E-Paper
Advertisement

అంధుడి పాత్రలో విజయ్ దేవరకొండ.. పోస్టర్ తో అంచనాలు పెంచిన శౌర్యవ్!

అంధుడి పాత్రలో విజయ్ దేవరకొండ.. పోస్టర్ తో అంచనాలు పెంచిన శౌర్యవ్!
Advertisement

VDxShouryuv: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న నటుడు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈయన సినిమాలకు సంబంధించి వరుస అప్డేట్స్ విడుదల చేస్తున్నారు. విజయ్ దేవరకొండ నటిస్తున్న రౌడీ జనార్ధన్, రణబాలి సినిమా నుంచి పోస్టర్ తో పాటు ఒక వీడియోను కూడా విడుదల చేశారు. అయితే ఈయన మరొక డైరెక్టర్ శౌర్యవ్(Shouryuv) దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే .ఇటీవల ఈ సినిమాని అధికారకంగా ప్రకటించారు. ఇక నేడు విజయ్ దేవరకొండ పుట్టినరోజు (Vijay Devarakonda) కావడంతో ఈ సినిమా నుంచి మరొక పోస్టర్ విడుదల చేశారు.

ప్రపంచం చేత నిందించబడ్డాడు..

ఈ పోస్టర్ కాస్త ఆసక్తికరంగా మారటమే కాకుండా ఈ పోస్టర్ పట్ల ఎన్నో సందేహాలను కూడా రేకెత్తిస్తోంది. విజయ్ దేవరకొండ ఒక కుర్చీలో కూర్చుని చేతిలో కత్తి పట్టుకొని కళ్ళకు క్లాత్ కట్టి ఉన్నటువంటి ఫోటోని షేర్ చేశారు. ఇక ఈ ఫోటోని విడుదల చేసిన చిత్ర బృందం”ప్రపంచం చేత నిందించబడ్డాడు విధి చేత పట్టాభిషిక్తుడయ్యాడు ” అనే క్యాప్షన్ తో ఈ పోస్టర్ విడుదల చేస్తూ విజయ్ దేవరకొండకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

కళ్ళు కనిపించని వ్యక్తిగా విజయ్ దేవరకొండ..

Advertisement

ఇక ఈ పోస్టర్ లో కళ్లకు గంతులు కట్టి ఉన్న నేపథ్యంలో విజయ్ దేవరకొండ ఈ సినిమాలో అందుడిగా కనిపించబోతున్నారా? అందుకే కళ్ళకు గంతులు కట్టారా? అంటూ ఎన్నో సందేహాలు వ్యక్తం చేయడమే కాకుండా ఇది వరకు విడుదల చేసిన పోస్టర్లో విజయ్ దేవరకొండ పక్కన కుక్కలు వెళుతున్నటువంటి పోస్టర్ గురించి కూడా అభిమానులు స్పందిస్తూ.. విజయ్ కళ్ళు కనిపించని పాత్రలో నటిస్తున్న నేపథ్యంలో ఈయన కుక్కల సహాయంతో ముందుకు వెళుతున్నారా అంటూ ఎన్నో సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.

Advertisement

ఒకవేళ ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కళ్ళు కనిపించని వ్యక్తి పాత్రలో కనుక నటించినట్లు అయితే ఈ సినిమా విజయ్ కెరీర్ లోనే కీలకంగా మారుతుందని చెప్పాలి. మరి విజయ్ దేవరకొండ శౌర్యవ్ సినిమా గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలి అంటే విజయ్ దేవరకొండ పాత్ర గురించి చిత్ర బృందం అధికారకంగా స్పందించాల్సి ఉంది. ఇక ఈ సినిమాని వైరా క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్ ఎవరు ఏంటి అనే విషయాల గురించి ఇప్పటివరకు స్పష్టత లేదు కానీ ఈ సినిమాలో విజయ్ జోడిగా కృతి సనన్ నటించబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి కానీ ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను అధికారికంగా వెల్లడించబోతున్నారు.

Also Read: పెళ్లి చేసుకున్న జబర్దస్త్ ప్రవీణ్.. పెళ్లి వీడియో వైరల్!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×