Sitara Ghattamaneni : సినీ హీరోల హీరోయిన్ల పిల్లలు ఎలా ఉన్నారో తెలుసుకోవాలని చాలామంది అభిమానులు ఆతృత కనబరుస్తుంటారు. కొంతమంది వాళ్ళు ఎక్కడ చదువుతున్నారు? ఏం చేస్తున్నారు? అని గూగుల్లో తెగ వెతికేస్తుంటారు.. మరి కొంతమంది అప్కమింగ్ సినిమాల్లో హీరోయిన్గా? రాబోతున్నారేమో అని తెలుసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. ఈమధ్య ఎక్కువగా వినిపిస్తున్న పేరు సితార మహేష్ బాబు.. సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురుగా ఆమెకు మొదటి నుంచి ఒక క్రేజ్ ఉంది. ఇక ఈ మధ్య తండ్రికి తగ్గ కూతురిగా ఆమె చేస్తున్న సేవలకు అభిమానులు ఫిదా అవుతున్నారు. అయితే తాజాగా సితారకు పర్సనల్ గా ఆ మాస్టర్ డ్యాన్స్ నేర్పిస్తున్నారంటు వార్తలు వినిపిస్తున్నాయి. మాస్టర్ ఎవరు ? ఇప్పుడు ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
సితారకు డ్యాన్స్ మాస్టర్ ఎవరో తెలుసా..?
మహేష్ బాబు గారాలపట్టి సితార గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఆమె చేతిలో ఫోన్ పట్టుకొని వాడకం మొదలు పెట్టినప్పటి నుంచి సోషల్ మీడియాలో తెగ ఫేమస్ అయిపోయింది. ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ లలో ఎంట్రీ ఇచ్చింది. సోషల్ మీడియా లో తనకు తోచిన విధంగా ఉంటూ, కేవలం మహేష్ బాబు అభిమానులను మాత్రమే కాదు, ఇతర హీరోల అభిమానుల మనసుల్ని కూడా దోచుకుంది.. అంతే కాదు ఈ అమ్మడుకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది.. అందులో ప్రత్యేకమైన వీడియోలను పోస్ట్ చేస్తూ వస్తుంది.
ఈమధ్య సితార పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ వచ్చిన డబ్బులను సేవా కార్యక్రమాలకి ఖర్చు చేస్తుంది. ఆమె చేస్తున్న మంచి పనికి మహేష్ బాబు అభిమానులతో పాటుగా సినీ ప్రముఖుల సైతం ఫిదా అవుతున్నారు. సితార డాన్స్ ఎంత అద్భుతంగా వేస్తుందో అందరికీ తెలుసు. అయితే ఆమె సొంతంగా వేస్తుందా ఎవరైనా డాన్స్ మాస్టర్ ఆమెకు నేర్పిస్తున్నారా అనే సందేహం అందరికీ వచ్చింది. నిజానికి ఆమెకు ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఆనీ మాస్టర్ స్పెషల్గా డాన్స్ నేర్పిస్తుందట. సితారకు డాన్స్ నేర్పించినందుకు గాను మహేష్ బాబు ఆమెకు భారీగానే ఇస్తున్నట్లు తెలుస్తుంది.. విషయం తెలుసుకున్న అభిమానులు మాస్టర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం త్వరలోనే సితార హీరోయిన్గా ఇంటర్వ్యూ పోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ అయితే రాబోతుంది.
Also Read :‘హరిహర వీరమల్లు ‘ రన్ టైం ఇంతేనా..? ఫ్యాన్స్ లో కొత్త టెన్షన్..
మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే..
మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న సినిమాల విషయానికొస్తే.. గత ఏడాది గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆ మూవీ తెరకెక్కింది. అయితే సినిమా మిక్స్డ్ టాక్ ని అందుకుంది. కలెక్షన్స్ మాత్రం ఫుల్లుగానే వచ్చాయి. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు 29వ సినిమా తెరకెక్కుతుంది.. షూటింగ్ దశలో బిజీగా ఉన్న ఈ మూవీ వచ్చే ఏడాది థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది..