E-Paper

Black Rain: ఆకాశం నుంచి కురుస్తున్న మరణ శాసనం.. బ్లాక్ రెయిన్ దెబ్బకు మాస్కో వదిలి పారిపోతున్న జనం!

Black Rain: ఆకాశం నుంచి కురుస్తున్న మరణ శాసనం.. బ్లాక్ రెయిన్ దెబ్బకు మాస్కో వదిలి పారిపోతున్న జనం!
Advertisement

Black Rain: వరల్డ్ వైడ్ డిబేట్‌కు దారితీసిన బ్లాక్ రెయిన్ దృశ్యాలివి! వైట్ కార్లన్నీ.. బ్లాక్‌గా మారిపోయాయ్. తెల్లని బిల్డింగులు, అపార్ట్‌మెంట్లన్నీ నలుపు రంగులో కనిపిస్తున్నాయ్. రోడ్లపై నల్లటి నీరు ప్రవహిస్తోంది. మాస్కోలో ఎటువైపు చూసినా.. ఇవే సీన్లు. రష్యా రాజధాని మాస్కోతో పాటు ఆ పరిసర ప్రాంతాల్లోని.. క్రూడ్ ఆయిల్ రిఫైనరీలు, కీలక మౌలిక సదుపాయాలు, ఇతర ప్రాంతాలను టార్గెట్ చేసి.. ఉక్రెయిన్ భారీ ఎత్తున డ్రోన్ దాడులు నిర్వహించిన కొద్ది గంటల్లోనే ఈ విచిత్ర పరిస్థితులు చోటు చేసుకున్నాయ్. వందల సంఖ్యలో డ్రోన్లు ఒకేసారి దాడి చేయడంతో.. ఆకాశమంతా నల్లటి పొగతో కప్పుకుపోయింది. తర్వాత కొన్ని గంటల్లోనే బూడిదతో కూడిన నల్లటి వర్షం కురిసింది. ఈ వర్షంలో కాలుష్య కణాలు, బూడిద మిశ్రమంతో ఉందని స్థానికులు చెబుతున్నారు.

విమాన సర్వీసులు రద్దు..

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో.. ఈ మధ్యకాలంలో జరిగిన భీకర దాడి ఇది. మాస్కోపై వందల డ్రోన్లతో విరుచుకుపడింది. యుద్ధం మొదలయ్యాక ఉక్రెయిన్ ఇంత భారీస్థాయిలో దాడి చేయటం ఇదే తొలిసారి. క్రెమ్లిన్‌కు కేవలం 15 కిలోమీటర్ల దూరంలోని.. మాస్కో ఆయిల్ రిఫైనరీ కంపెనీని దెబ్బతీసింది. అది మంటల్లో చిక్కుకోవడంతో మాస్కో వ్యాప్తంగా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఈ దెబ్బతో.. మాస్కోలోని 4 ఎయిర్‌పోర్టులు తాత్కాలికంగా మూతపడ్డాయ్. 500లకు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయ్. డ్రోన్ శకలాలతో మాస్కోలో చాలా భవనాలు దెబ్బతిన్నాయ్. పదుల సంఖ్యలో జనం గాయపడ్డారు. అయితే, మొత్తంగా 550కి పైగా డ్రోన్‌లను తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ తిప్పికొట్టాయని రష్యా రక్షణ శాఖ తెలిపింది. కజన్ సిటీలో ఏషియన్ నేషనల్ సమ్మిట్ జరగటానికి కొన్ని గంటల ముందు ఈ దాడి జరగడం కలకలం రేపింది. పుతిన్‌ని చర్చలకు రప్పించే ప్రయత్నాల్లో భాగంగానే.. మాస్కోపై దాడులు చేశామని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ తెలిపారు.

నల్లటి వర్షంలా..

