Naga bandham:తెలుగు సినిమా విజువల్ స్థాయిని పెంచిన అరుంధతి, అంజి, ఒక్కడు వంటి 150కి పైగా చిత్రాలకు అద్భుతమైన సెట్స్ వేసిన లెజెండరీ ఆర్ట్ డైరెక్టర్ అశోక్ కుమార్ తాజాగా ‘నాగబంధం’ సినిమాతో మరో విజువల్ వండర్‌ను మన ముందుకు తీసుకురాబోతున్నారు. జూలై 3న రిలీజ్ కానున్న ఈ పాన్ ఇండియా మైథాలజికల్ ఫాంటసీ సినిమా కోసం ఆయన పడిన కష్టం, ఇండస్ట్రీలో ఎవరూ ఊహించని విశేషాలను ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ప్రస్తుతం ఆ షాకింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
‘నాగబంధం’ సినిమా ఎంత భారీ స్కేల్‌లో తెరకెక్కుతోందో చెప్పడానికి ఈ ఒక్క విషయమే నిదర్శనం. సినిమా క్లైమాక్స్ సెట్ కోసం మాత్రమే నిర్మాతలు దాదాపు రూ. 20 కోట్ల భారీ బడ్జెట్ ఖర్చు పెట్టారట. ఇక అక్కడ ఒక భారీ మాసివ్ డోర్ బ్యాక్‌డ్రాప్‌లో పెద్ద యుద్ధమే జరుగుతుందని, ఆ క్లైమాక్స్ సెట్ చూస్తే ప్రతి ఒక్కరికీ గూస్ బంప్స్ రావడం ఖాయమని అశోక్ కుమార్ వెల్లడించారు.
ఈ సినిమా కథ అంతా ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన కేరళలోని అనంత పద్మనాభస్వామి టెంపుల్ నిధి, అక్కడి రహస్య చాంబర్స్ ఆధారంగా సాగుతుంది. ఇక విష్ణుమూర్తి పడుకుని ఉన్నప్పుడు పాములు పడగ విప్పే ఒక షాట్ చూసి తానే మొదటిసారి షాక్ అయ్యానని అశోక్ అన్నారు. ఈ టెంపుల్ సెట్‌ను ఎంతో అథెంటిక్‌గా, రియలిస్టిక్‌గా రీక్రియేట్ చేయడానికి రెండేళ్ల పాటు ఎంతో రీసెర్చ్ చేయాల్సి వచ్చిందని ఆయన చెప్పారు.
తన పాత సినిమాల గురించి గుర్తుచేసుకుంటూ మహేష్ బాబు ‘ఒక్కడు’ సినిమా విశేషాలను పంచుకున్నారు. ఇక మొదట ఆ సినిమా వేరే ప్రొడక్షన్‌లో జరగాల్సి ఉందని, చార్మినార్ సెట్ విషయం తేలాక హోల్డ్‌లో పడితే.. చివరకు ఎమ్మెస్ రాజు గారి చేతిలోకి వచ్చిందన్నారు. తాను మొదట వేసిన స్కెచ్ కాస్త పెద్దదైతే, ఎమ్మెస్ రాజు గారు బడ్జెట్ లిబర్టీ ఇచ్చి 60 ఫీట్ డౌన్ చేసి అద్భుతంగా ప్లాన్ చేశారని గుర్తుచేసుకున్నారు.
also read:Rao Bahadur:ఆ హీరోలే రోల్ మోడల్.. ‘రావు బహదూర్’ విశేషాలు పంచుకున్న సత్యదేవ్!
‘బొబ్బిలి రాజా’ క్లైమాక్స్‌లో వెంకటేష్ గారిపై పాములు ఎక్కే సీన్ కోసం అప్పట్లోనే కొద్దిగా గ్రాఫిక్స్ వాడామని చెప్పారు. అలాగే ‘అరుంధతి’ సినిమాలో విలన్ పశుపతిని సమాధి చేసే విధానం, ఆ రావి చెట్టు పెట్టడం తనకు పెద్ద ఛాలెంజ్ అని, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఎంతో పట్టుదలతో ఆ సినిమాను పూర్తి చేశారని కొనియాడారు. ఇక ‘పౌర్ణమి’ సినిమా సమయంలో ప్రభాస్ ఎంతో ఫ్రెండ్లీగా ఉండేవారని చెప్పుకొచ్చారు.
సినిమా ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్ లో అందరికంటే ముందుగా సెట్‌కు వచ్చి, అందరికంటే చివర్లో వెళ్లేది ఆర్ట్ డిపార్ట్‌మెంటే అయినా స్టేజ్‌ల మీద వారికి దక్కాల్సినంత గుర్తింపు దక్కడం లేదని అశోక్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఏదేమైనా 90 శాతం సెట్స్‌లోనే షూటింగ్ జరుపుకున్న ‘నాగబంధం’ సినిమాతో అశోక్ కుమార్ గారు సృష్టించిన విజువల్ వండర్ జూలై 3న థియేటర్లలో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి..