E-Paper
Advertisement

శృతి హసన్ ఫొటోల లీక్.. అనిల్–భాను ఏమన్నారంటే!

శృతి హసన్ ఫొటోల లీక్.. అనిల్–భాను ఏమన్నారంటే!
Advertisement

Anil Bhanu:సినిమా ఇండస్ట్రీలో కాంట్రవర్సీలు కొత్తేమీ కాదు. సినిమా రిలీజ్‌కు ముందు కథ లీక్ అవ్వడం, షూటింగ్ స్టిల్స్ బయటకు రావడం, ఫొటోలు సోషల్ మీడియాలో రచ్చ జరగడం వంటివి అడపాదడపా జరుగుతూనే ఉంటాయి.

అయితే ప్రముఖ పోస్టర్ డిజైనర్లు అనిల్–భాను కెరీర్‌లో కూడా ఒకప్పుడు ఇలాంటి ఓ వివాదం అప్పట్లోపెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది.తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని గుర్తు చేసుకున్న వాళ్లు, అసలు అప్పట్లో ఏం జరిగిందో ఓపెన్‌గా వివరించారు.

ఎవడు సినిమాలోని శృతి హసన్ ఫోటోలు

Advertisement

ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా పోస్టర్ డిజైనింగ్‌తో కెరీర్ ప్రారంభించిన అనిల్–భాను, ప్రారంభంలో ఎన్నో కష్టాలు పడ్డారు. అవకాశాల కోసం ప్రొడక్షన్ హౌస్‌ల చుట్టూ తిరగడం, శాంపిల్స్ తయారు చేయడం, ఆ తర్వాత అదిత్య మ్యూజిక్ లాంటి సంస్థల నుంచి ప్రాజెక్టులు అందుకోవడంతో వాళ్ల కెరీర్ ఒక్కో మెట్టు ఎక్కింది. అలాంటి సమయంలోనే వాళ్లను ఓ స్టిల్స్ లీక్ కాంట్రవర్సీ చుట్టుముట్టింది. ముఖ్యంగా ఎవడు సినిమాలోని శృతి హసన్ ఫోటోలు కొన్ని అభ్యంతరకరంగా వెబ్ సైట్ లలో పోస్ట్ చేయడం వంటివి కూడా వీరి మెడకే చుట్టుకుంది.ఇక మధుమతి లో ఉదయ భాను స్టిల్స్ విషయంలో కూడా ఇలానే రచ్చ జరిగింది.

ఎలాంటి స్టిల్స్ లీక్ చేయలేదన్న అనిల్–భాను

అయితే ఈ వివాదంపై వాళ్లు ఇలా ఓపెన్ అయిపోయారు. తాము కావాలని ఎలాంటి స్టిల్స్ లీక్ చేయలేదని అనిల్–భాను స్పష్టం చేశారు. తమ దగ్గరికి వచ్చిన ఫొటోలు, స్టిల్స్‌ను ఎప్పటిలాగే సంబంధిత గ్యాలరీలకు లేదా వెబ్‌సైట్లకు పంపించామని, కానీ ఆ తర్వాత అవి లీక్ కావడంతో ఆ తప్పు తమపై వేశారని తెలిపారు. అంటే తమ పని తాము చేసుకుంటూ వెళ్లిన సమయంలో జరిగిన ఓ పొరపాటు మొత్తం తమ మెడకు చుట్టుకుందని వాళ్లు వివరించారు.

Advertisement

నిజానికి సినిమా రిలీజ్‌కు ముందు ఫస్ట్ లుక్, ముఖ్యమైన సీన్స్ లోని ఫొటోలు బయటకు వస్తే సినిమాపై ఉన్న క్యూరియాసిటీ దెబ్బతింటుంది. అందుకే మేకర్స్ చాలా జాగ్రత్తగా ఉంటారు. అయితే అప్పట్లో సోషల్ మీడియా అంతగా లేని రోజుల్లో ఫొటోలు పబ్లిసిటీ టీమ్, డిజైనర్లు, ఫొటోగ్రాఫర్ల ద్వారా వెబ్‌సైట్లకు చేరేవి. ఒకసారి ఫొటో బయటకు వెళ్లిందంటే అది ఎక్కడి నుంచి లీక్ అయిందో గుర్తించడం చాలా కష్టమయ్యేది.అలానే తాము పంపిన స్టిల్స్ ఏ విధంగా బయటకు వెళ్లి లీక్ అయ్యాయో తమకు కూడా తెలియదని క్లారిటీ ఇచ్చారు.

ALSO READ :‘గీతాంజలి’ మళ్లీ వస్తోంది.. ఈసారి 4Kలో! నాగార్జున ఫ్యాన్స్‌కి పండగే

సరికొత్త లెస్సన్స్ నేర్పించినట్టే 

ఇక కెరీర్ మొదట్లో డిజిటల్ డిజైనింగ్ లేకపోవడంతో ఫొటోలను ప్రింట్ చేసి, స్కాన్ చేసి, డిజైన్లు తయారు చేయడానికి ఎంతో ఖర్చు పెట్టి స్ట్రగుల్ అయిన అనిల్–భాను, ఈ చేదు అనుభవాన్ని కూడా వివరించారు. “స్టిల్స్ మా దగ్గర నుంచి వెళ్లాయి.. కానీ లీక్ చేసింది మాత్రం మేము కాదు” అని చెప్పడం చూస్తె అప్పట్లో జరిగిన లీకులకి వీరికి ఎలాంటి సంబంధం లేదని క్లియర్ గా తెల్సిపోతుంది.మొత్తానికి సినీ కెరీర్ లో ఎన్నో ఎత్తు పల్లాలు చూసిన వీరికి ఈ కేసు వ్యవహారం సరికొత్త లెస్సన్స్ నేర్పించినట్టే కనిపిస్తుంది !

Tags

Related News

నాని రెమ్యునరేషన్ పెంచేశాడా? నిర్మాతలకు కొత్త లెక్క

రణబాలికి హైక్స్ లేవట.. మేకర్స్ లెక్క మామూలుగా లేదుగా!

‘రాజాసాబ్’ బ్యూటీ రిధి.. ఈసారి కొత్త లుక్‌తో షాక్ ఇచ్చిందే!

నితిన్‌కు హిట్ పడి ఎన్నాళ్లయిందో.. ఈసారి అయినా లెక్క మారేనా?

హీరోగానే కాదు.. డైరెక్టర్‌గానూ సంపాదిస్తున్న విశ్వక్ సేన్!

లెజెండ్రీ డైరెక్టర్ సింగీతంకి ‘పద్మ అవార్డ్స్’ ఎందుకు రాలేదు?

పవన్.. ప్రభాస్.. ఇద్దరి పక్కన ఛాన్స్! నిధి లెక్క ఎప్పుడు మారుతుందో?

గురూజీకి సెకండ్ హాఫ్ నచ్చలేదా? ‘ఆదర్శ కుటుంబం’పై కీలక నిర్ణయం!

Big Stories

Advertisement
×