Advertisement

రష్యాపై ఉక్రెయిన్ జరిపిన భారీ డ్రోన్ దాడి ఎంతో సంచలనంగా మారింది. ఇప్పుడు.. ఆ దాడి తర్వాత కురుస్తున్న బ్లాక్ రెయిన్ కూడా వరల్డ్ వైడ్ హాట్ డిబేట్‌కు దారితీసింది. మాస్కోలోని ఆయిల్ రిఫైనరీపై డ్రోన్ దాడి జరగడంతో.. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయ్. ఆకాశమంతా దట్టమైన నల్లటి పొగ ఆవరించింది. ఆ పొగలోని మసి, హైడ్రోకార్బన్ కణాలు వాతావరణంలోని తేమతో కలిసి.. మాస్కోలోని చాలా చోట్ల నల్లటి వర్షంలా కురుస్తోంది. ఇలాంటి వర్షాలు ప్రమాదకరమని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. గాలిలోకి ఎగసిన కాలుష్య కణాలు, బూడిద.. వర్షపు నీటితో కలిసి నేలని తాకుతోంది. దాంతో.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే మాస్కో అధికారులు ప్రజలకు కీలక సూచనలు చేశారు. బ్లాక్ రెయిన్స్ కురుస్తున్న సమయంలో.. ఇళ్ల తలుపులు, కిటికీలు మూసి ఉంచాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, ఆస్తమాతో పాటు ఇతర శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు.. బ్లాక్ రెయిన్ ప్రభావిత ప్రాంతాలను విడిచి వెళ్లిపోవాలని సూచించారు.

Also read: South Telangana: ఆ నాలుగు జిల్లాలపై గులాబీ దళం నయా స్కెచ్.. పట్టు కోసం కేటీఆర్ వేసిన స్కెచ్ ఇదే..?

ఇంధన అవశేషాలు..

Advertisement

ఇప్పటికే.. మాస్కోలో నల్లటి వర్షం కారణంగా ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లు రిపోర్ట్స్ వస్తున్నాయ్. బ్లాక్ రెయిన్ కారణంగా మాస్కో వాసుల్లో తలనొప్పి, శ్వాస సమస్యలు తలెత్తుతున్నాయ్. వాహనాలు, రోడ్లపై కలుషిత జలాలు పేరుకుపోతున్నాయ్. నల్లటి వర్షంలో కార్బన్ కణాలు, సల్ఫర్ కాంపౌండ్స్, పాక్షికంగా కాలిన ఇంధన అవశేషాలు ఉంటాయి. గాల్లో ఉండే ఈ సూక్ష్మ కణాలను పీల్చడం వల్ల ఆస్తమా, బ్రోన్కైటిస్ ఉన్నవారికి శ్వాస తీసుకోవడం చాలా కష్టమవుతోంది. ఈ ఆయిల్ మిశ్రమ వర్షపు జల్లులు ఒంటిపై, కళ్లలో పడితే మంటలు, అలర్జీలు, స్కిన్ రాషెస్ వచ్చే ప్రమాదముంది. పైగా.. వాహనాలు, ఇళ్లు, రోడ్లపై నల్లటి జిడ్డు పొరలా ఇది పేరుకుపోతోంది. లోకల్ వాటర్ రిజర్వాయర్లు, మట్టిలోకి ఈ కెమికల్స్ చేరడం వల్ల తాగునీరు, పర్యావరణం కలుషితమవుతాయి.

వాతావరణ నిపుణులు అంచనా..

బ్లాక్ రెయిన్ వల్ల మాస్కోలో ప్రస్తుతానికి ఆరోగ్య సంక్షోభం ఏమీ రాలేదు గానీ, ప్రమాదం పూర్తిగా తప్పిందని మాత్రం చెప్పలేం. ఈ పరిస్థితుల నుంచి బయపడేందుకు అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకుంటోంది. మరో రెండు, మూడు రోజుల పాటు ఈ మసి రేణువుల ప్రభావం గాల్లో ఉండే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాబట్టి, మాస్కో వాసులు బ్లాక్ రెయిన్ జల్లుల్లో తడవకుండా, బయట తిరిగేటప్పుడు మాస్కులు ధరిస్తూ తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

ఆయిల్ రిఫైనరీపై డ్రోన్ దాడి..

