BigTV English

Mana Shankara Vara Prasad Garu : మన శంకర వరప్రసాద్ ఒక్కరు కాదు ఇద్దరు… మూవీ ఫుల్ స్టోరీ ఇదే ?

Mana Shankara Vara Prasad Garu : మన శంకర వరప్రసాద్ ఒక్కరు కాదు ఇద్దరు… మూవీ ఫుల్ స్టోరీ ఇదే ?

Mana Shankara Vara Prasad Garu Story: ‘మన శంకర వరప్రసాద్‌ గారు’.. ప్రస్తుతం ఈ టైటిల్‌ ట్రెండింగ్‌లో ఉంది. మెగాస్టార్‌ చిరంజీవి బర్త్‌డే సందర్భంగా అనిల్‌ రావిపూడి ఫ్యాన్స్‌ అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చారు. మెగా 157 మూవీ టైటిల్‌ గ్లింప్స్‌తో పాటు చిరు లుక్‌ని విడుదల చేశారు. ఈ సినిమాకు ‘మన శివ శంకర వరప్రసాద్‌ గారు’ టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. పండక్కీ వస్తున్నారు అనేది ట్యాగ్‌ లైన్. ప్రస్తుతం ఈ టైటిల్‌ ఫుల్‌ క్రేజ్‌ను సంపాదించుకుంది. ముఖ్యంగా చిరంజీవి లుక్ బాగా ఆకట్టుకుంటుంది. ఇందులో చిరు వింటేజ్‌ లుక్‌లో కనిపించి సర్‌ప్రైజ్‌ చేశారు. షూటు, బూటు, కళ్లజోడు ధరించిన చేతిలో తుపాకితో స్టైలిష్‌గా నడుచుకుంటూ వస్తున్నారు.


అదిరిపోయిన గ్లింప్స్

ఇందులో చిరు లుక్‌ చూసి మెగా ఫ్యాన్స్‌ అంతా బాస్‌ ఈజ్‌ బ్యాక్‌ అంటూ కాలర్‌ ఎగిరేస్తున్నారు. ఇక గ్లింప్స్‌కి వెంకీమామ వాయిస్‌ ఓవర్ ఇవ్వడంతో మరింత హైప్‌ పెరిగింది. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇప్పుడు ఈ మూవీ స్టోరీ హాట్‌ టాపిక్‌గా ఉంది. ఇందులో చిరు లుక్‌ హైలెట్‌ అయ్యింది. ఇందులో ఆయన షూటు, బూటు, కళ్లజోడుతో యమ సైలిష్‌గా ఉన్నారు. చేతిలో తూపాకి కూడా ఉంది. అంతే ఈ సినిమా జానర్‌ ఏంటీ? అనిల్‌ రావిపూడి ఆయన కోసం ఎలాంటి కథను రెడీ చేశారా? ఆలోచనలో పడ్డారు. అయితే అనిల్‌ రావిపూడి సినిమా అంటే కామెడీ పక్కా ఉండాల్సిందే. అది హీరోని బట్టి ఎలా ఉంటుందనేది అనిల్‌ రావిపూడి తన కథని రాసుకుంటారు.


కథ ఇదేనా?

వెంకటేష్‌ అంటేనే కామెడీ పంచ్‌లు. ఆయన ఇమేజ్‌ని మరింత రెట్టింపు చేసేలా ఎఫ్‌2, ఎఫ్‌3లో పర్ఫెక్ట్‌గా కథ రాసుకొచ్చారు. ఆ తర్వాత సరిలేరు నీకెవ్వరు.. మహేష్‌ బాబుని ఇమేజ్‌ కరెక్ట్‌ సెట్‌ అయ్యే కామెడీ, యాక్షన్‌ని చూపించారు. బాలయ్యకు భగవంత్‌ కేసరిలో ఎమోషన్‌, యాక్షన్‌ కలిపి కొట్టేశారు. దానికి కాస్తా కామెడీని జోడించారు. ఇలా హీరో ఇమేజ్‌, క్రేజ్‌ బట్టి అనిల్‌ కథ ఉంటుంది. అలాగే మెగాస్టార్‌ కోసం అనిల్‌ కథను భారీగా ప్లాన్‌ చేసి ఉంటారనిపిస్తోంది. మెగాస్టార్‌ సినిమా అంటే అందులో అన్ని ఎలిమెంట్స్‌ ఉంటాయి. కామెడీ, ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్స్‌, యాక్షన్. బాస్‌ సినిమాలో అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉంటాయి. వాటితో పాటు మంచి డ్యాన్స్‌ స్టెప్పులు ఉండాల్సిందే. మరి మెగాస్టార్‌ కోసం అనిల్‌ ఎన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటారు. అందుకు బాస్‌లోని అన్ని ఎలిమెంట్స్‌ చూపించాలంటే ఒక్క పాత్ర సరిపోదు. అందుకు ఆయన ద్విపాత్రాభినయం తీసుకున్నారట. ఇందులో చిరంజీవి డబుల్‌ యాక్షన్‌ చేయబోతున్నారు. ఒకటి మాస్ రోల్‌ అయితే.. మరోకటి ఫుల్‌ క్లాస్‌ రోల్‌. ఈ రెండింటి మధ్య ఎమోషనల్‌ ఫ్యామిలీ డ్రామాతో పాటు యాక్షన్‌, కామెడీ టచ్‌ ఇచ్చారట.

