Nagarjuna : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ స్టార్ హీరోస్ లో నాగార్జున ఒకరు. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున వీలు ముగ్గురు ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి నాలుగు స్తంభాల నిల్చుని కొంతకాలం పాటు సినిమా పరిశ్రమలను నడిపారు. ఇక ప్రస్తుతం కూడా యాక్టివ్ గానే సినిమాలు చేస్తున్నారు.ఈ నలుగురు హీరోలలో నాగర్జున ది ఒక ప్రత్యేకమైన శైలి.
నాగార్జున అన్ని రకాల జోనర్స్ లో సినిమాలు చేశారు. యాక్షన్ ఫిలిం, గీతాంజలి లాంటి లవ్ స్టోరీ, అన్నమయ్య లాంటి భక్తి సినిమా, ఇలా అన్ని జోనర్స్ లో సినిమా చేశారు. తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు పేరుని సక్సెస్ఫుల్ గా నిలబెట్టాడు. రీసెంట్ గా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన కూలీ సినిమాలో వెళ్ళను పాత్ర కూడా వేశారు. అయితే నాగార్జున క్యారెక్టర్ గురించి ఇప్పటికి సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తుంది. సరిగ్గా నాగార్జునను వాడుకోలేదు అంటూ లోకేష్ ని అంటున్నారు.
ఏఎన్నార్ కళ్లల్లో నీళ్లు
ప్రతి తండ్రి తమ కొడుకు ఇదే చేయాలి అనే ఆలోచనలో ఉండరు. వాళ్లకంటూ ఒక సొంత కల వుంటుంది దానిని నమ్ముకుని ముందుకు వెళ్ళని అని కొంతమంది వదిలేస్తుంటారు. అయితే తండ్రి కల కొడుకు కల ఒకటే అయినప్పుడు వచ్చే కిక్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఇక అక్కినేని నాగార్జున విషయానికి వస్తే తను ఇంజనీరింగ్ చదువుకున్నారు. ఆ తర్వాత నేను నటుడు అవుతాను అని ఏఎన్ఆర్ తో చెప్పారట. అలా చెప్పిన వెంటనే ఏఎన్నార్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయట. అప్పుడు నాగార్జున తనకు తానుగా రియలైజ్ అయ్యాడు. నేను నటుడు అవ్వడమే ఆయన కల అని నాకు అప్పుడే అర్థమైంది అంటూ రీసెంట్ గా ఒక టాక్ షోలో చెప్పారు నాగార్జున.
ఏఎన్ఆర్ రియాక్షన్
నాగార్జున నేను నటుడు అవుతాను అని చెప్పిన వెంటనే అక్కినేని నాగేశ్వరరావు ‘ ఇది చాలా ఈజీ అని నువ్వు అనుకోకు, ఎందుకంటే నువ్వు అక్కినేని నాగేశ్వరరావు గారి కుమారుడివి. నువ్వు చాలా కష్టపడాలి, అలానే నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలి ‘ అని చెప్పారట నాగేశ్వరరావు. ఆయన చెప్పిన మాదిరిగానే నాగార్జున కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలి ఏర్పాటు చేసుకొని మంచి గుర్తింపు సాధించుకున్నారు. టాలెంట్ లేకపోతే ఎక్కువకాలం ఇండస్ట్రీలో నిలబడటం కష్టం. వారసత్వం అనేది సినిమా ఓపెనింగ్ వరకు, అలానే ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ తెగడం వరకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఆ తరువాత అంతా కూడా సొంత టాలెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ టాలెంట్ ఉంది కాబట్టి ఇప్పటికీ నాగార్జున సక్సెస్ఫుల్ గా కొనసాగుతున్నారు.
Also Read: Nagarjuna: ఆ క్యారెక్టర్ కి జగపతిబాబు అని పిలవకండి, నాగార్జున స్ట్రీట్ వార్నింగ్