E-Paper

మళ్లీ థియేటర్లలో ‘ఆల్ ఈజ్ వెల్’.. రెండు దశాబ్దాల తర్వాత ‘3 ఇడియట్స్’ మ్యాజిక్!

మళ్లీ థియేటర్లలో ‘ఆల్ ఈజ్ వెల్’.. రెండు దశాబ్దాల తర్వాత ‘3 ఇడియట్స్’ మ్యాజిక్!
Advertisement

3 Idiots Sequel Confirmed: ‘3 ఇడియట్స్’…ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే కాకుండా, సగటు ప్రేక్షకుని గుండెల్లో చెరగని ముద్ర వేసిన క్లాసిక్ ల్యాండ్‌మార్క్ ఫిలిమ్.రాంచో, ఫర్హాన్, రాజుల ఫ్రెండ్ షిప్ ని  విద్యావ్యవస్థలోని లోపాలను కళ్లకు కట్టినట్టు చూపించిన కల్ట్ క్లాసిక్ రిలీజ్ ఇన్నేళ్లయినా క్రేజ్ అస్సలు తగ్గలేదు. ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త సెన్సేషన్ అవుతుంది.అదే ఈ సినిమాకి సీక్వెల్ మళ్ళీ వస్తుంది అని. అయితే  దీనిపై ఎట్టకేలకు బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ అధికారికంగా స్పందించి, సినీ ప్రియులకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు.

తనదైన శైలిలో ఫుల్ స్టాప్ పెట్టిన హిరానీ 

ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్‌కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ శరవేగంగా జరుగుతోందని, త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోందని ఆయన ప్రకటించారు. దీంతో ఇటు అమిర్ ఖాన్ అభిమానులతో పాటు అటు సినిమా లవర్స్ అంతా ఫుల్ జోష్‌లో మునిగిపోయారు. అయితే ఇదే సమయంలో మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని రూమర్లకు ఆయన తనదైన శైలిలో ఫుల్ స్టాప్ పెట్టారు. ఈ చిత్రంలో నాలుగో ఇడియట్‌గా యంగ్ స్టార్ విక్కీ కౌశల్ ఎంట్రీ ఇస్తున్నాడని, ఈ సినిమాకు ‘4 ఇడియట్స్’ అనే టైటిల్ పరిశీలనలో ఉందంటూ వస్తున్న కథనాలపై హిరానీ నవ్వుతూ క్లారిటీ ఇచ్చారు. ఆ పేరు తాను పెట్టలేదని, కేవలం మీడియా సృష్టించిన రూమర్లె అని కొట్టిపారేశారు.

2009 డిసెంబర్ 25న విడుదలైన ‘3 ఇడియట్స్

Advertisement

ఈ కథ సరిగ్గా మొదటి భాగం ఎక్కడ ముగిసిందో, అక్కడి నుంచి సరిగ్గా 20 ఏళ్ల తర్వాత సాగే కాలక్రమంలో ఉంటుందని స్పష్టం చేశారు. అంటే రెండు దశాబ్దాల తర్వాత ఈ ముగ్గురు మిత్రుల జీవితాలు ఎలా మారాయి, వారి ప్రయాణం ఏ తీరాలకు చేరిందనే ఇంట్రెస్టింగ్ పాయింట్‌తోనే సీక్వెల్ తెరకెక్కనుందన్న మాట. గతంలో రాజ్‌కుమార్ హిరానీ 2003లో ‘మున్నాభాయ్ MBBS’, 2006లో ‘లగే రహో మున్నాభాయ్’, 2014లో ‘పీకే’ వంటి ఇండస్ట్రీ హిట్లను అందించారు. అయితే 2009 డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా విడుదలైన ‘3 ఇడియట్స్’ సృష్టించిన ప్రభంజనం వేరు.

also read :అరబిక్ చిత్రసీమలోకి AR రెహమాన్ అడుగు.. ‘బాబ్’ ఒరిజినల్ సౌండ్‌ట్రాక్ రిలీజ్!