పీఈటీ టీచర్ గా చిరు!

ఇందులో చిరు రెండు పాత్రలు వింటేజ్‌ బాస్‌ని గుర్తు చేసేలా ఉంటాయట. ఒక పాత్రలో చిరు పీఈటీ టిచర్ గా కనిపించబోతున్నారట. మరో పాత్రతో ఇంటలిజేన్స్ డిపార్ట్మెంట్ అధికారిగా కనిపిస్తారట. ఎస్‌పీజీ అసిస్టెంట్ కమాండెంట్ గా ప్రైం మినిస్టర్ దగ్గర పని చేస్తారట. ఇది ఢిల్లీ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని సమాచారం. కాగా ‘రౌడీ అల్లుడు’, ‘దొంగ మొగుడు’, ‘యముడికి మొగుడు’ వంటి చిత్రాల తరహాలో ఉంటుంది. ఇక కామెడీ విషయానికి వస్తే ‘చట్టబ్బాయి’ తరహాలో ఆడియన్స్‌ని ఆకట్టుకునేలా ఉంటుందట. నిజానికి మెగాస్టార్‌లో సీరియస్‌ యాంగిల్.. అలాగే మంచి కామెడీ, సెన్సాఫ్‌ హ్యుమర్‌ కూడా ఉంటుంది. అవన్ని ఈ సినిమాలో చూపించబోతున్నాడట అనిల్‌ రావిపూడి. పైగా ఇందులో విక్టరీ వెంకటేష్‌ కామియో రోల్‌ మరింత ప్రత్యేకంగా ఉండబోతుందట. మొత్తానికి మన శంకర వరప్రసాద్‌తో వచ్చే ఏడాది సంక్రాంతికి అనిల్‌ రావిపూడి మెగా ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో పర్ఫెక్ట్‌ పండగ సందడి తీసుకురాబోతున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలో రచ్చ మామూలుగా ఉండదంటున్నారు మెగా ఫ్యాన్స్‌.

Also Read: Anil Ravipudi: ‘మన శంకర వరప్రసాద్‌’.. వెంకీమామ గ్రాండ్‌ ఎంట్రీ ఫిక్స్‌.. అసలు విషయం చెప్పేసిన అనిల్‌

Related News

Vijay Devarakonda: మేమంతా సేఫ్..కారు ప్రమాదం పై స్పందించిన విజయ్ దేవరకొండ

Pawan Kalyan: పవన్ తో దిల్ రాజు కొత్త సినిమా..రంగంలోకి క్రేజీ డైరెక్టర్!

Vijay Devarakonda: బ్రేకింగ్ – విజయ్ దేవరకొండ కారుకు ప్రమాదం

Dacoit Release: అడవి శేష్ డెకాయిట్ రిలీజ్ డేట్ ఫిక్స్..వెనకడుగు వేసే ప్రసక్తే లేదంటూ!

OG Collections: OG అరుదైన రికార్డు.. 11 రోజుల్లో ఎన్ని కోట్లు వసూళ్లు చేసిందంటే!

Upasana -Klin Kaara: క్లిన్ కారాను అందుకే చూపించలేదు.. ఆ భయమే కారణమా?

Nagachaitanya: నాగచైతన్య ఫెవరేట్ సినిమాలు.. ఒక్కో మూవీ 100 సార్లు చూశాడట

Saiyami Kher : అరుదైన గౌరవాన్ని అందుకున్న జాట్ బ్యూటీ.. గ్రేట్ మేడం!

Big Stories

×