Monsoon Effect: భారత్ కు ఆయువుపట్టైన నైరుతి రుతుపవనాల విషయంలో ఈ ఏడాది ఓ అసాధారణ మార్పు జరిగింది. అదేంటంటే.. ఈ రుతుపవనాలు హిమాలయాల దాకా వెళ్లి ఆగిపోయి తిరిగి ఈశాన్య రుతుపవనాలుగా అక్టోబర్, నవంబర్ లో వర్షాలకు కారణమవుతాయి. కానీ ఈ సారి మాత్రం పరిస్థితులు అలా కనిపించట్లేదు. మన నైరుతి చేజారిపోయే ప్రమాదాలు కనిపిస్తున్నాయ్. సహజంగా అడ్డుకోవాల్సిన హిమాలయాలు చేతులెత్తేశాయ్. నేపాల్, భూటాన్ దాటి టిబెట్ వరకూ విస్తరించాయి. అంటే మనకు డిజాస్టర్ లోడింగ్ అవుతున్నట్లేనా?
ఈ ఏడాది టిబెట్ దాకా రుతుపవనాల విస్తరణ
ఈ ఏడాది సెప్టెంబర్ తొలివారంలో నైరుతి రుతుపవనాలు హిమాలయ పర్వతాలను దాటి టిబెట్ పీఠభూమికి చేరాయని సైంటిస్టులు నిర్ధారించారు. అంటే ఇది అసాధారణం, అనూహ్యమే. రుతురాగాలు శ్రుతి తప్పాయనడానికి ఈ శాటిలైట్ మ్యాప్ నిదర్శనం అంటున్నారు. సాధారణంగా హిమాలయాలు ఈ రుతుపవనాలకు సహజ అడ్డంకిగా పనిచేస్తూ వర్షపాతాన్ని భారత్, నేపాల్, భూటాన్‌లలో కురిపించి, టిబెట్‌ను ఎప్పుడూ డ్రైగా ఉంచుతాయి. టిబెట్ లో ప్రధానంగా వింటర్ సీజన్ లో వెస్టర్న్ డిస్టర్బెన్స్‌లతో హిమపాతానికి కారణం అవుతుంది. సో ఇప్పుడు టిబెట్ ఏరియాల్లోనూ వర్షపాతం పెరగడం వాతావరణ మార్పులకు సంబంధించి ఇదో పెద్ద హెచ్చరికే.
ఈశాన్య రుతుపవనాలుగా తిరిగి రాక
నైరుతి రుతుపవనాలు జూన్ నుంచి సెప్టెంబర్ దాకా ఇండియాలో వర్షానికి కారణం. సముద్ర జలాలు వేడెక్కి నీరు ఆవిరై బంగాళాఖాతం, అరేబియా సముద్రం నుంచి వచ్చే తేమగాలులు నైరుతి రుతుపవనాల రూపంలో దేశమంతా విస్తరించి మన ఆర్థిక వ్యవస్థకు, వ్యవసాయ రంగానికి చాలా కీలకంగా ఉంటూ వస్తున్నాయి. ఇవి నార్త్ కు వచ్చే సరికి హిమాలయ పర్వత శ్రేణులు ఎత్తుగా, పెట్టని కోటలా అడ్డు నిలుస్తాయి. వీటిని టిబెట్ దాకా విస్తరించకుండా హిమాలయాలు అడ్డుకుంటాయి. టిబెట్‌ను పొడిగా ఉంచడంలో కీలకంగా మారుతాయి. ఎత్తైన హిమాలయాలను దాటుకుని ముందుకు వెళ్లలేక నైరుతి రుతుపవనాలు తిరిగి ప్రయాణం మొదలు పెడుతాయి. అవి ఈశాన్య రుతుపవనాలుగా మారుతాయి. వీటికి అల్పపీడనాలు తోడై నవంబర్, డిసెంబర్ లో వర్షాలు కురిపిస్తూ వెళ్తాయి. ఇదంతా బాగానే ఉంది. అయితే నైరుతి టిబెట్ దాకా వెళ్లడంతోనే ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇకపై మరో లెక్క అన్నట్లుగా సీన్ తయారైంది.