Advertisement

ఆ కాలంలోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 400 కోట్లకు పైగా వసూలు చేసి సరికొత్త రికార్డులను స్ప్రుష్టించింది. చైనా, జపాన్ వంటి అంతర్జాతీయ మార్కెట్లలోనూ భారీ వసూళ్లు సాధించిన తొలి భారతీయ సినిమాగా నిలిచింది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ అదే మ్యాజిక్‌ను రిపీట్ చేసేందుకు అమిర్ ఖాన్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడని టాక్.

శాంతను మోయిత్రా అందించిన మ్యూజిక్ ఇప్పటికీ ఎవర్గ్రీన్

ఇటీవల అమిర్ ఖాన్ స్వయంగా మాట్లాడుతూ, హిరానీ తనతో ఒక అద్భుతమైన ఐడియాను షేర్ చేసుకున్నారని, తామంతా  సిద్దంగా ఉన్నామని పేర్కొన్నారు. రాంచో, ఫర్హాన్, రాజుల పాత్రలను మళ్లీ జనరేషన్ మార్పుతో చూపించడం పెద్ద ఛాలెంజ్ అయినప్పటికీ, కథలో స్ట్రాంగ్ ఎమోషన్ ఉంటేనే ఖచ్చితంగా ముందుకు వెళ్తామని ఆయన నొక్కి చెప్పారు. ఒరిజినల్ వెర్షన్‌లో అమిర్ ఖాన్, ఆర్‌ మాధవన్, శర్మన్ జోషి లీడ్ రోల్స్ చేయగా, కరీనా కపూర్ ఖాన్, బోమన్ ఇరానీ (వైరస్), మోనా సింగ్, అలీ ఫజల్ వంటి వారు తమ నటనతో మెప్పించారు. శాంతను మోయిత్రా అందించిన మ్యూజిక్, ఆల్బమ్ ఇప్పటికీ ఎవర్గ్రీన్.

also read :మైథలాజికల్ మిస్టరీతో వస్తున్న ‘నాగబంధం’.. ట్రైలర్‌తోనే మైండ్ బ్లాక్ చేసిన విరాట్ కర్ణ!

హిరానీ లైనప్‌లో ఇటీవల వచ్చిన ‘డంకీ’ (2023) తర్వాత ఆయన పూర్తి ఫోకస్ ఈ సీక్వెల్‌పైనే పెట్టడం విశేషం. ఏదేమైనా ఆల్ ఈజ్ వెల్ అంటూ థియేటర్లలో సందడి చేసిన ఈ క్లాసిక్ గ్యాంగ్, రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ ఎలాంటి సరికొత్త సందేశంతో, ఎంటర్టైన్‌మెంట్‌తో రాబోతుందో చూడాలి.

Related News

మహేష్ బాబు సినిమా తర్వాత రాజమౌళి నెక్స్ట్ టార్గెట్.. మళ్లీ ఆ హీరోతోనేనా?

అరబిక్ చిత్రసీమలోకి AR రెహమాన్ అడుగు.. ‘బాబ్’ ఒరిజినల్ సౌండ్‌ట్రాక్ రిలీజ్!

మైథలాజికల్ మిస్టరీతో వస్తున్న ‘నాగబంధం’.. ట్రైలర్‌తోనే మైండ్ బ్లాక్ చేసిన విరాట్ కర్ణ!

పవన్ కళ్యాణ్ కాళ్లు కడిగినా మీకు ఆ అర్హత రాదు.. పేర్ని నానికి కిరాక్ ఆర్పీ లెఫ్ట్ అండ్ రైట్!

డబ్బుంది కదా అని బిల్డప్ లేదు.. నడిరోడ్డుపై నిద్రపోయిన బాలీవుడ్ సెలబ్రిటీ..

షారుక్ మాటతో 42 లక్షల బిల్లు మాఫీ..కట్ చేస్తే ఇప్పుడు 80 కోట్ల సినిమా

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. స్టార్ హీరో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు!

Big Stories

×