Rao Bahadur:ప్రముఖ దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వంలో వర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ కథానాయకుడిగా త్వరలో ప్రేక్షకుల ముందు రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సైకాలజికల్ థ్రిల్లర్ మూవీ రావు బహదూర్. ఏ+ఎస్ మూవీస్, శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై చింత గోపాలకృష్ణారెడ్డి, అనురాగ్ రెడ్డి , శరత్ చంద్ర నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ కి మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వగా.. అది భారీ అంచనాలను పెంచేసింది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ ,టీజర్, పాటలు సినిమాపై అంచనాలు పెంచేసేయ్. ఇక జూలై 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో హీరో సత్యదేవ్ మీడియా సమావేశంలో పాల్గొని సినిమా విశేషాలు పంచుకున్నారు.
రావు బహదూర్ సినిమా చూసిన తర్వాత వచ్చిన నమ్మకం. అది మేము సినిమా మొదలు పెట్టినప్పుడు “మునుపెన్నడూ చూడని విధంగా తెలుగు సినిమా” అనే ట్యాగ్ లైన్ ను అనుకున్నాము. ఇక మహేష్ బాబు ఈ సినిమా చూసిన తర్వాత కూడా అదే ట్యాగ్ లైన్ చెప్పారు. ఇప్పటివరకు సినిమా చూసిన ఫిలిం మేకర్స్ కూడా “మునుపెన్నడూ చూడని తెలుగు సినిమా” అని చెబుతున్నారు. ఇదంతా మాకు సినిమా చూసిన తర్వాత వచ్చిన నమ్మకం అంటూ తెలిపారు.
కంప్లీట్ సైకలాజికల్ డ్రామా.. మ్యాజికల్ రియలిజం, డార్క్ కామెడీ సబ్ జానర్స్ గా ఉంటాయి. ఏదైనా మెటాఫర్ ను విజువల్ గా చేసి చూపించడం మ్యాజికల్ రియలిజం. కాకపోతే కొన్నిసార్లు అది భయంకరంగా అనిపించవచ్చు. టీజర్ లో మీరు వేర్లు వెంటాడుతున్న విజువల్ ఒకటి చూసి ఉంటారు కదా.. అయితే అది థియేటర్లో చూసినప్పుడు ప్రేక్షకులకు పూర్తిగా క్లియర్ గా అర్థం అవుతుంది.
నిజానికి మనం మామూలుగా చేసే సినిమాల కంటే 300% ఎక్కువగా ఈ సినిమా కోసం కష్టపడాలని తెలుసు. అలాగే ఇది హెవీ మేకప్ అని కూడా తెలుసు. అందుకే కమలహాసన్, సూర్య, విక్రమ్ లాంటి హెవీ మేకప్ సినిమాలు ప్రయత్నిస్తుంటారు. అది చూస్తున్నప్పుడు నేను కూడా ఎప్పుడైనా అలాంటి సినిమా చేయాలి అనుకునేవాడిని. ఇక నేను యాక్టర్ అయినప్పటి నుంచి అది నా డ్రీమ్.. అవకాశం ఇప్పుడు రావు బహదూర్ తో వచ్చింది. ఇక మనం కోరుకున్నది మన దగ్గరకు వచ్చినప్పుడు కచ్చితంగా సంతోషపడతాము. మేకప్ కంటే మైండ్ మేకప్ చాలా ముఖ్యం. ప్రతిరోజు 16 గంటలు పని చేయాలని నేను ముందే నిర్ణయించుకున్నాను. అలా ప్రతిరోజూ హ్యాపీగా వెళ్లి ఎంజాయ్ చేస్తూ సినిమాలో నటించాను. మేకప్ వేయడానికి 5 గంటలు, తీయడానికి గంటన్నర సమయం పట్టేది. ఇలాంటి పాత్రలు చేయాలంటే సహనం కావాలి . సినిమా చేసిన తర్వాత నాలో కూడా సహనం ఉందని అర్థమయింది అంటూ తెలిపారు.
ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఈ సినిమాలో ఉంది. దీప నాతో పాటు ఈక్వల్ గా పెర్ఫార్మెన్స్ చేసింది. ఇందులో నటించిన ప్రతి ఒక్కరు కూడా తమ పాత్రలకు బెస్ట్ ఇచ్చారు.
యాక్షన్ సీక్వెన్స్ లు ఏమీ లేవు.. యాక్టింగ్ సీక్వెన్స్ లు ఉన్నాయి. ఒక పాట కంప్లీట్ గా రోప్ పై ఉంటుంది. ఇప్పటికే రిలీజ్ అయిన వాటితో పాటు ఇంకా మూడు పాటలు ఉన్నాయి. అందులో రెండు డాన్స్ నంబర్స్ .. నా కెరియర్ లో ఫస్ట్ టైం ఇంతలా డాన్స్ చేసిన సినిమా కూడా ఇదే. ఈ సినిమా కోసం నేను సాల్సా కూడా నేర్చుకున్నాను.
ప్రతి ఒక్కరూ డ్యూటీ చేస్తే సినిమా రావు బహదూర్ లా ఉంటుంది అని నాని అన్నారు..
సినిమా చూసిన తర్వాత మహేష్ బాబు, నమ్రత దాదాపు 40 నిమిషాల పాటు ఈ సినిమా గురించి మాట్లాడారు. ఆయన ఈ సినిమా టీజర్ కి వాయిస్ ఓవర్ ఇచ్చారు. సుకుమార్ కూడా ఈ సినిమా చూశారు. ఆయన కూడా మంచి రివ్యూ ఇచ్చారు.
ఇక ఈ సినిమా ఒక డిఫరెంట్ విజువల్ స్పెక్టాకిల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే మూవీ.. ప్రేక్షకుడు పెట్టే టిక్కెట్ కి పూర్తి విలువ ఇచ్చే మూవీ.. ఇందులో స్మరణ్ సాయి మ్యూజిక్ చాలా అద్భుతంగా ఇచ్చారు.
రావు బహదూర్ లో రామప్ప క్యారెక్టర్ కు ఎలాంటి రిఫరెన్స్ లేదు. రామప్ప వెరీ మ్యాడ్ క్యారెక్టర్. ఈ సినిమా చూసిన తర్వాత రామప్పలా చేయాలి అని ఒక రిఫరెన్స్ పాయింట్ ఏర్పడుతుంది. రామప్ప క్యారెక్టర్ చేస్తున్నప్పుడు నన్ను ఆవహించాడేమో అన్నట్టుగా అనిపించింది. అంతలా నేను ఈ పాత్రలో లీనమైపోయాను. ప్రతి సన్నివేశంలో చాలా రిచ్ రైటింగ్, డిటైలింగ్ ఉంటుంది. వెంకటేష్ మహా ప్రతి లేయర్ ను చాలా అద్భుతంగా రాసుకున్నాడు. సినిమా రిపీట్ గా చూసేలా ఉంటుంది.
also read:రావు సాహెబ్ నటి కన్నుమూత.. ఎమోషనల్ పోస్ట్ పంచుకున్న అనుపమ్ ఖేర్!
1960 – 99 మధ్య జరిగే కథ ఇది. ఇందులో హీరో దేశ సంచారి. తను అలా సంచారం చేస్తూ మళ్ళీ తన ప్యాలెస్ భువనాలయం కి వచ్చినప్పుడు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అనేది ఇక్కడ ఆసక్తికరంగా సాగే అంశం.
మొన్నటి వరకు నా కెరియర్లో జ్యోతిలక్ష్మికి ముందు, ఆ తర్వాత అని నేను చూసుకునే వాడిని.. కానీ ఇప్పుడు రావు బహదూర్ కి ముందు, ఆ తర్వాత అన్నట్టుగా చూస్తారని నేను నమ్ముతున్నాను.. అంటూ తన అభిప్రాయాలను పంచుకున్నారు.
నేను ఈ చిత్రం తర్వాత ఫుల్ బాటిల్, సమవర్తి అనే రెండు చిత్రాలు చేస్తున్నాను అంటూ తెలిపారు.