వెస్ట్రస్ డిస్టర్బెన్స్‌తో హిమాలయాలు క్రాస్
వాడియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ గ్లేసియాలజిస్ట్ మనీష్ మెహతా సహా ఇతర సైంటిస్టులు ఈ రుతుపవనాలు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, లడాఖ్ ప్రాంతాల నుంచి టిబెట్ వరకు వెళ్లడం అబ్జర్వ్ చేశారు. ఇది మొదటిసారి జరిగినట్టు WIHG సైంటిస్టులు చెబుతున్న మాట. ఇది అసాధారణం అరుదైనదంటున్నారు. చరిత్రలో ఇలాంటి ఘటనలు గతంలో అత్యంత అరుదుగా జరిగినప్పటికీ, 2025లో ఇది మాస్ స్కేల్‌లో జరిగి టిబెట్‌లో వర్షాలకు కారణమైందని ఐడెంటిఫై చేశారు. వీటికి తోడు వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ ఎఫెక్ట్ తో సంఘర్షణ కారణంగా తేమ గాలి 2000 మీటర్ల ఎత్తు దాటి టిబెట్ వైపు వెళ్లిందంటున్నారు.
వాతావరణ మార్పులు, భూతాపం కారణం
సో ఇలా నైరుతి ఈసారి టిబెట్ దాకా వెళ్లడానికి చాలా కారణాలు ఉన్నాయంటున్నారు. వాతావరణ మార్పులు, భూతాపం ప్రధాన కారణంగా చెబుతున్నారు. గ్రీన్‌హౌస్ వాయువులతో భూమి, సముద్రాలు వేడెక్కడం వల్ల హిమాలయాల్లో మంచు కరగడం, మిగితా ఏరియాల్లో స్నో లాండ్ కవర్ తగ్గడం ఇవన్నీ సమస్యలను పెంచుతున్నాయి. పర్వతాల్లో తక్కువ ఎత్తులో ఉన్న చోటి నుంచి రుతుపవనాలు వెళ్లి ఉండొచ్చంటున్నారు. వేగంగా వీచే గాలులు ఈ రుతుపవన తేమను హై అల్టిట్యూడ్‌కు తీసుకెళ్లి హిమాలయాలను దాటించేశాయంటున్నారు. వీటికి తోడు లా నినా ఎఫెక్ట్, పొల్యూషన్ రుతుపవనాలను తీవ్రం చేశాయి. వాడియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ స్టడీ ప్రకారం గత 10 సంవత్సరాల అధ్యయనంలో తొలిసారి 100 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందంటున్నారు. అలాగే ఈ ఏడాది ఉత్తరాఖండ్, హిమాచల్, జమ్మూ కాశ్మీర్ లో 108 నుంచి 114% అధిక వర్షపాతం నమోదైంది.
భారత్‌లో 80% వర్షం నైరుతితోనే
సో ఇప్పుడు సమస్యేంటంటే.. భారత్ లో 80% వర్షం నైరుతి రుతుపవనాలే కవర్ చేస్తాయి. ఇవే మన ఆశ, శ్వాస అన్న మాట. ఇవి కాస్తా వర్షాన్ని టిబెట్ ఆ తర్వాత దాకా తీసుకెళ్తే మాత్రం మన దగ్గర రెయిన్ ఫాల్ పై ఎఫెక్ట్ కచ్చితంగా ఉంటుంది. పైగా పొడిగా ఉండే టిబెట్ ఏరియాలో అధిక వర్షపాతంతో అక్కడ పర్యావరణం మారుతుంది. అంతే కాదు దక్షిణాసినా వెదర్ సైకిల్స్ కూడా మారి పెద్ద పెద్ద డిజాస్టర్లు జరిగే ప్రమాదం కూడా లేకపోలేదంటున్నారు వెదర్ సైంటిస్టులు. రుతుపవనాల గాలులు టిబెట్ దాకా వెళ్లడం శాటిలైట్ మ్యాప్ లో చిన్న మార్పులా కనిపించవచ్చు. వాస్తవానికి, దక్షిణాసియా వాతావరణాన్ని మొత్తం మార్చేస్తుందనడానికి ఇదో సంకేతం. ఒకప్పుడు అడ్డుగోడగా ఉన్న హిమాలయాలు ఇకపై దాన్ని ఆపకపోవచ్చు. అదే జరిగితే ఎలాంటి ముప్పు రావొచ్చు.
