E-Paper
Advertisement

Mahesh Kumar: సోనియాగాంధీ దయ లేకుంటే కేసీఆర్ సీఎం అయ్యేవారు కాదు.. మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

Mahesh Kumar: సోనియాగాంధీ దయ లేకుంటే కేసీఆర్ సీఎం అయ్యేవారు కాదు.. మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
Advertisement

Mahesh Kumar Goud: బీఆర్‌ఎస్ పార్టీ తలపెట్టిన దీక్షా దివాస్ కార్యక్రమంపై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ ప్రజల్లో ఆదరణ పూర్తిగా కోల్పోయిందని, తమ ఉనికిని కాపాడుకునేందుకు మళ్లీ దీక్షా దివాస్ పేరుతో సెంటిమెంట్‌ను రెచ్చగొట్టాలని చూస్తోందని ఆయన విమర్శించారు. దీక్షా దివాస్ పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారని ఆయన ఆరోపించారు.

గతంలో కేసీఆర్ ప్రజల సెంటిమెంట్‌ను వాడుకున్నారని మహేష్ కుమార్ గౌడ్ గుర్తు చేశారు. తెలంగాణ కోసం దీక్ష చేస్తున్నట్లు ఆస్పత్రిలో చేరి డిశ్చార్జ్ అయ్యారని.. కేసీఆర్ చేసిన దీక్షా ఒక నాటకం అని ఆయన అభివర్ణించారు. కేవలం ఎనిమిది రోజుల్లోనే దీక్ష విరమించారని.. ‘పులి నోట్లో తలకాయ పెడితే తెలంగాణ వచ్చింది’ అనే వాదన బూటకమని కొట్టిపారేశారు. ఉద్యమంలో కేసీఆర్ పాత్ర కొంతవరకే ఉందని.. కానీ తెలంగాణ రావడానికి ప్రధాన కారణం బలిదానాలు చేసిన యువకులేనని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

కేసీఆర్ దీక్ష సమయంలో విటమిన్స్, ఫ్లూయిడ్స్ తీసుకొని పలాయనం చిత్తగించారని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. కేసీఆర్ దీక్ష టైమ్‌లో ఆయనకు ఇచ్చిన విటమిన్స్, ఫ్లూయిడ్స్ రిపోర్ట్స్ అన్నీ తన వద్ద ఉన్నాయని.. వాటిని కేటీఆర్‌కు పంపిస్తానని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డల త్యాగాలను చూసి చలించి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని అన్నారు.

నిజమైన దీక్ష అంటే ఇండియన్ యాక్టివిస్ట్ ఇరోమ్ షర్మిల చేసిన దీక్ష అని.. ఆమె 16 ఏళ్లు దీక్షలో ఉన్నారని ఉదహరించారు. దళిత, గిరిజన, బీసీ బిడ్డలు ప్రాణార్పణం చేస్తే తెలంగాణ సిద్ధించిందని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ మేనల్లుడు, బిడ్డ, అల్లుడు, కూతురు ప్రతి చోట దోచుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి దీక్ష దివాస్ పేరుతో సెంటిమెంట్ పొందాలని చూస్తున్నారని విమర్శించారు.

Advertisement

బీఆర్‌ఎస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే.. సోనియా గాంధీ ఫోటోకు పాలాభిషేకం చేయాలని పీసీసీ చీఫ్ డిమాండ్ చేశారు. ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించి, వారి కుటుంబాలను ఆదుకోవాలని సూచించారు. ఉద్యమ సమయంలో హరీష్ రావుకు అగ్గిపెట్టె కూడా దొరకదని ఎద్దేవా చేశారు. సోనియా గాంధీ దయ లేకుంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవారు కాదని.. కల్వకుంట్ల కుటుంబం దోచుకునేది కాదని మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు ముగించారు.

ALSO READ: RRB NTPC: నిరుద్యోగులకు శుభవార్త.. 3058 రైల్వే ఎన్టీపీసీ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంపు

Related News

తెలంగాణ మహిళపై జమ్మూకశ్మీర్‌లో కేసు నమోదు..!

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

Big Stories

Advertisement
×