Spain Airport: బార్సిలోనాలోని ఎల్ ప్రాట్ విమానాశ్రయంలో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు అంతర్జాతీయంగా వైరల్ అయింది. ఓ జంట తమ 10 ఏళ్ల కొడుకును విమానాశ్రయంలో ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయిన విషయం వెలుగులోకి వచ్చింది. ఓ చిన్నారి భద్రతను మరిచిన తల్లిదండ్రుల చర్యపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బార్సిలోనాలోని ఎల్ ప్రాట్ విమానాశ్రయం. అక్కడకు ఓ జంట తనతో పాటు కొడుకుని కూడా తీసుకుని వచ్చింది. అయితే పాస్ పోర్టు చెకింగ్ వద్ద బాలుడి వీసా గుడువు ముగినట్లు సిబ్బంది తెలిపారు. దీంతో వారిని ఎయిర్ పోర్ట్ సిబ్బంది లోపలికి వెళ్లేందుకు నిరాకరించారు. ఇక ఏమీ చేయలేని పరిస్థితిలో ఆ జంట కుమారున్ని తీసుకుని అక్కడే వున్న రెస్ట్ రూంలో కూర్చుకున్నారు. మళ్లీ ఈరోజు ఫ్లైట్ మిస్ అయితే డబ్బులు వృధా అవుతాయని ఇద్దరు భావించారు. వారికి తెలిసిన దగ్గర బంధువుకు సమాచారం ఇచ్చారు. పిల్లవాడిని ఎయిర్ పోర్టులోనే వదిలి వెళుతున్నట్లు , తనని తీసుకుని వెళ్లాలని ఫురమాయించారు. అనంతరం ఫ్లైట్ సమయం అవుతుందని ఓ బంధువు వస్తాడు నువ్వు అతనితో తన ఇంటికి వెళ్లమని అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అయితే ఆ బాలుడికి ఏమీ అర్థంకాలేదు, తల్లిదండ్రుల కోసం బయటకు వచ్చి వెతకడం మొదలు పెట్టాడు. కళ్లళ్లో కన్నీరు, అక్కడున్న వాళ్లను చూస్తూ బిక్కు బిక్కు మంటూ ఎవరి ఏం చెప్పాలో తెలియక నిస్సాహాయ స్థితిలో నిలబడ్డాడు. విమానాశ్రయ కార్ పార్కింగ్‌లో ఒక బిడ్డ కనిపించాడు పోలీసులు పైలట్‌కు సమాచారం. విమానాశ్రయ కార్ పార్కింగ్ వద్ద ఒక బిడ్డ పోలీసులకు కనిపించాడు. దీంతో పోలీసులు ఆ బాలున్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే పోలీసులు పైలట్‌కు సమాచారం అందించారు. టెర్మినల్‌లో ఎవరైనా బిడ్డను వదిలేశారా అని అతను ప్రయాణికులను అడిగాడు, కానీ ఎవరూ స్పందించలేదు. విమానంలో తల్లిదండ్రులను గుర్తించిన పోలీసులు మరో చిన్న పిల్లవాడితో ప్రయాణిస్తున్న తల్లిదండ్రులను అధికారులు గుర్తించగలిగారు. పోలీసులు వారిని 10 ఏళ్ల పిల్లవాడిని తీసుకెళ్లిన స్టేషన్‌కు తీసుకెళ్లారు.
తల్లిదండ్రులు తమ విమాన టిక్కెట్లను వృధా చేసుకోవడం ఇష్టంలేక తమ కొడుకును వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు అధికారులకు చెప్పారని ఆరోపించారు. అయితే ఈ సంఘటనపై లిలియన్ అనే ఎయిర్ ట్రాఫిక్ కోఆర్డినేటర్ టిక్‌టాక్ వీడియాలో ఈ సంఘటన వివరాలను పంచుకున్నారు. ఎంత నిర్లక్ష్యం.. టికెట్ బుకింగ్ చేసుకున్నాం.. డబ్బులు వృధా అవుతాయని పిల్లాడిని ఎయిర్ పోర్టులో వదిలేస్తారా? అది కూడా బంధువులు రాక ముందే వెళ్లిపోవడం మాతృత్వానికి తీరని మచ్చగా మరిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన సామాజిక మాధ్యమాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. తల్లిదండ్రుల మీదా, వారి బాధ్యతా రాహిత్యం మీదా ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. “తల్లిదండ్రులుగా బాధ్యత ఏమీ లేదా?” “ఒక పిల్లవాడిని ఒంటరిగా వదిలేయడమేనా పరిష్కారం?” అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పిల్లలను కనడమే కాదు.. వారిని బాధ్యతగా పెంచాలి అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.