వెస్టర్న్ డిస్టర్బెన్స్, రుతుపవనాల సంఘర్షణ
నైరుతి రుతుపవనాలకు వెస్టర్న్ డిస్టర్బెన్స్‌లు పెద్ద ఎఫెక్ట్ గా మారుతున్నాయి. ఈ రెండు గాలుల మధ్య సంఘర్షణతో గేమ్ మారుతోంది. అయితే క్లౌడ్ బరస్ట్ లు లేదంటే రుతుపవనాలు వేగంగా హద్దులు దాటి వెళ్లిపోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. ఒక్కసారి ఈ ఏడాది జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ లో జరిగిన క్లౌడ్ బరస్ట్ లను చూడండి.. చాలా పెద్ద సమస్యలు సృష్టించాయి. ఊళ్లకు ఊళ్లు కొట్టుకుపోయాయి. జనం చనిపోయారు కూడా. ఈనెలంతా క్లౌడ్ బరస్ట్ ముప్పు ఉంది. ఈ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ మధ్య ఆసియా, మెడిటరేనియన్ ప్రాంతాల నుంచి మొదలై, భారత్ వైపు ప్రయాణిస్తాయి. ఇవి సాధారణంగా వింటర్ లో నార్త్ ఇండియాలో వర్షం, మంచు కురిపిస్తాయి. ఈ ఏడాది మాత్రమే ముందుగానే వచ్చి ఎక్కువ మొత్తంలో ఎఫెక్ట్ చూపడంతో చాలా వరకు వెదర్ కండీషన్స్ మారిపోయాయి. భూతాపం, వాతావరణ మార్పుల వల్ల వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా వస్తున్నాయంటున్నారు ఎక్స్ పర్ట్స్. గతంలో 4-6 వరకే ఈ తరహావి ఉంటే ఈ ఏడాది 19 దాకా ఇలాంటి సంఘర్షణలు జరిగాయి. దీంతో వెదర్ ప్యాట్రన్స్ అన్నీ షేక్ అయ్యాయి. ఇది సాధారణం కంటే ఎక్కువ. ఇందులో మూడు సెప్టెంబర్ మొదటి వారంలోనే సంభవించాయి. ఈ ఎఫెక్ట్ తేమతో కూడిన రుతుపవన గాలులతో కలిసి హిమాలయాలను దాటి నైరుతిని తీసుకెళ్లాయి. హిమాచల్, ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్, లఢాక్ వంటి చోట్ల క్లౌడ్ బరస్ట్ లకూ దారి తీశాయి.
గ్రీన్ హౌస్ గ్యాసెస్‌తో భూ ఉష్ణోగ్రత పెరుగుదల
గ్రీన్‌హౌస్ గ్యాసెస్ భూమి ఉష్ణోగ్రతను పెంచుతున్నాయి. ఈ వేడి కారణంగా హిమాలయాలు టిబెట్‌లలో మంచు తగ్గుతోంది. దీంతో రుతుపవనాలు ఈ ఏరియాల్లో అడ్వాన్స్ అవుతున్నాయి. తేమ ఈజీగా పర్వతాల పైనుంచి వెళ్లేలా చేస్తున్నాయి. అయితే ఈ నైరుతి టిబెట్ దాకా వెళ్లడానికి హిమాలయాల్లోని కొన్ని తక్కువ ఎత్తులో ఉన్న రూట్లు ఉండి ఉండొచ్చని, అందుకే అవి అక్కడిదాకా వెళ్లి ఉంటాయని కొందరు సైంటిస్టులు నమ్ముతున్నారు. వీటిపై మరింత స్టడీ అవసరం అని చెబుతున్నారు. గత కొన్ని శతాబ్దాలుగా నైరుతి రుతుపవనాలను అడ్డుకున్న హిమాలయాలు ఇప్పుడు చేతులెత్తేస్తున్నాయి. ఇది దక్షిణాసియా వాతావరణంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందంటున్నారు. నిజానికి టిబెట్ తక్కువ వర్షపాతం కలిగిన ప్రాంతం. రుతుపవనాలతో భారీ వర్షాలు అక్కడికి క్రమం తప్పకుండా చేరుకోవడం మొదలైతే గనక అక్కడి పర్యావరణ వ్యవస్థ అంటే మొక్కలు, జంతువులు నీటి వనరుల తీరు మారవచ్చంటున్నారు. మన దేశానికి నైరుతే ప్రధాన దిక్కు. భారత్ లో 80% వర్షపాతం రుతుపవనాల ద్వారానే కురుస్తుంది. ఇది వ్యవసాయానికి, మన ఆర్థిక వ్యవస్థకు చాలా కీలకం. ఈ వర్షపాతం హిమాలయాలను దాటి టిబెట్‌కు వెళ్తే, మన దగ్గర వర్షపాతం తగ్గవచ్చు. ఇది వ్యవసాయం నీటి లభ్యతను ప్రభావితం చేస్తుంది.
