E-Paper
Advertisement

హమ్మయ్య ఎల్లమ్మకు హీరోయిన్ దొరికింది.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బ్యూటీ…లుక్ టెస్ట్ పూర్తి!

హమ్మయ్య ఎల్లమ్మకు హీరోయిన్ దొరికింది.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బ్యూటీ…లుక్ టెస్ట్ పూర్తి!
Advertisement

Yellamma Movie: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సంగీత దర్శకుడిగా తనదైన గుర్తింపు సంపాదించుకున్న రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. జబర్దస్త్ కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వేణు దర్శకుడిగా మారి బలగం సినిమాతో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమా తర్వాత ఈయన ఎల్లమ్మ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నో అడ్డంకులను దాటుకొని ఎల్లమ్మ సినిమా షూటింగ్ పనులను మొదలుపెట్టారు. ఈ సినిమాలో దేవిశ్రీప్రసాద్ హీరోగా ఎంపిక కావడంతో సినిమా పట్ల ఆసక్తి నెలకొంది.

ఎల్లమ్మకు హీరోయిన్ కష్టాలు..

ఇలా హీరోగా దేవిశ్రీప్రసాద్ షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. గత కొద్ది రోజులుగా ఎల్లమ్మ సినిమాకు హీరోయిన్ కష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ సినిమాలో ఇప్పటివరకు హీరోయిన్ ఎంపిక కాకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మొదట ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో కీర్తి సురేష్ నటించబోతున్నారని వార్తలు వచ్చాయి కానీ ఈ వార్తలను కీర్తి సురేష్ ఖండించారు. అనంతరం తెరపైకి సాయి పల్లవి పేరు వచ్చింది. దేవిశ్రీప్రసాద్ జోడిగా సాయి పల్లవి కనిపించబోతున్నట్టు వార్తలు వచ్చాయి కానీ ఈ వార్తలలో కూడా నిజం లేదని తెలుస్తోంది.

ఎల్లమ్మ హీరోయిన్ గా అనంతిక..

Advertisement

ఇకపోతే తాజాగా ఎల్లమ్మ సినిమాకు సంబంధించి హీరోయిన్ విషయంలో మరొక వార్త సోషల్ మీడియాలో సంచలనగా మారింది. ఎల్లమ్మ సినిమాకు ఫైనల్ గా హీరోయిన్ ఎంపిక అయిందని తెలుస్తుంది. 8 వసంతాలు అనే సినిమా ద్వారా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న నటి అనంతిక సనీల్ కుమార్(Ananthika Sanikumar) ఎల్లమ్మ సినిమా హీరోయిన్ గా ఫైనల్ అయినట్టు టాలీవుడ్ సమాచారం. ఇప్పటికే అనథిక ఈ సినిమాలో పాత్ర కోసం లుక్ టెస్ట్ పూర్తి చేశారని, లుక్ టెస్ట్ అనంతరం దర్శక నిర్మాతలు అనంతికను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది.

ఫోటో షూట్ పూర్తి..

దేవి శ్రీ ప్రసాద్ అనంతిక ఇద్దరిపై ఫోటోషూట్ కూడా పూర్తి అయిందని వీరి కాంబో చూసిన అనంతరం దర్శక నిర్మాతలు ఈమెను ఫైనల్ చేసినట్టు సమాచారం. త్వరలోనే హీరోయిన్ కి సంబంధించి ఈ విషయాన్ని అధికారకంగా వెల్లడించబోతున్నారు. ఇక అనంతిక ఇప్పటికే 8 వసంతాలు అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితం అయ్యారు. ప్రస్తుతం ఈమె రోమాంచితం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ మూడో తేదీ విడుదల కాబోతుంది. ఈ సినిమా విడుదల కాకుండానే అనంతిక ఎల్లమ్మ సినిమాలో ఛాన్స్ అందుకున్నారు. ఇక ఈ సినిమా దిల్ రాజు, శిరీష్ రెడ్డి నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.అని అనుకున్న విధంగా జరిగితే ఎల్లమ్మ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

Also Read: మహేంద్రగిరి వారాహి ట్రైలర్ రిలీజ్.. సిద్దు జొన్నలగడ్డ స్పెషల్ ఎంట్రీ?

Related News

పవన్ బర్త్ డే స్పెషల్… సతీసమేతంగా కళ్యాణం జరిపించిన నాగబాబు దంపతులు!

‘టాక్సిక్’కు టైమ్ బాగోలేదా..OTT రైట్స్‌పై కొత్త లెక్కలు?

నాగార్జున బర్త్ డే స్పెషల్.. ‘కింగ్ 100’ నుండి అదిరిపోయే గ్లింప్స్ రిలీజ్!

ది ప్యారడైజ్ నుంచి దుమ్ము రేపుతున్న ‘యేష నాగుల కట్ట మీద’ మాస్ ట్రాక్!

దేవి ‘ఎల్లమ్మ’ కు హీరోయిన్ కష్టాలు.. సినిమా వాయిదా పడ్డట్లే..?

HBD Nagarjuna : బర్త్ డే స్పెషల్.. నాగార్జున ఆస్తులు ఎన్ని కోట్లంటే..?

మహేంద్రగిరి వారాహి ట్రైలర్ రిలీజ్.. సిద్దు జొన్నలగడ్డ స్పెషల్ ఎంట్రీ?

Big Stories

Advertisement
×