Ananthika: అనంతిక సనీల్ కుమార్ పరిచయం అవసరం లేని పేరు. ఇటీవల “8 వసంతాలు” అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి తన అందం నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అనంతిక త్వరలోనే “రోమాంచకం” అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 3 వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈమె తన సినీ కెరియర్ గురించి తన వ్యక్తిగత విషయాల గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె మాట్లాడుతూ తనకు నాని(Nani) హీరోగా నటించిన ది ప్యారడైజ్(The Paradise) సినిమాలో ఛాన్స్ వచ్చినట్టే వచ్చి మిస్ అయిందని తెలిపారు. శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వంలో నాని ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం “ది ప్యారడైజ్”. త్వరలోనే పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా గురించి నటి అనంతిక (Ananthika) మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. తాను ప్యారడైజ్ సినిమా కోసం ఆడిషన్ లో భాగంగా తన ఫోటోలను పంపించడంతో దర్శక నిర్మాతలు తనని రిజెక్ట్ చేసినట్టు తెలిపారు.
ఈ విధంగా ఈ సినిమా నుంచి తనను రిజెక్ట్ చేయడానికి కారణాన్ని అనంతిక తెలియజేస్తూ.. నేను చూడటానికి చిన్న పిల్ల మాదిరి కనిపిస్తున్న నేపథ్యంలోనే తనకు ఈ సినిమాలో అవకాశం రాలేదని తెలిపారు. ఈ ఒక్క సినిమాలోనే కాకుండా చాలామంది దర్శకనిర్మాతలు తన ఫోటోలు పంపించమని అడిగేవారు. ఫోటోలు చూసిన తర్వాత చిన్నపిల్లల్లాగా కనిపిస్తున్నాననే ఒక్క కారణంతోనే తనని చాలా సినిమాల నుంచి తప్పించారని ఈ సందర్భంగా అనంతిక చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ విషయం తెలిసిన ఈమె అభిమానులు మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇకపోతే ఈ సినిమాలో నాని జడల్ అనే విభిన్నమైన పాత్రలు కనిపించబోతున్న సంగతి తెలిసిందే. నాని జోడిగా ఈ సినిమాలో కయాదు లోహర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం కీర్తి సురేష్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు, రాఘవ్ జుయాల్ వంటి తదితరులు నటిస్తున్నారు. ఆగస్టు 21వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా ఈ సినిమా మరోసారి వాయిదా పడుతూ సెప్టెంబర్ 24వ తేదీ ఏకంగా 8 భాషలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల భారీ స్థాయిలో అంచనాలు పెంచేసాయి.
Also Read: ఎమ్మెస్ సుబ్బలక్ష్మిగా నేషనల్ క్రష్.. లుక్ టెస్ట్ పూర్తి?