E-Paper
Advertisement

రూ.4,000లోపే ANC హెడ్‌ఫోన్స్.. 80 గంటల బ్యాటరీతో కొత్త మోడల్ లాంచ్!

రూ.4,000లోపే ANC హెడ్‌ఫోన్స్.. 80 గంటల బ్యాటరీతో కొత్త మోడల్ లాంచ్!
Advertisement

Blaupunkt BH61 ZenX: బడ్జెట్‌లో మంచి ఫీచర్లున్న వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్ కోసం చూస్తున్న వారికి Blaupunkt కొత్త ఆప్షన్‌ను తీసుకొచ్చింది. ఈ కంపెనీ భారత మార్కెట్లో BH61 ZenX ఓవర్-ఇయర్ వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్‌ను విడుదల చేసింది. రూ.3,999 ప్రారంభ ధరతో వచ్చిన ఈ హెడ్‌ఫోన్స్‌లో ANCతో పాటు 80 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ అందిస్తోంది.

హైబ్రిడ్ ANCతో నాయిస్ తగ్గింపు:

BH61 ZenXలో హైబ్రిడ్ మోక్ష ట్రూ ANC టెక్నాలజీ ఉంది. ఇది చుట్టూ ఉండే శబ్దాన్ని తగ్గించి మ్యూజిక్, సినిమాలు లేదా కాల్స్‌పై మరింత ఫోకస్ చేయడానికి ఉపయోగపడుతుంది. ప్రయాణాలు, ఆఫీస్ లేదా రోజువారీ వినియోగంలో ఇది ఉపయోగపడే ఫీచర్‌గా చెప్పొచ్చు.

40mm డ్రైవర్లతో ఆడియో:

Advertisement

ఆడియో కోసం ఇందులో 40mm డ్రైవర్లను అందించారు. క్లియర్ వోకల్స్‌తో పాటు మంచి బేస్‌ను అందించేలా వీటిని రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. వైర్‌లెస్ కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 6.0 సపోర్ట్ కూడా ఉంది.

Also Read: ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన ఫోన్‌గా iPhone 17.. Galaxy S26 Ultraకు 4వ స్థానం!

80 గంటల వరకు బ్యాటరీ:

Advertisement

BH61 ZenXలో 600mAh బ్యాటరీ ఉంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 80 గంటల వరకు ప్లేబ్యాక్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. తరచూ ఛార్జింగ్ పెట్టుకోవడం ఇష్టపడని వారికి ఈ హెడ్‌ఫోన్స్ బాగా నచ్చుతుందని చెప్పొచ్చు.

ధర, లభ్యత:

ఈ హెడ్‌ఫోన్స్ ధరను రూ.3,999గా నిర్ణయించారు. ప్రస్తుతం ఇది కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్, ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్‌లు, రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంది. రూ.4,000లోపు ANC, 40mm డ్రైవర్లు, బ్లూటూత్ 6.0, 80 గంటల బ్యాటరీ వంటి ఫీచర్లతో ఈ హెడ్‌ఫోన్స్ బడ్జెట్ సెగ్మెంట్‌లో ఆసక్తికరమైన ఆప్షన్‌గా కనిపిస్తున్నాయి.

Also Read: POCO X8 సిరీస్ లాంచ్‌కు రెడీ.. 10,000mAh బ్యాటరీతో X8 Power 5G!

Tags

Related News

డార్క్ మోడ్‌లో ఫోన్ వాడితే ఛార్జింగ్ సేవ్ అవుతుందా? తెలిస్తే షాక్ అవుతారు

ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నా వాట్సాప్ మెసేజ్ వెళ్తుంది! వాట్సాప్ నుంచి మరో కిర్రాక్ అప్‌డేట్!

రూ.వెయ్యిలోపు బెస్ట్ ఇయర్‌బడ్స్! సేల్‌లో సగం ధరకే..

BSNL నుంచి మరో చౌకైన ప్లాన్.. రూ. 202 కే 32 రోజుల వ్యాలిడిటీ.. అదిరిపోయే బెనిఫిట్స్ మామ!

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎగిరి గంతేసే న్యూస్! ఇక నుంచి కోడింగ్,ఫైనాన్స్ పనులు చిటికెలో!

ఏఐ బాట్స్ డేంజర్ జోన్..శాస్త్రవేత్తల పరిశోధనలో షాకింగ్ నిజాలు!

జియో ఫైబర్ బంపర్ ఆఫర్..ఏడాది రీఛార్జ్‌పై 4 నెలలు ఫ్రీ ఇంటర్నెట్!

ఇదేందయ్యా ఇదీ..సేల్‌లో చిమ్నీల రేట్లు ఇంత తక్కువగా ఉన్నాయ్!

Big Stories

Advertisement
×