గ్లేసియర్స్‌లోని మంచు కరిగే ప్రమాదం
ఇదొక్కటే కాదు నైరుతి రుతుపవనాలు మున్ముందు ఇలాగే టిబెట్ చేరుతూ అక్కడ తరచూ వర్షాలు కురిపించడం మొదలు పెడితే.. గ్లేసియర్స్ లోని మంచు కరగడం, నదీ ప్రవాహాల తీరులోనూ మార్పులు జరగడం ఇవన్నీ కామన్ అయ్యే ప్రమాదం ఉంది. సమస్యలు పెరుగుతాయి. తాగునీటి కటకట పెరిగినా ఆశ్చర్యపోనవసరం లేదన్న వాదన కూడా ఉంది. నిజానికి నైరుతి రుతుపవనాలనే నమ్ముకుని మనుగడ సాగిస్తున్న దేశం మనది. ఏదో ఒక సీజన్లో రుతుపవనాలు ముఖం చాటేసినా తర్వాత సంవత్సరంలోనైనా మంచి వానలు పడకపోతాయా అని ఆశగా ఎదురుచూస్తారు మన రైతులు. మరి అలాంటి నైరుతి ఒక్కసారి హిమాలయాలు దాటి టిబెట్ దాకా వెళ్లాయంటే.. ఇక వెనక్కు తిరిగి రావు. ఎందుకంటే హిమాలయాల కంటే పెద్ద అడ్డుగోడలు లేవు. అదే జరిగితే ఈశాన్య రుతుపవనాలు అనేవే ఉండవు. మనం వాటిని మర్చిపోవాల్సిందే. ఒకవేళ కొంత భాగం తిరిగొచ్చినా తేమలేని, బలహీన పవనాలతో కురిసే వర్షాలు, కలిగే ప్రయోజనం అంతంతే.
Also Read: నేటి నుంచి దేశవ్యాప్తంగా స్వస్థ్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్
సో నైరుతి రుతుపవనాలు అటే వెళ్లిపోతే ఒక్క భారత్ పైనే ప్రభావం కాదు.. హిమాలయాలలో ఫ్లాష్ ఫ్లడ్స్, కొండచరియలు విరిగిపడటం, పర్యావరణానికి ముప్పు ఇలాంటివెన్నో రిస్కులు ఉంటాయి. టిబెట్‌లో క్రమం తప్పకుండా వర్షాలు కురిస్తే, అక్కడి పొడి వాతావరణం మారవచ్చు. ఇది హిమానీ నదాలు కరగడం, నదుల ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది. సో ఈ ముప్పులతో జాగ్రత్త పడాలంటే.. వెదర్ సైంటిస్టులు ఈ మార్పులను అర్థం చేసుకునేలా భవిష్యత్తును అంచనా వేసేలా కొత్త వెదర్ మోడల్స్ ను సృష్టించాలి.
Story By Vidya Sagar, Bigtv