రష్యాపై ఉక్రెయిన్ జరిపిన భారీ డ్రోన్ దాడి ఎంతో సంచలనంగా మారింది. ఇప్పుడు ఆ దాడి తర్వాత కురుస్తున్న బ్లాక్ రెయిన్ కూడా వరల్డ్ వైడ్ హాట్ డిబేట్‌కు దారితీసింది. మాస్కోలోని ఆయిల్ రిఫైనరీపై డ్రోన్ దాడి జరగడంతో.. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయ్. ఆకాశమంతా దట్టమైన నల్లటి పొగ ఆవరించింది. ఆ పొగలోని మసి, హైడ్రోకార్బన్ కణాలు వాతావరణంలోని తేమతో కలిసి.. మాస్కోలోని చాలా చోట్ల నల్లటి వర్షంలా కురుస్తోంది. ఇలాంటి వర్షాలు ప్రమాదకరమని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. గాలిలోకి ఎగసిన కాలుష్య కణాలు, బూడిద.. వర్షపు నీటితో కలిసి నేలని తాకుతోంది. దాంతో.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే మాస్కో అధికారులు ప్రజలకు కీలక సూచనలు చేశారు. బ్లాక్ రెయిన్స్ కురుస్తున్న సమయంలో.. ఇళ్ల తలుపులు, కిటికీలు మూసి ఉంచాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, ఆస్తమాతో పాటు ఇతర శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు.. బ్లాక్ రెయిన్ ప్రభావిత ప్రాంతాలను విడిచి వెళ్లిపోవాలని సూచించారు.

ఆయిల్ మిశ్రమ వర్షపు జల్లులు..

ఇప్పటికే.. మాస్కోలో నల్లటి వర్షం కారణంగా ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లు రిపోర్ట్స్ వస్తున్నాయ్. బ్లాక్ రెయిన్ కారణంగా మాస్కో వాసుల్లో తలనొప్పి, శ్వాస సమస్యలు తలెత్తుతున్నాయ్. వాహనాలు, రోడ్లపై కలుషిత జలాలు పేరుకుపోతున్నాయ్. నల్లటి వర్షంలో కార్బన్ కణాలు, సల్ఫర్ కాంపౌండ్స్, పాక్షికంగా కాలిన ఇంధన అవశేషాలు ఉంటాయి. గాల్లో ఉండే ఈ సూక్ష్మ కణాలను పీల్చడం వల్ల ఆస్తమా, బ్రోన్కైటిస్ ఉన్నవారికి శ్వాస తీసుకోవడం చాలా కష్టమవుతోంది. ఈ ఆయిల్ మిశ్రమ వర్షపు జల్లులు ఒంటిపై, కళ్లలో పడితే మంటలు, అలర్జీలు, స్కిన్ రాషెస్ వచ్చే ప్రమాదముంది. పైగా.. వాహనాలు, ఇళ్లు, రోడ్లపై నల్లటి జిడ్డు పొరలా ఇది పేరుకుపోతోంది. లోకల్ వాటర్ రిజర్వాయర్లు, మట్టిలోకి ఈ కెమికల్స్ చేరడం వల్ల తాగునీరు, పర్యావరణం కలుషితమవుతాయి.

Also read: వీడియో కాన్ఫరెన్స్ కుదరదు.. అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు బిగ్ షాక్!

Related News

Mekedatu Project: తమిళనాడు రైతుల జోలికొస్తే ఊరుకోం.. ప్రధాని మోదీని కలిసిన సీఎం విజయ్ ఏం కోరారంటే..?

Yoga Benefits: ఫోన్ చూస్తూ డిప్రెషన్‌లోకి వెళ్తున్నారా?.. రోజుకు 10 నిమిషాల ఈ ట్రిక్‌తో మెదడు పవర్‌ఫుల్..!

NEET Reexam: నీట్ రీ-ఎగ్జామ్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. పిటిషన్లు కొట్టేస్తూ పరీక్షకు గ్రీన్ సిగ్నల్!

Paddy Procurement: దేశంలోనే టాప్ కానీ కొనుగోళ్లలో లాస్ట్.. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం సంచలన ఆంక్షలు..?

వీడియో కాన్ఫరెన్స్ కుదరదు.. అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు బిగ్ షాక్!

El Niño: నైరుతి రుతుపవనాలను మింగేస్తున్న ఎల్ నినో.. ఈ ఏడాది పంటలు దెబ్బతినే ఛాన్స్..!

Rythu Bharosa: తెలంగాణ రైతులకు పండగే పండగ.. 67 లక్షల మంది ఖాతాల్లోకి నిధులు..!

Big Stories

×