E-Paper
Advertisement

మహేంద్రగిరి వారాహి ట్రైలర్ రిలీజ్.. సిద్దు జొన్నలగడ్డ స్పెషల్ ఎంట్రీ?

మహేంద్రగిరి వారాహి ట్రైలర్ రిలీజ్.. సిద్దు జొన్నలగడ్డ స్పెషల్ ఎంట్రీ?
Advertisement

Mahendragiri Varahi Trailer: అక్కినేని సుమంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం మహేంద్రగిరి వారాహి(Mahendra Giri Varahi).సంతోష్ జాగర్లమూడి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 11వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసాయి. అయితే తాజాగా చిత్ర నిర్మాతలు ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా సినిమా పట్ల భారీ స్థాయిలో అంచనాలను పెంచేస్తోంది. 2:41 నిమిషాల నిడివితో విడుదలైన ఈ ట్రైలర్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తుందని చెప్పాలి.

వారాహి అమ్మవారి శాపం..

ఈ ట్రైలర్ వీడియోలో నటుడు సిద్ధూ జొన్నలగడ్డ (Siddu Jonnalagadda)స్పెషల్ ఎంట్రీ ప్రేక్షకులను ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తుంది. వారణాసిలో వెలిసిన వారాహి అమ్మవారి కథ నేపథ్యంలో ఈ చిత్రం కొనసాగుతుందని తెలుస్తుంది. ఇక ఇందులో భాగంగా మహేంద్రగిరి రాజ వంశస్థులకు వారాహి అమ్మవారు పెట్టిన శాపం, ఈ శాపం కారణంగా సంభవిస్తున్న వరుస మరణాలకు గల కారణాలు ఏంటి? అనే అంశంపై ఈ సినిమా కొనసాగుతుందని చెప్పాలి.ఈ అనుమానాస్పద మరణాలు, వీటి వెనకున్న నిజాన్ని బయటపెట్టడానికి పోరాడే హీరో కథతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

సిద్దు జొన్నలగడ్డ స్పెషల్ ఎంట్రీ..

Advertisement

వారాహి అమ్మవారి శక్తికి, సైంటిఫిక్ మిస్టరీకి ఉన్న లింక్ ఏంటనే కోణంలో ఈ ట్రైలర్ కొనసాగుతుంది. మొత్తానికి ట్రైలర్ వీడియో ద్వారా సినిమాపై భారీగా అంచనాలు పెంచేసారు. ఇక ఈ ట్రైలర్ వీడియోలో సుమంత్ నటన మరో లెవెల్ లో ఉందని చెప్పాలి. ఈ ట్రైలర్ చూస్తుంటే మరోసారి సుమంత్ హిట్ అందుకోబోతున్నారని తెలుస్తోంది. ఇక ట్రైలర్ వీడియోలో సిద్దు జొన్నలగడ్డ సర్ప్రైజ్ ఎంట్రీ అదిరిపోయింది. సిద్దు జొన్నలగడ్డ పాత్ర సినిమాని కీలక మలుపు తిప్పబోతోందని ట్రైలర్ వీడియో చూస్తేనే తెలుస్తుంది. ఇలా సుమంత్ సిద్దు కాంబినేషన్లో సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలవబోతున్నాయని చెప్పాలి.

Advertisement

మహేంద్రగిరి వారాహి ట్రైలర్ వీడియోతోనే మంచి అంచనాలను పెంచారు. ట్రైలర్ చూస్తుంటే సెప్టెంబర్ 11వ తేదీ బాక్స్ ఆఫీస్ వద్ద స్పిరిచువల్ హిట్ ఖాయమనిపిస్తోంది. మరి మహేంద్రగిరి వారాహి సినిమా ద్వారా సుమంత్ ఎలాంటి సక్సెస్ అందుకుంటారో వేచి చూడాలి. సుమంత్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా అద్భుతమైన కథ చిత్రాలను ఎంపిక చేసుకుంటూ బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఈ ట్రైలర్ వీడియోతో సుమంత్ ఖాతాలో మరో హిట్ పడటం గ్యారెంటీ అంటూ అక్కినేని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Also Read: చిత్ర పరిశ్రమ అందరిదీ… ఒకరి సొత్తు కాదు.. విమర్శలకు చెక్ పెట్టిన చిరు!

Related News

ఇరుముడి హిట్టు వెనుక రవితేజకు ఇంత లాభమా?

చిత్ర పరిశ్రమ అందరిదీ… ఒకరి సొత్తు కాదు.. విమర్శలకు చెక్ పెట్టిన చిరు!

రాఖీ రోజున సర్‌ప్రైజ్.. SKN కి రాఖీ కట్టిన స్టార్ హీరోయిన్!

ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా నాగబాబు.. గొప్ప అవకాశం అంటూ చిరు పోస్ట్!

అక్కినేని ఫ్యాన్స్ గెట్ రెడీ.. కింగ్ 100 నుంచి బిగ్ అప్డేట్..వీడియో వైరల్!

రాఖీ స్పెషల్.. ఆడపడుచులకు పవన్ కళ్యాణ్ అదిరిపోయే స్పెషల్ గిఫ్ట్స్..

‘టాక్సిక్’ దెబ్బ..KVNకు బ్యాడ్ టైమ్ మొదలైందా?

Big Stories

Advertisement
×