిమాను చూసే విధంగా U/A సర్టిఫికెట్ జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే సెన్సార్ కట్స్ తో ఈ సినిమా నిడివి దాదాపు 10 నిమిషాలు తగ్గిపోయినట్లు సమాచారం. థియేటర్ , ఓటీటీ లో ప్రభంజనం సృష్టించిన ఈ సినిమా.. ఎ
ఇన్ని కట్స్ చేసిన తర్వాత టీవీలో ఎలాంటి టిఆర్పి రేటింగ్ సాధిస్తుందో చూడాలి.
also read:మోహన్‌లాల్ తో నటించడంపై భాగ్యశ్రీ ఎమోషనల్ పోస్ట్!
ధురంధర్ 2 : ది రివేంజ్ చిత్రాన్ని 10 నిమిషాల నిడివి తక్కువతో అక్టోబర్ 18వ తేదీన స్టార్ గోల్డ్ ఛానల్లో ప్రసారం చేయబోతున్నట్లు ప్రకటించారు.ధురంధర్ 2 : ది రివేంజ్ సినిమా విషయానికి వస్తే.. రణవీర్ సింగ్ , మాధవన్ , సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, సారా అర్జున్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి శాశ్వత్ సచ్ దేవ్ సంగీతాన్ని అందించారు. ఎడిటర్ గా శివకుమార్ వి పనికర్ పనిచేశారు. జియో స్టూడియోస్, బి 62 స్టూడియోస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించారు. మొత్తానికి అయితే 1800 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సంచలనం సృష్టించిన ఈ సినిమా.. ఇప్పుడు స్టార్ గోల్డ్ వేదికగా టీవీ ఛానల్ ద్వారా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. మరి ఇక్కడ ఎలాంటి ఆదరణ సొంతం చేసుకుంటుందో చూడాలి.