కుంచించుకుపోయిన తలలు. వీటిని త్సాన్సాస్ అని కూడా పిలుస్తారు. ఇవి చిన్నవిగా తయారు చేయబడిన మానవ తలలు. దక్షిణ అమెరికాలోని కొన్ని తెగలు, ఈక్వెడార్, పెరూలోని జివారోన్ ప్రజలు చాలా కాలం క్రితం వాటిని తయారు చేశారు. వారు తమ శక్తిని ప్రదర్శించడం, ప్రతీకారం తీర్చుకోవడం లాంటి కారణాలతో వీటిని తయారు చేసేవాళ్లు.
ఆ తలలతో ఏం చెప్పాలనుకునే వారు?
జివారోన్ తెగలు తల కుంచించుకుపోయేలా చేయడం వల్ల సదరు వ్యక్తి ఆత్మ దానిలోకి చేరుతుందని నమ్మేవారు. ఇలా చేయడం వల్ల వారికి బలాన్ని ఇస్తుందని, వారి తెగను రక్షిస్తుందని భావించేవారు. నిజానికి ఈ తలలను యుద్ధంలో చంపబడిన శత్రువులవి తీసుకొని కూడా తయారు చేసేవారు. కుంచించుకుపోయిన తలని తయారు చేయడం వారి విజయం, గౌరవాన్ని చూపించడానికి ఒక మార్గంగా భావించేవారు.
ఇంతకీ ఆ తలలను ఎలా తయారు చేస్తారంటే?
కుంచించుకుపోయిన తలను తయారు చేయడానికి ఓ పద్దతి ఫాలో అవుతారు. మొదట, తల శరీరం నుంచి వేరు చేస్తారు. పుర్రె నుండి చర్మాన్ని ఒలుస్తారు. పుర్రెను పడేస్తారు. ఆ చర్మాన్ని ప్రత్యేక మొక్కలతో నీటిలో ఉడకబెడతారు. ఆ తర్వాత దానిని ఎండబెట్టి, దానినిలో వేడి రాళ్ళు, ఇసుకతో నింపుతారు. చివరగా కళ్ళు, నోటిని కుట్టి, తలను తయారు చేస్తారు. ఇలా చేయడం వల్ల తల చిన్నగా, పిడికిలి పరిమాణంలోకి మారుతుంది.
ఇప్పుడు కుంచించుకుపోయిన తలలు ఉన్నాయా?
ప్రస్తుతం పలు కుంచించుకుపోయిన తలలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మ్యూజియంలలో ఉన్నాయి. కొన్ని నిజమైనవి, చాలా కాలం క్రితం తెగలు తయారు చేసినవి కూడా ఉన్నాయి. మరికొన్ని నకిలీవి. వ్యాపారం కోసం, పురాతన వస్తువులను సేకరించే వారికి అమ్మడానికి తయారు చేయబడ్డాయి. జివరోన్ సంస్కృతి, చరిత్ర గురించి ప్రజలకు బోధించడానికి మ్యూజియంలు వాటిని ప్రదర్శిస్తాయి. కానీ, కొంతమంది మానవ అవశేషాలను ఇలా చూపించడం తప్పు అని భావిస్తారు.
కుంచించుకుపోయిన తలల వెనుక ఆసక్తిక విషయం
కుంచించుకుపోయిన తలలు దక్షిణ అమెరికా చరిత్రలో ఒక ప్రత్యేకమైన భాగం గురించి మనకు తెలియజేస్తాయి. విభిన్న సంస్కృతులు, అక్కడి ప్రజల నమ్మకాలు, సంప్రదాయాలను ఎలా కలిగి ఉన్నాయో చూపిస్తాయి. ఈ ఆచారం ఎక్కువగా ఆగిపోయినప్పటికీ.. గతంలో తయారు చేసిన ఈ తలలు ఇప్పటికీ వారి పూర్వీకుల గొప్పతనాన్ని చెప్పుకునేందుకు ఉపయోగిస్తున్నారు. ఈ కుంచించుకుపోయిన తలలు ఈ తరం వాసులకు ఎన్నో మర్మమైన విషయాలను చెప్తూనే ఉన్నాయి.
Read Also: పాలు మాంసాహారమా? అమెరికాలో అంతే.. ఎందుకంటే?