E-Paper
Advertisement

బుల్లితెరపై సందడి చేసిన స్వప్న దత్.. ఆ క్రేజీ మూమెంట్ చూసారా?

బుల్లితెరపై సందడి చేసిన స్వప్న దత్.. ఆ క్రేజీ మూమెంట్ చూసారా?
Advertisement

Swapna Dutt: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత సినిమా, టీవీ అనే తేడా లేకుండా బుల్లితెరపై సెలబ్రిటీలు సందడి చేస్తూ మంచి పాపులారిటీ సొంతం చేసుకుంటున్నారు. ముఖ్యంగా బుల్లితెరపై సత్తా చాటి.. ఎంతోమంది సినిమాలలో అవకాశాలు రావాలని పరితపిస్తుంటే.. వెండితెరపై సత్తాచాటుతున్న చాలామంది ఇప్పుడు బుల్లితెర షోలలో సందడి చేస్తూ.. ఇటు టీవీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

బుల్లితెరపై ప్రత్యక్షమైన స్వప్నా దత్..

అందులో భాగంగానే ప్రముఖ నిర్మాతగా పలు విజయవంతమైన చిత్రాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రముఖ నిర్మాత స్వప్న దత్ (Swapna Dutt) తాజాగా బుల్లితెర వేదికపై ప్రత్యక్షమై.. అందరి దృష్టిని ఆకట్టుకుంది. పైగా ఆమె చేసిన కామెడీ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. విషయంలోకి వెళ్తే.. ప్రదీప్ వ్యాఖ్యాతగా ‘దసరాకి విడుదల’ అనే ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కి సంబంధించిన టీజర్ ని తాజాగా విడుదల చేయగా.. ఇందులో ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi), సుమ కనకాల(Suma kanakala), స్వప్న దత్ (Swapna Dutt) తో పాటు ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా సందడి చేశారు.

అద్భుతమైన కామెడీ టైమింగ్..

Advertisement

ముఖ్యంగా స్వప్న దత్ అందరి దృష్టిని ఆకట్టుకుంది. స్వప్న స్టేజ్ పైకి రాగానే ప్రదీప్ మాచిరాజు మాట్లాడుతూ..” మీరు పట్టుచీరలు ఎక్కడ కొంటూ ఉంటారు?” అని ప్రశ్నించగా.. “ఎవరిస్తే వాళ్ళ దగ్గర తీసుకుంటూ ఉంటాను” అంటూ అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది స్వప్న . ఇది చూసిన ఆడియన్స్ స్వప్న దత్ లో ఇంత మంచి కామెడీ టైమింగ్ ఉందా అంటూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన టీజర్ కూడా వైరల్ గా మారింది.

నారాయణమ్మ పాటకు ఆనంది మాస్ స్టెప్స్..

ఇకపోతే ఈ టీజర్ లో బుర్రకథ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న గరివిడి లక్ష్మి చిత్ర బృందం కూడా సందడి చేసినట్లు టీజర్ లో చూపించారు. పైగా ఆనంది.. త్రివిక్రమ్ శ్రీనివాస్, వెంకటేష్ కాంబినేషన్లో వస్తున్న ఆదర్శ కుటుంబం ఏకే 47 లోని మాస్ పర్ఫామెన్స్ సాంగ్ నారాయణమ్మ సాంగ్ కి అదిరిపోయే స్టెప్పులేసి ఆకట్టుకుంది. సాధారణంగా సంక్రాంతి పండక్కి వచ్చే అనిల్ రావిపూడి ఈసారి దసరా పండక్కి వస్తున్నారు అంటూ ప్రదీప్ ఇచ్చిన ఇంట్రడక్షన్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. అనిల్ రావిపూడి ఎంట్రీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది.

Advertisement

ALSO READ: రామాయణ షూటింగ్ సెట్లో అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?

స్పెషల్ అట్రాక్షన్ గా విజయ్ దేవరకొండ..

ఈ టీజర్ లో ఆకట్టుకున్న మరో అంశం ఏమిటంటే.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రత్యక్షమవడం గమనార్హం. రణబాలి మూవీ ప్రమోషన్స్ లో భాగంగానే విజయ్ దేవరకొండ ఈ ఈవెంట్లో సందడి చేసినట్లు తెలుస్తోంది. దసరాకి విడుదల అనే ఈవెంట్ దసరా పండుగ రోజు ఉదయం 9 గంటలకు ప్రసారం కానుంది. మొత్తానికి అయితే వెండితెర , బుల్లితెర సెలబ్రెటీలతో ఈ దసరా పండుగ మరింత సంబరంగా సాగనుంది అని ఈ చిన్న టీజర్ తో నిరూపించారు . మరి ఈ సెలబ్రిటీలంతా దసరా పండుగ రోజు ఏ విధంగా సందడి చేస్తారో ప్రేక్షకులకు ఎలాంటి వినోదాన్ని పంచుతారో చూడాలి.

Related News

వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్న నూక రాజు.. రాంప్రసాద్ ను మించిన రెమ్యూనరేషన్!

“బిందెల బిందెలు బావయ్యో”.. మరో ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన మాధురీ రాథోడ్!

పండును ఈ పరిస్థితుల్లో చూస్తే కన్నీళ్లు ఆగవు.. మళ్లీ డ్యాన్స్ చేయగలడా? రికవరీకి ఎంత టైమ్?

బిగ్ బాస్ 10 5వ వారం నామినేషన్ లిస్ట్.. డేంజర్ జోన్ లో ఆ ఇద్దరే!

Nindu Noorella Saavasam Serial Today Episode October 6th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  మనోహరి, పార్థును చంపకుండా అమర్ అడ్డుకుంటాడా..? 

Karthika Deepam 2 Serial Today Episode October 6th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ తో జ్యోత్స్న పెళ్లి చేస్తానన్న దీప              

హేటర్స్ కి అనసూయ దిమ్మతిరిగే రియాక్షన్!

Big Stories

Advertisement
×