Shalini Pandey: షాలిని పాండే (Shalini Pandey)తెలుగులో నటించింది ఒక్క సినిమా అయినప్పటికీ ఈమె మాత్రం ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకు అలా గుర్తిండి పోయిందనే చెప్పాలి. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరోగా నటించిన అర్జున్ రెడ్డి(Arjun Reddy) అనే సినిమా ద్వారా ఈమె హీరోయిన్గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తెలుగులో ఈమెకు ఇదే మొదటి సినిమా అయినప్పటికీ మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమాలో ప్రీతి పాత్రలో షాలిని తన నటనతో అదరగొట్టారని చెప్పాలి. ఇక ఈ సినిమా తర్వాత ఈమె పెద్దగా తెలుగు సినిమాలలో నటించలేదు.
ఎవరా డైరెక్టర్?
అర్జున్ రెడ్డి సినిమాతో హిట్ కొట్టిన షాలిని పాండే అనంతరం తమిళ, హిందీ భాషలలో కూడా సినిమా అవకాశాలను అందుకున్నారు. అక్కడ కూడా పెద్దగా సక్సెస్ మాత్రం అందుకోలేకపోయారు.. ఇలా షాలిని సినిమాలలో కంటే కూడా ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తున్నారు. నిత్యం హాట్ ఫోటోలకు ఫోజులిస్తూ తన అంద చందాలతో సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈమె ఇండస్ట్రీలో ఒక దర్శకుడు గురించి సంచలన వ్యాఖ్యలు చేయడంతో మరోసారి వార్తల్లో నిలిచారు.
అనుమతి లేకుండా…
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె మాట్లాడుతూ తన సినీ కెరియర్లో తనకు ఎదురైన చేదు సంఘటనల గురించి తెలియజేశారు.”తాను ఒక సినిమా షూటింగ్ కోసం వ్యానిటీ వ్యాన్ లో బట్టలు మార్చుకుంటూ ఉండగా ఒక స్టార్ డైరెక్టర్ నా అనుమతి లేకుండా లోపలికి వచ్చారని ఈమె తెలిపారు. ఆ సమయంలో అతను నన్ను న్యూ* గా చూసేసారు అంటూ తెలియచేశారు. అయితే హీరోయిన్ల విషయంలో ఇండస్ట్రీలో ఇలాంటివన్నీ సర్వసాధారణంగా జరుగుతాయి అంటూ శాలిని పాండే చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సంచలనగా మారాయి. అయితే ఏ సినిమా షూటింగ్ సమయంలో తనకు ఇలాంటి అనుభవం ఎదురైంది?ఆ డైరెక్టర్ ఎవరు? అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు.
ఇలా దర్శకుడు ఎవరో చెప్పకుండా ఈమె చేసిన ఈ వ్యాఖ్యలు మాత్రం సంచలనంగా మారడంతో ఆ డైరెక్టర్ ఎవరై ఉంటారు అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లుగా అవకాశాలు అందుకోవాలన్నా, మంచి సినిమాలలో అవకాశాలు రావాలన్నా కూడా ఇలాంటి ఇబ్బందులను హీరోయిన్లు ఎదుర్కొక తప్పదు అంటూ ఇదివరకే ఎంతోమంది వారికి ఎదురైన చేదు సంఘటనల గురించి బహిరంగంగా తెలియజేశారు. ఇలా ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొన్నామని ఎంతోమంది సెలబ్రిటీలు మీడియా ముందు చెప్పారే కానీ అందుకు కారణమైన వ్యక్తుల పేర్లను మాత్రం బయట పెట్టడానికి ఇష్టపడటం లేదు. తాజాగా షాలిని పాండే కూడా డైరెక్టర్ గురించి ఆరోపణలు చేశారు కానీ ఆయన ఎవరు అనే విషయాలు మాత్రం బయట పెట్టలేదు.
Also Read: Keerthy Suresh: రౌడీ హీరోతో మహానటి..ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చేసిందిగా?