Bandi Sanjay: గత లోక్ సభ ఎన్నికల్లో తనకు కొందరు వ్యతిరేకంగా పని చేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు తక్కువ ఓట్లు వచ్చేందుకు కొందరు చాలా ప్రయత్నం చేశారని అన్నారు. ఎక్కడా లేని సమస్య నియోజకవర్గంలోనే వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీలో వర్గాలు ఉండవని.. ఎవరైనా అనుకుంటే అది మూర్ఖత్వమే అవుతోందని పైరయ్యారు.
అన్ని వర్గాలు మోదీ వర్గంగా మారాలి: బండి సంజయ్
వ్యక్తి కోసం పని చేస్తే పార్టీలో ఎవరిని ప్రోత్సహించం. పార్టీ కోసం పని చేసిన వాళ్లకే నిధులు ఇస్తున్నా. కొందరు గిరి గీసుకుని వర్గాలను ప్రోత్సహిస్తే సహించం. మోదీ, బీజేపీ వర్గాలు మాత్రమే ఉండాలి. ఇప్పటికైనా కొందరు తమ విధానాన్ని మార్చుకోవాలి. హుజురాబాద్ లో తనకు, పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్లకు లోకల్ ఎన్నికల్లో ఎలా టికెట్లు ఇవ్వాలి..? ప్రతి బీజేపీ కార్యకర్త వ్యక్తి కోసం కాకుండా.. పార్టీ కోసమే పని చేయాలి. వర్గ రాజకీయాలు చేసే వారికి భవిష్యత్తు ఉండదు. వర్గ రాజకీయాలను ఎప్పుడు ప్రోత్సహించం. అన్ని వర్గాలు మోదీ వర్గంగా మారాలి’ అని బండి సంజయ్ చెప్పారు.
పార్టీ కోసం పనిచేసిన వారికే మొదటి ప్రాధాన్యం..
పార్టీ కోసం పని చేసిన వారికి మొదటి ప్రాధాన్యం ఉంటుంది. పార్టీ ఎజెండా కోసం కార్యకర్తలు పని చేయాలి. ఎక్కడ లేని సమస్య కరీంనగర్ లోనే ఎందుకు వస్తోంది. హుజురాబాద్ నాకు తక్కువ ఓట్లు వచ్చేందుకు ప్రయత్నం చేశారు. నా దగ్గరకు వచ్చిన ప్రతి కార్యకర్తకు నిధులు ఇస్తున్నా. పార్టీ జెండా కోసం మాత్రమే పని చేయాలి. ప్రతి గ్రామపంచాయతీకి నిధులు ఇచ్చిన ఎంపీ నేనే’ అని ఆయన పేర్కొన్నారు.
ఒక్కొక్క మండలానికి రూ.2కోట్ల నిధులు ఇచ్చా..
టెక్నికల్ ప్రాబ్లెమ్ వల్ల కొన్ని గ్రామపంచాయతీలకు నిధులు రాలేదు. ఒక్కొక్క మండలానికి రూ. కోటి నుంచి రూ. 2 కోట్ల వరకు నిధులు ఇచ్చాను. ఎంపీ ల్యాడ్స్ కూడా అందజేస్తున్నా.. పార్టీ కోసం కష్టపడినా కార్యకర్తలను నేను ఆదుకుంటా. బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఒక్కటి గుర్తుంచుకోవాలి. వర్గ రాజకీయాలకు దూరంగా ఉండండి. అలా చేస్తే భవిష్యత్తు ఉండదు’ అని కేంద్ర మండి బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
ALSO READ: CM Revanth Reddy: కేసీఆర్ కుటుంబాన్ని వదిలిపెట్టేదేలే.. మొత్తం బయటపెడతా: సీఎం రేవంత్
ALSO READ: MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు.. షాక్‌లో బీఆర్ఎస్ అగ్రనేతలు