E-Paper
Advertisement

కాశ్మీర్ ఆపిల్స్ కోసం ప్రత్యేక రైళ్లు, ఇక ఫ్రెష్ ఫ్రూట్స్ తినేయండి బాస్!

కాశ్మీర్ ఆపిల్స్ కోసం ప్రత్యేక రైళ్లు, ఇక ఫ్రెష్ ఫ్రూట్స్ తినేయండి బాస్!
Advertisement

Special Trains for Kashmir Apples: కాశ్మీర్ ఆపిల్ రైతులకు ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. కాశ్మీర్ లోయలో పండే ఆపిల్స్ ను దేశ వ్యాప్తంగా తరలించేందుక ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. దేశంలోని పలు ప్రాంతాలకు వేగంగా, తక్కువ ఖర్చుతో ఈ రైల్వే ద్వారా ఆపిల్స్ సరఫరా చేయనుంది. ఇందుకోసం ప్రత్యేక సరుకు రవాణా రైళ్లను నడపాలని రైల్వేశాఖ నిర్ణయించింది. సెప్టెంబర్ 1 నుంచి ఈ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి.

ఆపిల్ రైతుల కోసం ప్రత్యేక రైళ్లు  

కాశ్మీర్‌ లో ఆపిల్ సాగు అనేది.. అక్కడి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మూలకారణంగా కొనసాగుతోంది. వేలాది కుటుంబాలు ఆపిల్ తోటల పెంపకం మీద ఆధారపడి జీవిస్తున్నాయి. పంటను వేగంగా, అనుకున్న సమయంలో  ఇతర రాష్ట్రాల్లోని మార్కెట్లకు పంపినప్పుడే మంచి రేటు లభిస్తుంది. అయితే, రోడ్డు రవాణా కారణంగా చాలాసార్లు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిపై వాతావరణ పరిస్థితులు రైతులకు నష్టాన్ని కలిగిస్తున్నాయి. కొండచరియలు, ఇతర కారణాలతో రాకపోకలు నిలిచిపోతే ట్రక్కులు రోజుల తరబడి రహదారిపైనే ఆగిపోతాయి. దీంతో పండ్లు పాడై రైతులు భారీగా నష్టపోవాల్సి వస్తోంది.

రైల్వేశాఖ ప్రత్యేక ఏర్పాట్లు

Advertisement

కాశ్మీర్ ఆపిల్ రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈసారి రైల్వే శాఖ ముందుగానే ఏర్పాట్లు చేస్తోంది. పంట కోత ప్రారంభమయ్యే సమయానికి ప్రత్యేక సరుకు రైళ్లను సిద్ధం చేయనున్నట్లు ప్రకటించింది.  ప్రత్యేక రైళ్ల ద్వారా కాశ్మీర్ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రతిరోజూ భారీ మొత్తంలో ఆపిల్ పండ్లను తరలించే అవకాశం ఉంది. రైలు రవాణా అందుబాటులోకి వస్తే ఎక్కువ దూరంలోని మార్కెట్లకు కూడా పండ్లను తక్కువ సమయంలో చేరవేసే అవకాశం ఉంటుంది. అంతేకాదు, రవాణా ఖర్చు తగ్గడంతో పాటు ప్రయాణ సమయంలో పండ్లు దెబ్బతినే అవకాశాలు కూడా తగ్గనున్నాయి. పంటను త్వరగా మార్కెట్‌కు చేర్చడంతో మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది.

రైల్వేకు ఆపిల్ రైతుల కృజ్ఞతలు  

రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల కాశ్మీర్‌ లోని ఆపిల్ రైతులు, వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  ప్రత్యేక రైళ్ల ద్వారా పండు త్వరగా మార్కెట్లకు చేరి మంచి లాభం పొందే అవకాశం ఉందంటున్నారు. వాస్తవానికి జమ్మూ కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థలో పండ్ల తోటలకు ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా ఆపిల్ సాగు వేలాది కుటుంబాలకు ఉపాధి, ఆదాయాన్ని అందిస్తోంది. పంట కోత సమయంలో రవాణా సదుపాయాలు సక్రమంగా ఉంటే రైతులకు మంచి ప్రయోజనం కలుగుతుంది. సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే ప్రత్యేక రైలు సేవలు ఆపిల్ రవాణాలో కొత్త మార్పు వచ్చే అవకాశం ఉంది. పంట నష్టం తగ్గడం, ఖర్చులు తగ్గడం, మార్కెట్లకు వేగంగా చేరడం ద్వారా కాశ్మీర్ ఆపిల్ రైతులకు మేలు కలగనుంది.

Advertisement

Read Also: ‘ఇరుముడి’ మూవీలోని ఈ లోకేషన్లు ఎక్కడ ఉన్నాయో తెలుసా? ఫిదా అయిపోతారు!

Tags

Related News

రైళ్లకు ‘ఎగ్జామ్ సెంటర్’ రెడీ.. పట్టాలెక్కే ముందుకు ఇక్కడ టెస్ట్ పాస్ కావాల్సిందే!

ఇదేం రిస్క్ రా బాబూ.. కదులుతున్న రైలును ఎగబడి ఎక్కుతున్న జనం.. హర్ష్ గోయెంకా షాకింగ్ రియాక్షన్!

కవల జంటలకు పెళ్లి చేసిన కవల ఫాస్టర్లు.. అక్కడంతా డబుల్ డబుల్!

రాఖీ పండుగ సందర్బంగా మంచి లగ్జరీ ట్రీప్ ప్లాన్ చేస్తున్నారా? బెస్ట్ ఆప్షన్స్ ఇవిగో

‘ఇరుముడి’ మూవీలోని ఈ లోకేషన్లు ఎక్కడ ఉన్నాయో తెలుసా? ఫిదా అయిపోతారు!

కారు నిండా ముద్దులు.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్, పాపం ప్రియుడు!

దేశంలో ఫస్ట్ హైస్పీడ్ టెస్ట్ ట్రాక్ రెడీ.. వందే భారత్‌కు మించి వేగంతో దూసుకెళ్లనున్న రైళ్లు!

Big Stories

Advertisement
×