Sunil Gavaskar On Babar Azam Injury : ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ ( England vs Pakistan) మధ్య బుధవారం అంటే ఆగస్టు 19వ తేదీ నుంచి టెస్ట్ సిరీస్ ( Pakistan tour of England 2026) ప్రారంభం కానుంది. ఈ రెండు జట్ల మధ్య మొత్తం రెండు టెస్టులు జరగనుండగా… రేపటి నుంచి తొలి మ్యాచ్ షురూ అవుతుంది. రేపు మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ ఖరారు అయింది. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. మొన్న వెస్టిండీస్ జట్టును చిత్తు చేసిన బాబర్ ఆజం ( Babar Azam) గాయం బారిన పడి, తొలి టెస్ట్ కు దూరమయ్యాడు. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.
ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ ( England vs Pakistan) మధ్య రేపటి నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో బాబర్ ఆజం గాయం కారణంగా దూరమయ్యాడు. ఈ క్రమంలో బాబర్ ఆజం గాయంపై సునీల్ గవాస్కర్ ( Sunil Gavaskar ) తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వెస్టిండీస్ పై ఒక్క మ్యాచ్ గెలవగానే బాబర్ ఆజం గాయం బారిన పడడం దారుణం అన్నారు. అతడికి అసలు ఫిట్నెస్ లెవెల్స్ సరిగ్గా లేవని… అంతర్జాతీయ క్రికెట్ కు పనికి రాబోడని బాంబు పేల్చారు సునీల్ గవాస్కర్.
వెస్టిండీస్ జట్టుపై ఒక్క మ్యాచ్ గెలవగానే కొమ్ములు వచ్చినట్లుగా బాబర్ ఆజం రెచ్చిపోయాడని నిప్పులు చెరిగారు. టీమిండియాను కూడా ఓడిస్తానని.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ గడప కూడా తొక్కని ఇవ్వబోనని బాబర్ ఆజం వెల్లడించాడని ఆగ్రహించారు. అయితే ఇంగ్లాండ్ గడ్డపై అడుగుపెట్టగానే బాబర్ ఆజం ప్యాంటు తడుపుకున్నాడని పరువు తీశారు. గాయం పేరుతో తొలి టెస్ట్ కే కావాలనే దూరమయ్యాడని సంచలన ఆరోపణలు చేశారు. చిన్న గాయమైనప్పటికీ.. ఓటమి భయంతో బాబర్ ఆజం తప్పుకున్నాడని హేళన చేశారు సునీల్ గవాస్కర్.
బుధవారం నుంచి ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఇలాంటి క్రమంలో బాబర్ ఆజం గాయం బారిన పడినట్లు తెలుస్తోంది. అతడు దాదాపు జట్టుకు దూరమయ్యే ఛాన్స్ లే కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో బాబర్ ఆజం స్థానంలో షాన్ మసూద్ ను కెప్టెన్ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ చివరి క్షణంలో సల్మాన్ అలీని ( Salman Ali Agha) కెప్టెన్ చేసేందుకు నిర్ణయం తీసుకుందట పాకిస్తాన్ క్రికెట్ బోర్డు యాజమాన్యం.