E-Paper
Advertisement

ఆ హిట్ సినిమా రీమేక్ ? అనిల్ రావిపూడి కొత్త సినిమా కథపై సరికొత్త లీక్స్ !

ఆ హిట్ సినిమా రీమేక్ ? అనిల్ రావిపూడి కొత్త సినిమా కథపై సరికొత్త లీక్స్ !
Advertisement

Anil Ravipudi: అనిల్ రావిపూడి..కామెడీ  కి కేరాఫ్ .ఇప్పటిదాకా వచ్చిన సినిమా లన్నీ చూస్తే అది ప్రూవ్ అవుతుంది కూడా. అలా వరుస సక్సెస్ లతో జోరు మీదున్న ఈ కుర్ర డైరెక్టర్ చెప్పిన టైమ్‌కే, పక్కా ప్లానింగ్‌తో తన కొత్త సినిమా షూటింగ్‌ను ఇవాళే పట్టాలెక్కించేశారు.అవును విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ లాంటి క్రేజీ మల్టీస్టారర్ కాంబినేషన్  ఈరోజే ముహూర్తం పెట్టేసుకుంది.ఇందులో వెంకీకి తోడుగా  కీర్తి సురేష్ ,కళ్యాన్ రామ్ కి తోడుగా కృతి శెట్టి నటించనున్నారు.ఇక  జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటంతో  అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.ఇకపొతే ఈ సినిమా స్టోరీపై ఇండస్ట్రీలో ఒక క్రేజీ రూమర్ వినిపోస్తుంది .

ఆ మలయాళ హిట్ తరహాలోనే ?

సాధారణంగా ఈ మధ్యకాలంలో కథల్లో కొత్తదనం కోసం పక్క భాషల వైపు చూడటం కామన్ అయిపోయింది. రెండేళ్ల క్రితం మలయాళంలో వచ్చిన ‘గురువాయూర్ అంబలనాడైల్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. బావ-బావమరుదుల మధ్య జరిగే ఒక విచిత్రమైన కన్ఫ్యూజన్ డ్రామా, మాజీ ప్రియురాలి చుట్టూ తిరిగే ఫన్నీ ట్విస్టులు ఆ సినిమాను నిలబెట్టాయి.

Advertisement

Also read :పెద్ది రీలోడెడ్ వెర్షన్ రిలీజ్.. జాన్వీ కపూర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్!

ప్రస్తుతానికి అనిల్ రావిపూడి సినిమా కూడా సరిగ్గా ఇదే తరహా ‘సిట్యుయేషనల్ కామెడీ’ లైన్ మీద నడుస్తుందని వినికిడి. అయితే ఇది రీమేక్ మాత్రం కాదు, పక్కా స్ట్రైట్ సబ్జెక్ట్. కాకపోతే, ఆ మలయాళ సినిమా తరహాలోనే ఇద్దరు హీరోల మధ్య మొదట ఫ్రెండ్‌షిప్, ఆ తర్వాత ఫన్నీ శత్రుత్వం లాంటి ఎలిమెంట్స్ ఇందులోనూ ఓ రేంజ్ లో పేలనున్నాయట.

 ఎంటర్‌టైన్‌మెంట్‌కి గ్యారెంటీ 

Advertisement

ఎఫ్‌-2, ఎఫ్‌-3 సినిమాలతో వెంకటేష్ కామెడీ టైమింగ్‌ని అనిల్ రావిపూడి ఏ రేంజ్‌లో వాడారో చూశాం. ఇప్పుడు దానికి కళ్యాణ్ రామ్ సీరియస్-కామెడీ యాంగిల్ తోడైతే స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోవడం ఖాయం.కేవలం గ్లామర్ కే పరిమితం  కాకుండా కీర్తి సురేష్, కృతి శెట్టిల క్యారెక్టర్లు కథను మలుపు తిప్పేలా ఉంటాయట. ముఖ్యంగా కీర్తి సురేష్ టైమింగ్ ఈ సినిమాకు మేజర్ అసెట్ కానుంది.ఇక  రెండున్నర గంటల పాటు ఎలాంటి బోరింగ్ ఎలిమెంట్స్ లేకుండా, కేవలం సరదా ట్విస్టులతో ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా డిజైన్ చేయడం అనిల్ రావిపూడికి వెన్నతో పెట్టిన విద్య అని వేరే చెప్పక్కర్లేదు.

రొటీన్ ఫార్ములా భయం

అయితే ఇదే సినిమాపై నెగెటివిటీ కూడా గట్టిగానే వినిపిస్తుంది.  ఒకే ఇంట్లో అందరూ కూర్చొని కన్ఫ్యూజ్ అవుతూ నవ్వించే ఫార్ములాను అనిల్ ఇప్పటికే చాలాసార్లు వాడేశారు. ఈ సినిమాలో కూడా అదే రిపీట్ అయితే ‘రొటీన్ మార్క్’ అనే ముద్ర పడే ప్రమాదం ఉంది.కేవలం కామెడీ నమ్ముకుంటే సరిపోదు, ఇద్దరు పెద్ద హీరోలు ఉన్నప్పుడు ఫ్యాన్స్ ఆశించే మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా కావాలి. మరి ఆ విషయంలో రావిపూడి ఎంతవరకు న్యాయం చేస్తారనేది వేచి చూడాల్సిందే.

Also read :నజ్రియా కొంపముంచిన సెన్సేషనల్ పోస్ట్.. ఆ ఒక్క మాటతో బుక్కయిపోయిందా?

‘జనవరి 13 విడుదల’ కాదా?

ఇక ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ‘జనవరి 13 విడుదల’ అనే వర్కింగ్ టైటిల్ తెగ ప్రచారంలో ఉంది. సంక్రాంతి సీజన్‌ను టార్గెట్ చేస్తూ పెట్టిన ఈ పేరు వినడానికి వెరైటీగా ఉన్నప్పటికీ, దర్శకుడు అనిల్ రావిపూడి మైండ్‌లో వేరే ప్లాన్ ఉందట.  ఒక వెరైటీ  అల్ట్రా-క్యాచీ టైటిల్‌ను ఇప్పటికే లాక్ చేశారని టాక్.ఏదేమైనా, సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించేందుకు పక్కా స్క్రిప్ట్‌తో రెడీ అయిన ఈ క్రేజీ మల్టీస్టారర్.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి!

Related News

రాంబాయి గ్లామర్ డోస్ పెంచిందిగా.. కుర్రాళ్లకు నిద్రపట్టదు..!

71 ఏళ్లకీ జిమ్‌లో దుమ్మురేపిన హృతిక్ తల్లి..వైరల్ వీడియో

కన్నుమూసిన ఛత్రపతి విలన్ ..ఇండస్ట్రీలో విషాదం !

ప్రేమ కథల లవర్స్‌కు పండగ.. ‘వన్స్ మోర్’ వచ్చేస్తుంది!

ఆగస్టు 9న వైజాగ్‌లో బన్నీ హంగామా.. అభిమానులకు గుడ్ న్యూస్!

మృణాల్ ఠాకూర్ ఫైర్.. ఇక షేర్ చేసినా కేసులే!

నిఖిల్ ‘స్వయంభు’లో శక్తిమాన్.. టాప్ సీక్రెట్ రివీల్ చేసిన హీరో!

ఎన్టీఆర్ లేకుండానే ‘డ్రాగన్’ షూటింగ్.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్!

Big Stories

Advertisement
×