E-Paper
Advertisement

శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’ ట్రైలర్ చూశారా? నవ్వులే నవ్వులు!

శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’ ట్రైలర్ చూశారా? నవ్వులే నవ్వులు!
Advertisement

Comrade Kalyan Trailer: శ్రీ విష్ణు ఇటీవల బ్యాక్ టు బ్యాక్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈయన మరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు శ్రీ విష్ణు (Sree Vishnu)తాజాగా నటించిన చిత్రం “కామ్రేడ్ కళ్యాణ్”(Comrade Kalyan). ఈ సినిమా అక్టోబర్ 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా చిత్ర బృందం ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

నక్సలిజం నేపథ్యంలో..

జానకి రామ్ మరలా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీ విష్ణు జోడిగా మహిమా నంబియార్ (Mahima Nambiyar)హీరోయిన్గ నటిస్తున్నారు. ప్రముఖ రచయిత కోన వెంకట్ సమర్పణలో ఈ సినిమా కోన ఫిలిం కార్పొరేషన్, స్కంద వాహన మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ వీడియో చూస్తుంటే 1990ల కాలం నాటి ఆంధ్ర ఒడిశా సరిహద్దు గ్రామం నేపథ్యంలో సాగే కథగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పీరియాడిక్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో శ్రీ విష్ణు నక్సలైట్ గా కనిపించబోతున్నారని తెలుస్తుంది.

ట్రైలర్ కు హైలెట్ గా నిలిచిన రాధిక పాత్ర..

Advertisement

ఇక తాజాగా విడుదల చేసిన ట్రైలర్ బాలయ్య సినిమా డైలాగులతో ప్రారంభమవుతుంది ఇందులో రాధిక శ్రీ విష్ణు తల్లి పాత్రలో కనిపిస్తున్నారని తెలుస్తుంది. ఇలా నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో కామెడీ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందని ట్రైలర్ చూస్తేనే స్పష్టమవుతుంది. శ్రీ విష్ణు చెప్పే డైలాగులు, సత్య కామెడీ టైమింగ్ ట్రైలర్ కు హైలెట్ అయింది. ఇక విష్ణు తల్లిగా రాధిక పాత్ర కూడా సినిమాలో హైలెట్ గా ఉండబోతుందని తెలుస్తోంది. కామ్రేడ్ గా విష్ణు మారడం ఆ తర్వాత జరిగే పరిణామాలు చాలా ఫన్నీగా ఉండబోతున్నాయని తెలుస్తోంది.

Advertisement

ఈ సినిమాలో శ్రీ విష్ణు ఎప్పటిలాగే తనదైన శైలిలో వినోదం అందిస్తూనే సరికొత్త షేడ్స్ ద్వారా ప్రేక్షకులను అల్లరించబోతున్నారు. ఈ సినిమాకు విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు అన్నిటిని పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఊహించని విధంగా ఈ సినిమా అక్టోబర్ 9వ తేదీ విడుదలవుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు ఈ సినిమాపై ఎలాంటి బజ్ ఏర్పడలేదు. ట్రైలర్ తో సినిమాపై కాస్త అంచనాలు పెరిగిపోయాయి. 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న శ్రీ విష్ణు కామ్రేడ్ కళ్యాణ్ ద్వారా ప్రేక్షకులను మెప్పించగలరా? లేదా అనేది తెలియాల్సి ఉంది.

Also Read: విలాసాలకు పోయి అప్పులు చేయొద్దు.. హిత బోధ చేసిన కొండన్న!

Related News

సినీ ఇండస్ట్రీలో విషాదం..బిల్లా 2 నిర్మాత మృతి.

మరో గోల్డెన్ ఆఫర్ పట్టేసిన అనస్వర రాజన్.. నిన్న చిరు.. నేడు?

తెలుగు సినిమాల్లో ఎప్పటికీ మారని కామెడీ సీన్లు ఏంటో తెలుసా ?

విలాసాలకు పోయి అప్పులు చేయొద్దు.. హిత బోధ చేసిన కొండన్న!

జగదాంబ థియేటర్ కథ ఇదే.. వైజాగ్ సినిమా కల్చర్‌కు ఎలా ఐకాన్ అయింది?

రవితేజకు విలన్ గా టాలీవుడ్ స్టార్.. క్రేజీ కాంబో సెట్ చేసిన వివేక్ ఆత్రేయ!

రామాయణ షూటింగ్ సెట్లో అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?

Big Stories

Advertisement
×