Nazriya Post: నజ్రియా నజీమ్… సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి మలయాళంలో స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న ఈ బ్యూటీ, నేచురల్ స్టార్ నాని సరసన `అంటే సుందరానికీ` సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. హోమ్లీ లుక్స్, న్యాచురల్ యాక్టింగ్ తో తెలుగు ఆడియెన్స్ మనసు దోచుకున్నప్పటికీ, ఇక్కడ ఆమెకు ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదు.ఇదిలా ఉంటె ప్రస్తుతం ఈ వెటరన్ బ్యూటీ సోషల్ మీడియాలో పెట్టిన ఒక క్రేజీ పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
నజ్రియా కెరీర్‌ను గమనిస్తే మనకో ఇంట్రెస్టింగ్ యాంగిల్ కనిపిస్తుంది.ఇప్పటికీ చాలా మంది హీరోయిన్లు కెరీర్ కోసం గ్లామర్ పాత్రలకు, రొమాంటిక్ సీన్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంటారు. కానీ నజ్రియా మాత్రం మొదటి నుంచి ఒక గీత గీసుకుంది. ముద్దు సీన్లు, శృతిమించిన ఎక్స్ పోజింగ్‌కు ఆమె పూర్తిగా దూరం. ఈ కండీషన్ల వల్లే టాలీవుడ్ మేకర్స్ ఆమెను లైట్ తీసుకున్నారనే టాక్ ఉంది.
మరోవైపు, స్టార్‌డమ్ కోసం కాకుండా తన వ్యక్తిగత విలువలకే కట్టుబడి ఉండటం, కేవలం నటనకు ప్రాధాన్యమున్న పాత్రలనే ఎంచుకోవడం ఆమె వ్యక్తిత్వానికి నిదర్శనం అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు ఫ్యాన్స్.
Also read :పెద్ది రీలోడెడ్ వెర్షన్ రిలీజ్.. జాన్వీ కపూర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్!
ఇక పర్సనల్ లైఫ్ ని భర్త ఫహద్ ఫాజిల్‌తో ఉన్న మధుర క్షణాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకునే నజ్రియా.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ఒక కొటేషన్ నెట్టింట పెద్ద చర్చకు దారితీసింది.”ఎద్దులు ఎరుపు రంగు జెండాల (రెడ్ ఫ్లాగ్స్) వెనుక పరిగెత్తడం పిచ్చితనం అని నేను ఒకప్పుడు అనుకునేదాన్ని.. కానీ ఇప్పుడు నేను కూడా సరిగ్గా అదే స్థితిలో ఉన్నాను” అంటూ ఆమె రాసుకొచ్చారు.సాధారణంగా ఎద్దులు ఎరుపు రంగును చూసి ఆవేశంతో లేదా ఆకర్షణతో దాని వెనుక పరిగెడతాయనే నమ్మకం ఉంది. ఇక ప్రస్తుతం ఉన్న ఈ డిజిటల్ ట్రెండ్ లో అయితే,‘రెడ్ ఫ్లాగ్’ అంటే కంప్లీట్ నెగెటివిటీ ని రిఫ్లెక్ట్ చేస్తుందన్న సంగతి తెల్సిందే
దీంతో నజ్రియా అంతటి సెలబ్రిటీ ‘రెడ్ ఫ్లాగ్’ అనే పదాన్ని వాడటంతో సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ చక్కర్లు కొట్టడం మొదలెట్టాయి. ఒక వర్గం నెటిజన్లు ఆమె పర్సనల్ లైఫ్ లేదా మ్యారేజ్ లైఫ్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేక ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అంటూ ఆరాలు తీయడం మొదలెట్టారు నజ్రియా ఫ్యాన్స్.ఇక ఈ పోస్ట్ ఆమె ఇమేజ్‌ను నెగిటివ్‌గా మార్చే అవకాశం ఉందని లెక్కేస్తున్నారు ట్రేడ్ పండితులు.
అయితే, సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో ఇదొక కొత్త ట్రెండ్ అయిపొయింది. తాము నటించబోయే తదుపరి చిత్రాలు లేదా వెబ్ సిరీస్‌ల ప్రమోషన్ల కోసం సెలబ్రిటీలు ఇలాంటి క్రేజీకాంట్రవర్సి అండ్ , క్యూరియాసిటీని పెంచే పోస్టులు పెట్టడం కామన్ అయిపొయింది.అలా పబ్లిసిటీ స్టంట్ లో భాగంగా నజ్రియా ఇలాంటి పోస్టులు పెట్టిందా ఏంటి అంటూ డౌట్స్ రైజ్ చేస్తున్నారు మరికొంతమంది మూవీ లవర్స్.చూడాలి మరి నజ్రియా దీని పై ఎప్పుడు ఎలాంటి అప్ డేట్ వదులుతుందో !