Priyanka Jain:ప్రియాంక జైన్ …తెలుగు టీవీ ఆడియన్స్ కి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరిది. ‘మౌనరాగం’, ‘జానకి కలగనలేదు’ వంటి సీరియల్స్‌తో సాలిడ్ క్రేజ్ కొట్టేసిన ఈమె ఆ తర్వాత బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7లో కంటెస్టెంట్‌గా పాల్గొని తన క్రేజ్‌ను మరింత పెంచుకున్న సంగతి తెల్సిందే. అయితే బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రియాంక వరుసగా సీరియల్స్ చేయకపోవడంతో అసలు ఈ అందాల భామకి ఏమైంది అంటూ ఆరాలు తీయడం మొదలెట్టారు అభిమానులు.
‘మౌనరాగం’తో స్టార్ ఇమేజ్
మోడలింగ్ ద్వారా కెరీర్ మొదలెట్టిన ప్రియాంక కి మంచి గుర్తింపు తెచ్చినవి మాత్రం సీరియల్స్ అనే చెప్పాలి. స్టార్ మాలో టెలీకాస్ట్ అయిన ‘మౌనరాగం’ సీరియల్‌లో ప్రియాంక పోషించిన జానకి పాత్ర ఆమె కెరీర్‌ను ఒక్కసారిగా మార్చేసిందనే చెప్పాలి. మాట్లాడలేని అమ్మాయిగా తన ఎక్స్ప్రెషన్ తోనే నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది ప్రియాంక.
ఆ తర్వాత ‘జానకి కలగనలేదు’లో మరో విభిన్నమైన పాత్రలో కనిపించింది. ఐపీఎస్ కావాలనే కల ఉన్న గృహిణిగా ప్రియాంక చేసిన నటనకు ఆడియన్స్ నుండి మంచి అప్లాజ్ వచ్చింది.దీంతో ఒకరకంగా ఆమె తెలుగు బుల్లితెరపై పాపులర్ హీరోయిన్‌గా మారిపోయిందనడంలో సందేహం లేదు.
బిగ్‌బాస్ తర్వాత మారిన కెరీర్
ఇక సీరియల్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక జైన్‌కు బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 మరో పెద్ద టర్నింగ్ పాయింట్‌గా మారింది. ఈ షోలో ఫైనల్ వరకు వెళ్లడంతో ఆమెకు ఉన్న పాపులారిటీ మరింత పెరిగిందనే చెప్పాలి.అయితే బిగ్‌బాస్ తర్వాత మళ్లీ సీరియల్ హీరోయిన్‌గా కనిపిస్తుందని చాలామంది భావించారు. కానీ ప్రియాంక మాత్రం ఎలాంటి సీరియల్స్ లో కనిపించలేదు.
ప్రియాంక జైన్ చెప్పిన అసలు కారణం ఇదే
అయితే తాజాగా తన కెరీర్ గురించి మాట్లాడిన సందర్భంలో ప్రియాంక జైన్ ఇలా అసలు కారణాన్ని చెప్పుకొచ్చింది. సీరియల్స్‌లో ఎక్కువ కాలం ఒకే పాత్రను పోషించడం వల్ల నటిగా ఒకే తరహా ఇమేజ్‌లో ఇరుక్కుపోయే అవకాశం ఉందని అందుకే సీరియల్స్ కి పుల్ స్టాప్ పెట్టానని క్లారిటీ ఇచ్చింది.
అంతేకాదు.. సీరియల్స్‌కు ఎక్కువ సమయం కేటాయించాల్సి రావడంతో ఇతర ప్రాజెక్టులకు డేట్స్ అడ్జస్ట్ చేయడం కూడా కష్టమవుతుందని వివరించింది. ఒక సీరియల్ కమిట్‌మెంట్ ఉంటే ఇతర సినిమాలు, వెబ్ సిరీస్‌లు, విభిన్నమైన పాత్రలు చేయడానికి తగినంత సమయం దొరకకపోవచ్చని ఇలా సీరియల్స్ కి నో చెబుతున్నట్టు తెలిపింది.
అందుకే తన కెరీర్‌ను ఒకే ఫార్మాట్‌కు పరిమితం కాకుండా కొత్త తరహా పాత్రలు, కథలు ప్రయత్నించాలని నిర్ణయించుకున్నట్టు అసలు విషయం చెప్పుకొచ్చింది.
యాక్టింగ్‌లో తేడా లేదంటున్న ప్రియాంక
అయితే సీరియల్స్‌ను వదిలేసినంత మాత్రాన.. అవి తనకు నచ్చవు అన్నట్టుగా కాదని, తనకు పేరు, గుర్తింపు తీసుకొచ్చింది సీరియల్సేనని ఆమె స్పష్టంగా చెప్పింది.ఇక సీరియల్స్, సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. ఏదైనా నటన పరంగా తన లక్ష్యం ఒక్కటేనని కుండ బద్దలు కొట్టేస్తుంది ఈ ముద్దుగుమ్మ.
ఇప్పుడు డిజిటల్ వైపు ఫోకస్
సీరియల్స్‌కు దూరమైనప్పటికీ ప్రియాంక జైన్ ప్రస్తుతం టీవీ షోలు, ఈవెంట్స్‌తో పాటు డిజిటల్ ప్రాజెక్టుల్లోనూ కనిపిస్తోంది. ఈమధ్యే ‘నయనం’ వంటి వెబ్ సిరీస్‌లో నటించి సత్తా చాటింది కూడా. చూడాలి మరి ముందు ముందు ఈ ముద్దుగుమ్మ ఎలాంటి ప్రాజెక్ట్స్ తో దర్శనమిస్తుందో !
ALSO READ :కోలీవుడ్ వెయ్యి కోట్లు చూసేనా ?